పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ సౌత్ పై తన పట్టును పెంచుకునేందుకు భారీ ప్లాన్ వేసింది. సౌత్ ఇండియా ఆడియన్స్ ను తనవైపు మరింతగా తిప్పుకునేందుకు మెగా ఈవెంట్ తో రాబోతుంది. సౌత్ అన్‌బౌండ్ పేరుతో భారీ ప్రోగ్రామ్ కు ప్లాన్ చేసిన జియోహాట్‌స్టార్ ఒకే రోజు సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు, సిరీస్ లు, షోల 40 టైటిళ్లను అనౌన్స్ చేయనుంది.
జియోహాట్‌స్టార్ సౌత్ అన్‌బౌండ్

సౌత్ అన్‌బౌండ్ పేరుతో జియోహాట్‌స్టార్ ఓటీటీ మెగా ఈవెంట్ కు ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్లోనే జియోహాట్‌స్టార్‌లో 2026లో రాబోతున్న 40 సినిమాలు, సిరీస్ లు, షోల టైటిల్స్ ను రివీల్ చేయనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులను రివీల్ చేయనుంది. డిసెంబర్ 9న చెన్నైలో ఈ ఈవెంట్ జరుగుతుంది.
లెజండరీ స్టార్లు
జియోహాట్‌స్టార్ సౌత్ అన్‌బౌండ్ ఈవెంట్ కు లెజెండరీ స్టార్లను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మోహన్ లాల్, కమల్ హాసన్ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఇన్విటేషన్ అందించారు. తెలుగు, కన్నడ నుంచి మరింత మంది దిగ్గజాలను పిలవబోతున్నారు. ఈ ఈవెంట్ పై హైప్ మరింత పెరిగే అవకాశముంది.
నెట్ ఫ్లిక్స్ జోరు
ఓ వైపు ఓటీటీ రంగంలో నెట్ ఫ్లిక్స్ దూకుడు ప్రదర్శించింది. ఇటీవల సౌత్ సినిమాల్లో ఎక్కువ భాగం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా డైరెక్ట్ గా సౌత్ ఇండియన్ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాలు, సిరీస్ లు రూపొందిస్తుంది.
ఈ క్రమంలో సౌత్ ఇండియాపై పట్టు సడలకుండా ఉండేందుకు జియోహాట్‌స్టార్ పెద్ద ప్లాన్ వేసింది. 2026లో తమ ఓటీటీలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల టైటిళ్లను ఒకేసారి అనౌన్స్ చేయనుంది. దీంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆడియన్స్ ను మరింత అట్రాక్ట్ చేయాలని చూస్తోంది.
జియోహాట్‌స్టార్ ట్రెండింగ్
{{/usCountry}}ఈ క్రమంలో సౌత్ ఇండియాపై పట్టు సడలకుండా ఉండేందుకు జియోహాట్‌స్టార్ పెద్ద ప్లాన్ వేసింది. 2026లో తమ ఓటీటీలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల టైటిళ్లను ఒకేసారి అనౌన్స్ చేయనుంది. దీంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆడియన్స్ ను మరింత అట్రాక్ట్ చేయాలని చూస్తోంది.
జియోహాట్‌స్టార్ ట్రెండింగ్
{{/usCountry}}ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ లో బిగ్ బాస్ జోరు కొనసాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ట్రెండింగ్ నంబర్ వన్ గా ఉంది. ఈ సీజన్ లో ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత తమిళ సినిమా ఆన్ పావమ్ పొల్లతాతు, మలయాళం హారర్ థ్రిల్లర్ డైస్ ఇరే వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.