...
...
Next Story

Ritesh Rana: జెట్లీ డైరెక్టర్ సంచలన నిర్ణయం.. నెక్ట్స్ ఒక్క కామెడీ సీన్ కూడా ఉండదు.. హారర్ మూవీ చేస్తానన్న రితేష్ రాణా

Ritesh Rana: కామెడీ సినిమాలతోనే డిఫరెంట్ ప్రయోగాలు చేస్తూ సాగిపోతున్నాడు యంగ్ డైరెక్టర్ రితేష్ రాణా. తాజాగా కమెడియన్ సత్యను హీరోగా పెట్టి ‘జెట్లీ’ అనే మూవీ తీశాడు. అయితే నెక్ట్స్ తన సినిమాలో కామెడీ ఉండదని రితేష్ చెప్పడం వైరల్ గా మారింది.

Published on: May 2, 2026, 21:52:47 IST
Advertisement

Ritesh Rana: టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్లు చాలా మంది వస్తున్నారు. వాళ్లలో కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు రితేష్ రాణా. కామెడీతోనే ప్రయోగాలు చేస్తూ, తన సినిమాలు డిఫరెంట్ అనే అభిప్రాయాన్ని ఇప్పటికే క్రియేట్ చేశాడు. కానీ సడెన్ గా కామెడీని దూరం పెట్టాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

రితేష్ రాణా కామెంట్లు

రితేష్ రాణా (x)
రితేష్ రాణా (x)

కమెడియన్ సత్య హీరోగా తాజాగా ‘జెట్లీ’ అనే మూవీకి రితేష్ రాణా దర్శకత్వం వహించాడు. ఈ కామెడీ మూవీ మే 1న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి డివైడ్ టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్ వర్కౌట్ కాలేదని కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం (మే 2) నిర్వహించిన సక్సెస్ మీట్ లో రితేష్ రాణా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

కామెడీ లేకుండా

‘‘ప్రతి సినిమా నుంచి ఓ ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు కదా. ఇప్పుడు జెట్లీలో సెకండాఫ్ బాలేదని అంటున్నారు. ఈ మూవీ నుంచి ఏం తీసుకుంటారు’’ అని రితేష్ రాణాను ఓ రిపోర్టర్ అడుగుతాడు. ‘‘కామెడీ సినిమా చేయొద్దని అనుకుంటున్నా. నా నెక్ట్స్ మూవీలో ఒక్క కామెడీ సీన్ కూడా ఉండదు. హారర్ మూవీ చేస్తా’’ అని రితేష్ రాణా వెల్లడించాడు.

మత్తు వదలరాతో

కార్తికేయ హీరోగా 2019లో వచ్చిన ‘మత్తు వదలరా’ మూవీతో డైరెక్టర్ గా రితేష్ రాణా డెబ్యూ చేశాడు. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ ప్లే చేసిన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీని రితేష్ తెరకెక్కించాడు. మళ్లీ ‘మత్తు వదలరా 2’ చేశాడు. ఇప్పుడేమో జెట్లీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

ప్రయోగాలతో

జెట్లీ గురించి

రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన ‘జెట్లీ’ మూవీలో సత్య, వెన్నెల కిశోర్, అజయ్, రియా తదితరులు నటించారు. రూ.15 వేల కోట్ల స్కామ్ చేసిన ఓ బిజినెస్ ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటాడు. అతణ్ని చంపేందుకు శత్రువులు ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో ఆ బిజినెస్ మ్యాన్ ఉన్న విమానంలోకి గతం మర్చిపోయిన హీరో ఎంట్రీ ఇస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే జెట్లీ మూవీ స్టోరీ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks