అది తెలంగాణ కాదు, ఆంధ్ర కూడా కాదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని తెలియగానే రోడ్లన్నీ ఫుల్ అయిపోయాయి. స్ట్రీట్స్ అన్ని కిక్కిరిసిపోయాయి. ఎయిర్ పోర్ట్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకూ బెంగళూరు మొత్తం ఎన్టీఆర్ నామస్మరణతో మార్మోగింది. ఆదివారం (మార్చి 8) బెంగళూరులోని సీన్స్ ఎన్టీఆర్ మాస్ క్రేజ్ ను చాటాయి.
బెంగళూరులో తారక్

బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లాడు. తారక్ వస్తున్నాడని తెలుసుకున్న తెలుగు, కన్నడ ఫ్యాన్స్ ఎగబడ్డారు. రోడ్లన్నీ అభిమానులతో నిండిపోయాయి. దీంతో మహాదేవపుర, ఎలక్ట్రానికి సిటీ వైపు వెళ్లే రోడ్లు బ్లాక్ అయ్యాయి. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
సీఎం సీఎం
తారక్ కోసం రోడ్డుకు రెండు వైపులా ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కారు సన్ రూఫ్ నుంచి తారక్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. దీంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. సీఎం, సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడం గమనార్హం. పోటెత్తిన అభిమాన సంద్రాన్ని నిలువరించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
వీడియోలు వైరల్
హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ దశలో తోసుకుంటూ వచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. కానీ ఎన్టీఆర్ ప్రైవేట్ సెక్యూరిటీ, హాస్పిటల్ సెక్యూరిటీ, పోలీసులు కలిసి తారక్ కు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
జాగ్రత్తగా
కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత తారక్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ‘‘మా ఇంట్లో జరిగిన దుర్ఘటనలు మీ ఇంట్లో జరగొద్దు. జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి’’ అని అభిమానులకు తారక్ మరోసారి స్పష్టంగా తెలిపాడు. వేర్వేరు రోడ్డు యాక్సిడెంట్ల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, అన్న మరణించిన సంగతి తెలిసిందే.
డ్రాగన్ లుక్
{{/usCountry}}కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత తారక్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ‘‘మా ఇంట్లో జరిగిన దుర్ఘటనలు మీ ఇంట్లో జరగొద్దు. జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి’’ అని అభిమానులకు తారక్ మరోసారి స్పష్టంగా తెలిపాడు. వేర్వేరు రోడ్డు యాక్సిడెంట్ల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, అన్న మరణించిన సంగతి తెలిసిందే.
డ్రాగన్ లుక్
{{/usCountry}}ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో తారక్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం తారక్ ను చూసిన ఫ్యాన్స్ లుక్ అదిరిపోయిందని అంటున్నారు.
నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తారక్ చివరిగా వార్ 2 సినిమాలో కనిపించాడు. ఈ మూవీతోనే బాలీవుడ్ లో డెబ్యూ చేశాడు.