...
...
Next Story

Jiohotstar: మలయాళం క్రేజీ వెబ్ సిరీస్, సూపర్ హిట్ టాక్ షో చివరి సీజన్.. ఈవారం జియోహాట్‌స్టార్ టాప్ రిలీజెస్ ఇవే

Jiohotstar: జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈవారం సినిమాలే కాదు.. సరికొత్త క్రేజీ వెబ్ సిరీస్, రియాల్టీ షోలు కూడా ఎన్నో వస్తున్నాయి. వాటిలో టాప్ 8 ఏవో ఇక్కడ చూడండి. మలయాళం కామెడీ వెబ్ సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు.

Published on: Oct 13, 2026, 19:46:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jiohotstar: ఓటీటీ లవర్స్‌కి డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ఈ వారం నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి సిద్ధమైంది. ఈ వీకెండ్‌లో సినిమాలు కాకుండా ఏకంగా 8 అద్భుతమైన వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తున్నాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి మెడికల్ డ్రామాలు, సైన్స్ ఫిక్షన్ కంటెంట్ వరకు ప్రతి ఒక్కరి టేస్ట్‌కు తగ్గట్లుగా ఈ లైనప్ ఉంది.

Jiohotstar: మలయాళం క్రేజీ వెబ్ సిరీస్, సూపర్ హిట్ టాక్ షో చివరి సీజన్.. ఈవారం జియోహాట్‌స్టార్ టాప్ రిలీజెస్ ఇవే
Jiohotstar: మలయాళం క్రేజీ వెబ్ సిరీస్, సూపర్ హిట్ టాక్ షో చివరి సీజన్.. ఈవారం జియోహాట్‌స్టార్ టాప్ రిలీజెస్ ఇవే

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న మార్వెల్ మిని సిరీస్‌తో పాటు కరణ్ జోహార్ మోస్ట్ పాపులర్ చాట్ షో కొత్త సీజన్, మలయాళం వెబ్ సిరీస్ ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వారం డిజిటల్ స్క్రీన్‌లను షేక్ చేయడానికి వస్తున్న ఆ టాప్ 8 ప్రాజెక్ట్స్ విశేషాలు ఇక్కడ చూడండి.

ఈవారం జియోహాట్‌స్టార్ రిలీజెస్

ఓటీటీ : JioHotstar (జియోహాట్‌స్టార్)

మొత్తం రిలీజెస్ : 8 వెబ్ సిరీస్, మూవీస్, షోస్

జానర్లు : కామెడీ, థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్

ముఖ్యమైనవి : కప్పి స్క్వాడ్, కాఫీ విత్ కరణ్ సీజన్ 9, విజన్ క్వెస్ట్, తుల్సా కింగ్ సీజన్ 4

కాఫీ విత్ కరణ్ సీజన్ 9 (Oct 14)

సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ విజన్ క్వెస్ట్ (Oct 14)

తుల్సా కింగ్ సీజన్ 4 (Oct 16)

ఎంటీవీ రోడీస్ రీబర్త్ (Oct 16)

ఈ వారం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే టాప్ 8 సిరీస్ లిస్ట్

2. విజన్ క్వెస్ట్ (Vision Quest) - అక్టోబర్ 14: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మిని సిరీస్ ఇది. వైట్ విజన్ తన నిజమైన ఐడెంటిటీని వెతికే ప్రయాణంతో సాగే ఈ సిరీస్‌కు ఐఎండీబీలో ఏకంగా 8.8 రేటింగ్ దక్కడం విశేషం.

3. క్రిస్టల్ లేక్ (Crystal Lake) - అక్టోబర్ 15: లిండా కార్డెల్లిని లీడ్ రోల్‌లో నటించిన హారర్, మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. భయానక సన్నివేశాలతో థ్రిల్ ఫీలయ్యే వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

4. కప్పీ స్క్వాడ్ (Kappi Squad) - అక్టోబర్ 15: మలయాళం నుంచి వస్తున్న క్రేజీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ఇది. నలుగురు యువకులు తమ జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులు, అభద్రతా భావం బ్యాక్‌డ్రాప్‌లో ఇది తెరకెక్కింది.

5. గ్రేస్ అనాటమీ (Grey's Anatomy) - అక్టోబర్ 15: అమెరికన్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్‌లలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ వెబ్ సిరీస్ కొత్త ఎపిసోడ్లు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి.

6. 9-1-1 సీజన్ 10 (9-1-1 Season 10) - అక్టోబర్ 15: లాస్ ఏంజెల్స్‌లో ఫస్ట్ రెస్పాండర్స్, పారామెడిక్స్, ఫైర్‌ఫైటర్స్ ఎదుర్కొనే సవాళ్లతో సాగే హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా సిరీస్ కొత్త సీజన్ ఇది.

7. ఎంటీవీ రోడీస్: రోడీస్ రీబర్త్ (Roadies Rebirth) - అక్టోబర్ 16: యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న రియాలిటీ షో కొత్త వెర్షన్. నేహా ధూపియా, ప్రిన్స్ నరులా, నిఖిల్ చినప్ప, బాణీ జె గ్యాంగ్ లీడర్స్‌గా రాబోతున్నారు.

8. తుల్సా కింగ్ సీజన్ 4 (Tulsa King Season 4) - అక్టోబర్ 16: సిల్వెస్టర్ స్టాలోన్ లీడ్ రోల్‌లో నటించిన క్రైమ్ కామెడీ డ్రామా సిరీస్ లేటెస్ట్ సీజన్ ఇది. గత మూడు సీజన్లు సూపర్ హిట్ కావడంతో ఈ నాలుగో సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks