Jiohotstar Releases: ఓటీటీ లవర్స్ వీకెండ్ బింజ్ వాచ్ ప్లాన్ చేసుకోవడానికి జియోహాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ వారం హారర్ థ్రిల్లర్, మలయాళం థ్రిల్లర్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, అన్‌లిమిటెడ్ కామెడీ సినిమాలు, వెబ్ సిరీస్ తోపాటు బిగ్గెస్ట్ రియాలిటీ షోలు ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాయి.

అనిల్ కపూర్ కొత్త గేమ్ షో నుంచి మలయాళం మార్షల్ ఆర్ట్స్ మూవీ దాకా డిఫరెంట్ జానర్ కంటెంట్‌తో జియోహాట్‌స్టార్ ఈ వారాన్ని చాలా కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేసింది. ప్రతి ఒక్కరి టేస్ట్‌కు తగ్గట్టుగా రిలీజ్ అవుతున్న ఆ 6 ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ - సీజన్ 16
గ్లోబల్ వైడ్‌గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ డ్రామా 'ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ' కొత్త సీజన్ ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. న్యూయార్క్ హై-సొసైటీ మహిళల రియల్ లైఫ్ డ్రామా, ఫన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ షో కొత్త ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చాయి.
ది మమ్మీ (The Mummy)
హారర్, సూపర్‌నేచురల్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్ కోసం 'ది మమ్మీ' అనే డిఫరెంట్ మూవీ సిద్ధమైంది. అస్వస్థతకు గురై కనిపించకుండా పోయిన తమ కుమార్తె తిరిగి వచ్చిన తర్వాత, ఆమె ప్రవర్తనలో గమనించే వింత మార్పులు ఆ కుటుంబాన్ని ఎలాంటి భయాందోళనలకు గురిచేశాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇండియాస్ టాప్ 1 పర్సెంట్ (India's Top 1 Percent)
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ హోస్ట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ రియాలిటీ గేమ్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కంటెస్టెంట్ల తెలివితేటలకు, లాజికల్ థింకింగ్‌కు పరీక్ష పెట్టే వినూత్నమైన ప్రశ్నలతో ఈ షో సాగనుంది. ఈ పవర్ ప్యాక్డ్ గేమ్ షో సెప్టెంబర్ 18 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
తుడక్కమ్ (Thudakkam)
{{/usCountry}}బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ హోస్ట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ రియాలిటీ గేమ్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కంటెస్టెంట్ల తెలివితేటలకు, లాజికల్ థింకింగ్‌కు పరీక్ష పెట్టే వినూత్నమైన ప్రశ్నలతో ఈ షో సాగనుంది. ఈ పవర్ ప్యాక్డ్ గేమ్ షో సెప్టెంబర్ 18 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
తుడక్కమ్ (Thudakkam)
{{/usCountry}}మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న రా అండ్ రస్టిక్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా 'తుడక్కమ్'. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ఓటీటీ ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ రియలిస్టిక్ డ్రామా సెప్టెంబర్ 18 నుంచి అందుబాటులోకి వస్తుంది.
మాబ్ ల్యాండ్ - సీజన్ 2 (Mob Land Season 2)
లండన్ నగరం వేదికగా రెండు ప్రత్యర్థి నేరపూరిత ముఠాల మధ్య సాగే అధికారం, ఆధిపత్య పోరు ఆధారంగా రూపొందిన ఇంగ్లీష్ క్రైమ్ వెబ్ సిరీస్ 'మాబ్ ల్యాండ్'. మొదటి సీజన్ సక్సెస్ తర్వాత మరింత ఇంటెన్స్ యాక్షన్, ట్విస్టులతో వస్తున్న సీజన్ 2 సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బిగ్ బాస్ 10 (Bigg Boss 10), బిగ్ బాస్ 20
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 10 తెలుగు', బిగ్ బాస్ 20 హిందీ ప్రతిరోజూ జియోహాట్‌స్టార్‌లో ఎంటర్‌టైన్ చేస్తోంది. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌లో హిందీలో.. కింగ్ నాగార్జున తెలుగులో ఈ షోలను రక్తి కట్టిస్తున్నారు.