JD Chakravarthy: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలు చేస్తు సాగిపోతున్నాడు ఒకప్పటి హీరో జేడీ చక్రవర్తి. ఈ మధ్య సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. తాజాగా గాయపడ్డ సింహం మూవీలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ పాడ్ కాస్ట్ లో జేడీ చక్రవర్తి సంచలన కామెంట్లు చేశాడు.
జేడీ చక్రవర్తి కామెంట్లు

గాయపడ్డ సింహం ప్రమోషన్లతో జేడీ చక్రవర్తిగా బిజీగా ఉన్నాడు. తాాజగా ఓ పాడ్ కాస్ట్ లో అతను చేసిన కామెంట్లు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇండియా గౌరవించే ఓ గొప్ప నటుడు బయట ఎలా ఉన్నాడోననే షాకింగ్ విషయాలను జేడీ చక్రవర్తి చెప్పాడు.
చాలా రెస్పెక్ట్
‘‘అసలు విషయం తెలుసుకోకుండా ఎవరిపైనా అయినా గౌరవం పెంచుకోవద్దు. ఇంప్రెషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఉన్న ఓ యాక్టర్ ఉన్నాడు. అతని పేరు చెప్పను. ఆంధ్ర దేశానికి, తెలంగాణకే కాదు ఇండియాకు కూడా ఓ గొప్ప రెస్పెక్ట్ ఉన్న మనిషి ఆయన. రియల్ లైఫ్ లోనూ అలాగే ఉంటారని నేను ఎక్స్ పెక్ట్ చేశా’’ అని జేడీ చక్రవర్తి తెలిపాడు.
తాగింది దిగలేదని
జేడీ చక్రవర్తి ఊహించినట్లుగా నిజ జీవితంలో ఆ నటుడు లేడని అతను తెలిపాడు. ‘‘ఆయన షూటింగ్ కు కొంచెం లేటుగా వస్తారని అన్నారు. ఎందుకంటే, తాగింది దిగలేదన్నారు. తాగుతారా? అని అడిగా. అవునని అన్నారు. అలాగే హోటల్లో లేరని చెప్పారు. అప్పటికే అతను ఓల్డ్ మ్యాన్. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారని అన్నారు. పెళ్లయింది కదా అని అడిగా. అవును, కానీ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారని చెప్పారు. ఆయన ఇమేజ్ ను బట్టి మహానుభావుడని అనుకున్నా’’ అని జేడీ చక్రవర్తి సంచలన విషయాలు బయటపెట్టాడు.
ఎవరా నటుడు?
జేడీ చక్రవర్తి కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. దీంతో ఎవరా గొప్ప నటుడు? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇన్ని విషయాలు చెప్పిన జేడీ చక్రవర్తి, ఆ నటుడి పేరు మాత్రం చెప్పలేదు.
గాయపడ్డ సింహం గురించి
{{/usCountry}}జేడీ చక్రవర్తి కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. దీంతో ఎవరా గొప్ప నటుడు? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇన్ని విషయాలు చెప్పిన జేడీ చక్రవర్తి, ఆ నటుడి పేరు మాత్రం చెప్పలేదు.
గాయపడ్డ సింహం గురించి
{{/usCountry}}తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ ‘గాయపడ్డ సింహం’. ఇందులో మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లు. ఈ చిత్రానికి కశ్యప్ డైరెక్టర్. జేడీ చక్రవర్తి ఇందులో కీలక పాత్ర పోషించాడు. గాయపడ్డ సింహం మూవీ మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అమెరికా వెళ్లాలనుకుడే యువకుడికి ఎదురయ్యే పరిస్థితులను ఇందులో ఫన్నీగా చూపించారని తెలిసింది.