కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలో కొత్త సందడి షురూ అయింది. ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కు ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో కూడిన మూవీ ‘జాకీ’ వచ్చేసింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ తమిళ సినిమా ఈ రోజు (మార్చి 2) ఓటీటీలో అడుగుపెట్టింది.
జాకీ ఓటీటీ

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన తమిళ థ్రిల్లర్ జాకీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. సోమవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో టెంట్ కోటా ఓటీటీలో ఈ మూవీని డిజిటల్ ఆడియన్స్ చూడొచ్చు. అంతకుముందు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.
థియేటర్ రెస్పాన్స్
తమిళ సినిమా ‘జాకీ’ 2026 జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ముందుగా పొంగల్ రేసులో నిలవాలని సినిమా మేకర్స్ ప్రయత్నించారు కానీ మూవీ రిలీజ్ వాయిదా పడింది. చివరకు జనవరి 23న థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో యువన్ కృష్ణ, రిధాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి, మధుసూధన్ రావు, సీతన్ మోహన్, శరణ్య రవి తదితరులు నటించారు.
రెండు నెలల తర్వాత
జాకీ మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ థియేట్రికల్ రన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 10కి 8 రేటింగ్ ఉంది. జాకీ మూవీకి ప్రగభల్ డైరెక్టర్. దీన్ని పీకే7 స్టూడియోస్ పై ప్రేమ కృష్ణ దాస్, సి.దేవదాస్, జయ దేవదాస్ నిర్మించారు. ఇప్పుడు రెండు నెలల తర్వాత జాకీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
జాకీ స్టోరీ
తమిళనాడులోని మధురై చుట్టుపక్కల పొట్టేల్ ఫైట్ చాలా ఫేమస్. ఈ కాన్సెప్ట్ తీసుకుని జాకీ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలోని నటీనటులు నిజమైన పొట్టేల్ తో ట్రైనింగ్ తీసుకుని మరీ మూవీస్ లో నటించారు. పొట్టేల్ పందెలు అంటే కేవలం జంతువుల మధ్య పోరు మాత్రమే కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్, దాని వెనుక ఎంతో కథ ఉంటుందని జాకీలో చూపించారు.
{{/usCountry}}తమిళనాడులోని మధురై చుట్టుపక్కల పొట్టేల్ ఫైట్ చాలా ఫేమస్. ఈ కాన్సెప్ట్ తీసుకుని జాకీ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలోని నటీనటులు నిజమైన పొట్టేల్ తో ట్రైనింగ్ తీసుకుని మరీ మూవీస్ లో నటించారు. పొట్టేల్ పందెలు అంటే కేవలం జంతువుల మధ్య పోరు మాత్రమే కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్, దాని వెనుక ఎంతో కథ ఉంటుందని జాకీలో చూపించారు.
{{/usCountry}}రామర్ (యువన్ కృష్ణ) దగ్గర ఒక పోట్టేల్ ఉంటుంది. దాన్ని ఫైట్ కు రెడీ చేస్తాడు. మరోవైపు కార్తి (రిధాస్) పొట్టేల్ వరుసగా ఛాంపియన్ గా నిలిచి, జాకీ టైటిల్ దక్కించుకుంటూనే ఉంటుంది. ఓ సారి ఫైట్ లో రామర్, కార్తి పొట్టేళ్లు తలపడతాయి. అప్పుడు రామర్ పొట్టేల్ విజేతగా నిలుస్తుంది. అది తట్టుకోలేని కార్తి ప్రతీకారం కోసం ఏం చేశాడు? రామర్ కథ ఏంటీ? అన్నది జాకీ సినిమాలో చూడాల్సిందే.