...
...
Next Story

Jr NTR: తీవ్ర విషాదంలో జూనియర్ ఎన్టీఆర్.. నాలుగేళ్ల తోడు దూరమైందంటూ ఎమోషనల్ పోస్ట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న తారక్ మాటలు

Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నాలుగేళ్ల తోడు దూరమైందంటూ చాలా బాధ పడుతున్నారు. ఆయన తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. తారక్ మాటలు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించేలా ఉన్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 19, 2026, 11:51:05 IST
Advertisement

Jr NTR: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత నాలుగేళ్లుగా తన కుటుంబంలో ఒకరిగా ఉంటూ ఎంతో అప్యాయత పంచిన ఆయన పెంపుడు కుక్క 'బగీరా' కన్నుమూసింది. ప్రాణంగా చూసుకునే పెంపుడు జీవి దూరమవ్వడంతో తారక్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషాదకర వార్తను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

తారక్ ఎమోషనల్

తీవ్ర విషాదంలో జూనియర్ ఎన్టీఆర్.. నాలుగేళ్ల తోడు దూరమైందంటూ ఎమోషనల్ పోస్ట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న తారక్ మాటలు (instagram-Jr NTR)
తీవ్ర విషాదంలో జూనియర్ ఎన్టీఆర్.. నాలుగేళ్ల తోడు దూరమైందంటూ ఎమోషనల్ పోస్ట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న తారక్ మాటలు (instagram-Jr NTR)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు వైరల్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బగీరాకు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను, ఫోటోలను తారక్ షేర్ చేసుకున్నారు. బగీరా తన జీవితంలోకి ఎలా వచ్చిందో, కుటుంబంలో ఒకరిగా ఎలా మారిపోయిందో గుర్తు చేసుకుంటూ ఒక హృదయవిదారకమైన సందేశాన్ని రాసుకొచ్చారు. నాలుగేళ్ల పాటు తన జీవితాన్ని ఎంతో అందంగా మార్చినందుకు బగీరాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

నువ్వు లేని లోటు

"నువ్వు నా జీవితంలోకి ఒక సాధారణ తోడుగా అడుగుపెట్టావ్. కానీ చాలా నిశ్శబ్దంగా మా కుటుంబంలో ఒకడివైపోయావ్. నిండైన ప్రేమ, విశ్వసనీయత, చిన్న చిన్న అల్లర్లు, నువ్వు మాత్రమే ఇవ్వగలిగిన ఒక రకమైన కొండంత ఓదార్పుతో మా ప్రతి రోజూ నింపేశావ్. నువ్వు లేని ఈ లోటు భరించలేని నిశ్శబ్దాన్ని మిగిల్చింది.

కానీ నువ్వు మాకు ఇచ్చి వెళ్లిన ప్రేమ కూడా అంతే గొప్పది. నన్ను నీ యజమానిగా ఎంచుకున్నందుకు, నా పక్కనే నడిచినందుకు, ఈ నాలుగేళ్ల కాలాన్ని వర్ణించలేనంత అందంగా మార్చినందుకు నీకు ధన్యవాదాలు. ప్రశాంతంగా వెళ్లు నా చిన్నారి యానిమల్. నిన్ను మేమందరం ఎంతో ప్రాణంగా ప్రేమించాం. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం" అని జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

జంతువులపై ప్రేమ

గతంలో కూడా ఒక పెంపుడు కుక్క చనిపోయినప్పుడు తారక్ ఎంతగానో కుంగిపోయారని చరణ్ వెల్లడించారు. ఆ మూగ జీవి పట్ల ఆయనకు ఉన్న ఆప్యాయత ఎంతటిదో రామ్ చరణ్ ఆ వేదికపై వివరించారు.

ఇప్పుడు మరోసారి

ఇప్పుడు మళ్లీ అత్యంత ఇష్టమైన బగీరా దూరమవ్వడంతో తారక్ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ చూసి ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 'డ్రాగన్' చిత్రంతో పాటు పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తారక్‌కు సోషల్ మీడియా వేదికగా ధైర్యాన్ని చెబుతూ, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks