Jayasudha Allu Aravind: హీరోగా మారనున్న స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. జయసుధ హీరోయిన్.. మూవీ టైటిల్ కూడా ఫిక్స్!

Jayasudha Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హీరోగా మారబోతున్నారు!  ఈ వయసులో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఏంటీ అనుకుంటున్నారా? అవును.. ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ హీరోయిన్ గా నటిస్తారంటా. రీసెంట్ గా సమ్మర్ హాలీడేస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ రకంగా జయసుధ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. 

Published on: Nov 4, 2026, 08:47:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Allu Aravind Jayasudha Movie: అల్లు అరవింద్.. ఈ పేరు వినగానే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ గుర్తుకొస్తుంది. ఇక చిరంజీవి బావమరిది, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అని కూడా అల్లు అరవింద్ గురించి చెప్పుకుంటారు. కానీ అల్లు అరవింద్ హీరో అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పడం విన్నారా? కానీ జయసుధ మాటలను బట్టి అలా చెప్పుకోవాల్సి వస్తుందేమో!

హీరోగా మారనున్న స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. జయసుధ హీరోయిన్.. మూవీ టైటిల్ కూడా ఫిక్స్!
హీరోగా మారనున్న స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. జయసుధ హీరోయిన్.. మూవీ టైటిల్ కూడా ఫిక్స్!

హీరోగా అల్లు అరవింద్

తెలుగులో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్ కొడుకులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా హీరోగా మారబోతున్నారనే టాక్ వైరల్ గా మారింది. తాజాగా సమ్మర్ హాలీడేస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటి జయసుధ సరదాగా చేసిన కామెంట్లతో ఈ టాపిక్ వైరల్ గా మారింది.

అల్లు అరవింద్ మంచి నటుడు

సమ్మర్ హాలీడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జయసుధ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ‘‘నాకు సూపర్ అంటే అల్లు అరవింద్ గారు. మాది ఎన్నో ఏళ్ల పరిచయం. ఆయన సూపర్ యాక్టర్. ఈ యంగర్ జనరేషన్ కు ఆ విషయం తెలియదేమో. చాలా బాగా యాక్ట్ చేస్తారు’’ అని జయసుధ చెప్పారు.

మూవీ టైటిల్ ఇదే

‘‘నేనెప్పుడో చెప్పా. మీరు, నేను కలిసి యాక్ట్ చేద్దాం, ఓ మూవీ తీయండి అల్లు అరవింద్ గారు అని అడిగా. ఇప్పుడు ఒక సినిమా మీరు ప్రొడ్యూస్ చేస్తారు. మనం ఇద్దరం యాక్ట్ చేయబోతున్నాం. టైటిల్ ‘రోమన్ హాలీడే’ అని పెట్టుకుందాం’’ అని జయసుధ నవ్వేశారు. ఆ మాటలకు కింద చైర్లో ఉన్న అల్లు అరవింద్ కూడా నవ్వుతూనే ఉన్నారు.

వీడియో వైరల్

జయసుధ కామెంట్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగానే అల్లు అరవింద్ హీరోగా నటిస్తే చూడాలని ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి కూడా హీరోగా మారి, కొడుక్కి పోటీ ఇవ్వాలని ఫన్నీగా కౌంటర్లు వేస్తున్నారు.

ఓటీటీ వెబ్ సిరీస్

మరోవైపు జయసుధ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ గా కొన్ని దశాబ్దాల క్రితమే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. దిగ్గజ నటులతో కలిసి నటించారు. హీరోయిన్ గా కెరీర్ ఎండ్ అయ్యాక.. మదర్ క్యారెక్టర్లతోనూ అదరగొడుతున్నారు. తాజాగా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ డ్రామా ‘లవ్ ఆల్వేస్’తో ఆమె ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More