Diviki Diviki: డివికి డివికి సాంగ్ జోష్.. కానీ గోదారి గట్టు మీద, మీసాల పిల్ల మ్యాజిక్‌ను అనిల్ రావిపూడి మిస్ అయ్యారా?

Diviki Diviki Song: అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘డివికి డివికి’ విడుదలై సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే అనిల్ గత సంక్రాంతి బ్లాక్‌బస్టర్ పాటలైన ‘గోదారి గట్టు మీద’, ‘మీసాల పిల్ల’ సృష్టించిన స్థాయి బజ్‌ను ఈ పాట అందుకోలేకపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది.

Published on: Nov 21, 2026, 19:42:44 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Diviki Diviki Song: సంక్రాంతి బరిలో దిగితే చాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండగ ఖాయం అని నిరూపించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన 2027 పొంగల్ కోసం ‘జనవరి 12 విడుదల’ అనే క్రేజీ మల్టీస్టారర్‌తో సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ బావ బామ్మర్దులుగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘డివికి డివికి’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.

డివికి డివికి సాంగ్ జోష్.. కానీ గోదారి గట్టు మీద, మీసాల పిల్ల మ్యాజిక్‌ను అనిల్ రావిపూడి మిస్ అయ్యారా? (x/Shine_Screens)
డివికి డివికి సాంగ్ జోష్.. కానీ గోదారి గట్టు మీద, మీసాల పిల్ల మ్యాజిక్‌ను అనిల్ రావిపూడి మిస్ అయ్యారా? (x/Shine_Screens)

డివికి డివికి సాంగ్

కీర్తి సురేశ్, కృతి శెట్టి వదిన మరదళ్లుగా సంప్రదాయ లంగా ఓణీల్లో మెరిసిపోతూ వేసిన హుషారైన స్టెప్పులతో డివికి డివికి పాట సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. అయితే పాట విడుదలైన కొద్ది గంటల్లోనే అనిల్ రావిపూడి గత చిత్రాల ఫస్ట్ సాంగ్స్‌తో పోలికలు మొదలయ్యాయి. ఆ స్థాయిలో ఈ పాట ఇన్ స్టంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

‘గోదారి గట్టు మీద’, ‘మీసాల పిల్ల’ సృష్టించిన సునామీ

అనిల్ రావిపూడి గత రెండు సంక్రాంతి చిత్రాల ప్రమోషన్లలో ఫస్ట్ సింగిల్స్ పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి వచ్చిన ‘గోదారి గట్టు మీద’ పాట విడుదలైన క్షణం నుంచే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రమణ గోగుల, మధుప్రియ గాత్రంతో భీమ్స్ సిసిరోలియో అందించిన ఆ ట్యూన్ కోట్లాది వ్యూస్ సాధించి సినిమాకు భారీ హైప్ తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘మీసాల పిల్ల’ కూడా అదే స్థాయిలో ఊపేసింది. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన ఈ మెలోడీకి భీమ్స్ సంగీతం తోడవ్వడంతో, విడుదలైన కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఆ రెండు పాటలు విన్న వెంటనే ప్రేక్షకుల నోళ్లలో నానిపోయేలా క్యాచీగా కుదిరాయి.

‘డివికి డివికి’ కారణాలేంటి?

ఈసారి ‘జనవరి 12 విడుదల’ కోసం అనిల్ రావిపూడి తన ఆస్థాన సంగీత దర్శకుడు భీమ్స్‌ను కాకుండా జి.వి. ప్రకాశ్ కుమార్‌తో జతకట్టారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ‘డివికి డివికి’ పాటను మధుప్రియ, హరిప్రియ ఎంతో ఉత్సాహంగా ఆలపించగా, బృందా మాస్టర్ కలర్‌ఫుల్‌గా కొరియోగ్రఫీ చేశారు. “మా హామీ నువ్వే.. శివగామి నువ్వే” అంటూ సాగే ఈ వదిన మరదళ్ల ఫెస్టివ్ నంబర్ చూడటానికి పండుగ కళతో బాగానే ఉన్నప్పటికీ, ట్యూన్ పరంగా ఆశించిన స్థాయిలో కిక్ ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత రెండు పాటల్లో రమణ గోగుల, ఉదిత్ నారాయణ్ లాంటి స్టార్ సింగర్ల నోస్టాల్జిక్ వాయిస్ మ్యాజిక్ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య సరదా కెమిస్ట్రీ ఆ పాటలకు ప్రధాన బలంగా నిలిచింది. కానీ ‘డివికి డివికి’ పూర్తిగా మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకున్న గర్ల్స్ యాంథమ్‌లా రూపొందడంతో, వెంకటేశ్, కల్యాణ్ రామ్ అభిమానులు ఆశించిన మాస్ ఎలిమెంట్స్ కాస్త తగ్గాయనే చర్చ నడుస్తోంది.

స్లో పాయిజన్‌లా పుంజుకుంటుందా?

ఫస్ట్ టైమ్ వినగానే ‘గోదారి గట్టు మీద’, ‘మీసాల పిల్ల’ స్థాయిలో డివికి డివికి అంచనాలను అందుకోకపోయినా, అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్ట్రాటజీని తక్కువ అంచనా వేయలేం. రీల్స్, హుక్ స్టెప్పులతో పాటలను జనంలోకి ఎలా తీసుకెళ్లాలో ఆయనకు బాగా తెలుసు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ రాయలసీమ నేపథ్య కుటుంబ కథా చిత్రం 2027 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పండుగ సీజన్ దగ్గరపడే కొద్దీ ‘డివికి డివికి’ పాట రీల్స్ రూపంలో పుంజుకుని బజ్ పెంచుతుందా, లేక తదుపరి పాటలతో జి.వి. ప్రకాశ్ కుమార్ అసలైన మ్యూజికల్ మ్యాజిక్ చూపిస్తాడా అనేది వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.