Jr NTR: కండలు తిరిగిన దేహంతో, అదిరిపోయే బాడీ స్ట్రక్చర్ తో, అదుర్స్ అనిపించే మజిల్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీ కోసం తారక్ తన బాడీని ఛేంజ్ చేసుకుంటున్నాడు.
ఎన్టీఆర్ ఫొటో

సోమవారం (ఏప్రిల్ 13) జూనియర్ ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటో తెగ వైరల్ గా మారింది. ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వెనకాలకు తిరిగి తన కండలను చూపిస్తున్న తారక్ పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘‘ఇది నిర్మించింది. కొన్నది కాదు’’ అనే క్యాప్షన్ తో ఎన్టీఆర్ పోస్టు చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను తగలబెట్టేస్తోంది.
బాడీ బాక్సాఫీస్
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కాగానే ఫ్యాన్స్ షేర్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. బాడీ బాక్సాఫీస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సునామీ లోడింగ్ అని పోస్టులు పెడుతున్నారు. ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ మూవీ కోసం
{{/usCountry}}జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కాగానే ఫ్యాన్స్ షేర్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. బాడీ బాక్సాఫీస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సునామీ లోడింగ్ అని పోస్టులు పెడుతున్నారు. ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ మూవీ కోసం
{{/usCountry}}ప్రస్తుతం ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ ఛేంజ్ చేశాడు. బరువు తగ్గి, సన్నగా మారిపోయాడు. గుబురు గడ్డంతో స్టైలిష్ గానూ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇలా కండలు తిరిగిన దేహంతో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు.
షూటింగ్ ఆగిపోయిందా?
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ షూటింగ్ ఆగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆర్టిస్ట్ ల లుక్ సెట్ కాలేదని, అందుకే మళ్లీ రీషూట్ చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కానీ దీనిపై ఇప్పటివరకూ మూవీ టీమ్ అఫీషియల్ గా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడేమో తారక్ ఇలా మజిల్ బాడీని పోస్టు చేశాడు.
వార్ 2
జూనియర్ ఎన్టీఆర్ చివరగా వార్ 2 సినిమాలో కనిపించాడు. ఈ మూవీతోనే తారక్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్ గా కనిపించింది.