...
...
Next Story

OTT Review: ఓటీటీ రివ్యూ- చేతబడులు, మంత్రాల మధ్య గర్భవతి జీవితం- జియో హాట్‌స్టార్‌లోని హారర్ థ్రిల్లర్ భయపెట్టిందా?

JioHotstar OTT Movie Jhaad Phoonk Review In Telugu: జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతున్న న్యూ హారర్ థ్రిల్లర్ సినిమా ఝాద్ ఫూంక్. మూఢనమ్మకాలు, చేతబడి నేపథ్యంతో రూపుదిద్దుకుంది. లక్ష్యం విలన్ యశ్‌పాల్ శర్మ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఝాద్ ఫూంక్ ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 2, 2026, 18:00:28 IST
Advertisement

JioHotstar OTT Movie Jhaad Phoonk Review In Telugu: హారర్, మిస్టరీ చిత్రాలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. వీకెండ్‌లో ఒళ్లు గగుర్పొడిచే కథలను ఆస్వాదించే ఓటీటీ ప్రియుల కోసం జియో హాట్‌స్టార్ ఓ కొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది.

చేతబడి, తంత్ర విద్యల చుట్టూ

ఓటీటీ రివ్యూ- చేతబడులు, మంత్రాల మధ్య గర్భవతి జీవితం- జియో హాట్‌స్టార్‌లోని హారర్ థ్రిల్లర్ భయపెట్టిందా?
ఓటీటీ రివ్యూ- చేతబడులు, మంత్రాల మధ్య గర్భవతి జీవితం- జియో హాట్‌స్టార్‌లోని హారర్ థ్రిల్లర్ భయపెట్టిందా?

మూఢనమ్మకాలు, చేతబడి, తంత్ర విద్యల చుట్టూ తిరిగే 'ఝాద్-ఫూంక్' (Jhaad-Phoonk) ఓటీటీలో అలరిస్తోంది. 'ఇమ్లీ' సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సుంబుల్ తౌకీర్ ఖాన్, సీనియర్ నటులు యశ్‌పాల్ శర్మ (లక్ష్యం మూవీ విలన్), పద్మిని కొల్హాపురే ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించారు. అక్టోబర్ 30 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ మూవీ ఎలా ఉందో నేటి ఝాద్ ఫూంక్ రివ్యూలో తెలుసుకుందాం.

ఒకే ఇల్లు.. ఐదు పాత్రల చుట్టూ తిరిగే కథ

గర్భిణి అయిన ఆస్థ (సుంబుల్ తౌకీర్ ఖాన్), తన భాగస్వామి రాజ్‌వీర్‌తో కలిసి ఉత్తరాఖండ్ అడవుల గుండా ఢిల్లీకి ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురవుతుంది. స్పృహ తప్పిన ఆస్థ కన్నుతెరిచేసరికి ఒక తెలియని దంపతుల ఇంట్లో ఉంటుంది. మోహన్ ఠాకూర్ (యశ్‌పాల్ శర్మ), కామిని ఠాకూర్ (పద్మిని కొల్హాపురే) దంపతులు ఆమెను ఆప్యాయంగా ఆదరిస్తారు.

అయితే ఆ ప్రేమ వెనుక మోహన్ ఠాకూర్ భయంకరమైన కుట్ర దాగి ఉంటుంది. అక్కడ ఉన్న ఒక చిన్నారికి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించడానికి మోహన్ ఠాకూర్ చేతబడి, తంత్ర విద్యలను నేర్చుకుంటాడు. ఈ భయానక వాతావరణంలో చిక్కుకున్న ఆస్థ ఆ ఇల్లు దాటి బయటపడిందా? తన బిడ్డను కాపాడుకోగలిగిందా? ఆస్థకు తోడుగా ఉండే చిన్నపిల్లవాడు ఎవరు? అసలు మోహన్ ఠాకూర్ కుట్ర ఏంటీ? ఎందుకు ఆస్థను టార్గెట్ చేశాడు? అనేది తెలియాలంటే ఝాద్ ఫూంక్ చూడాల్సిందే.

ప్రథమార్థం భయం.. ద్వితీయార్థంలో తగ్గిన జోరు

అయితే, ద్వితీయార్థంలో కథ ముందుకు సాగేకొద్దీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తగ్గుముఖం పడతాయి. కథనం నెమ్మదించడంతో సీన్లు కొద్దిగా బోర్ కొట్టిస్తాయి. ఆరంభంలో ఉన్న బిగుతు క్లైమాక్స్‌లో లోపించడంతో సాధారణ ముగింపులా అనిపిస్తుంది.

సమాజానికి ఇచ్చే బలమైన సందేశం

భయపెట్టే అంశాలతో పాటు సమాజంలో వేళ్లూనుకున్న అంధ విశ్వాసాలపై దర్శకుడు రాజన్ వర్మ ఈ చిత్రం ద్వారా ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. తంత్ర విద్యలు, చేతబడుల పేరుతో అమాయక ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఆ భ్రమల్లో పడి ప్రాణాలు ఎలా కోల్పోతున్నారో స్పష్టంగా చూపించారు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

వీకెండ్‌లో చేతబడి, తాంత్రిక నేపథ్యంతో సాగే విభిన్న హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి 'ఝాద్-ఫూంక్' ఓసారి వీక్షించే మూవీ. మీకు హారర్ థ్రిల్లర్స్ ఇష్టమైతే జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ ఝాద్ ఫూంక్ మూవీపై ఓ లుక్కేసుకోండి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks