రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో రిలీజ్ అయిన 'ధురంధర్ ది రివెంజ్' సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి భారీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ ఎపిక్ యాక్షన్ మూవీపై ఎక్స్ లో ఒక సూపర్ సాలిడ్ రివ్యూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రివ్యూ ఇచ్చింది ఎవరో కాదు.. మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అతనికి ఈ మూవీ ఏ స్థాయిలో నచ్చిందో రివ్యూ చూస్తే తెలుస్తుంది.
తుఫాను లాంటి సినిమా.. రణ్‌వీర్ పర్ఫార్మెన్స్ మాస్టర్‌క్లాస్

ధురంధర్ 2 మూవీపై ఇప్పటికే అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ వైరల్ అయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు ఫిదా అయ్యాడు. తుఫాను లాంటి సినిమా ఇచ్చారని కామెంట్ చేశాడు. “ఇండియన్ ఆడియన్స్‌కు ఒక పెద్ద తుఫాను లాంటి సాలిడ్ సినిమాను అందించిన ధురంధర్ ఎంటైర్ టీమ్ కు ఒక బిగ్ సెల్యూట్. మన రణ్‌వీర్ సార్ పర్ఫార్మెన్స్ కేవలం బ్రెత్‌టేకింగ్ మాత్రమే కాదు.. ఆయన స్క్రీన్ మీద ఒక మాస్టర్‌క్లాస్ డెలివర్ చేశాడు. ఆ యాక్టింగ్ చూస్తే ఎవరైనా మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే” అని తారక్ అనడం విశేషం.
డైరెక్టర్ ఫియర్‌లెస్ విజన్‌కు స్టాండింగ్ ఒవేషన్..
అంతేకాదు ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ పై కూడా ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. “ఇలాంటి ఒక భారీ స్కేల్ ఉన్న సినిమాను తెరకెక్కించడానికి చాలా నమ్మకం, అలాగే ఎవరికీ భయపడని విజన్ ఉండాలి. డైరెక్టర్ ఆదిత్య ధర్ సార్ తనలోని ఆ బలాన్ని ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్‌ను బెస్ట్ లెవల్‌కు ఎలివేట్ చేయడానికి తన దగ్గర ఉన్న ప్రతి టూల్‌ను వాడుకున్న విధానానికి కచ్చితంగా ఒక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాల్సిందే. మనలోని ఎమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లే సినిమా ఇది. ఎండ్ టైటిల్స్ పడిపోయిన తర్వాత కూడా ఈ సినిమా తాలూకు ఆ ఫీల్ మనతోనే చాలా కాలం పాటు ఉండిపోతుంది” అని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డాడు.
మాధవన్ ఫైర్..
ఇక మాధవన్ సార్ ఎప్పట్లాగే చాలా ఎఫర్ట్‌లెస్ యాక్టింగ్‌తో కట్టిపడేశాడని కూడా తారక్ అన్నాడు.అలాగే సంజయ్ దత్ సార్, అర్జున్ రాంపాల్ సార్ ఇద్దరూ సినిమా అంతటా చాలా సాలిడ్ లేయర్డ్ పర్ఫార్మెన్సెస్ డెలివర్ చేసి సినిమాకు మెయిన్ పిల్లర్స్‌లా నిలబడ్డారని అన్నాడు.
{{/usCountry}}ఇక మాధవన్ సార్ ఎప్పట్లాగే చాలా ఎఫర్ట్‌లెస్ యాక్టింగ్‌తో కట్టిపడేశాడని కూడా తారక్ అన్నాడు.అలాగే సంజయ్ దత్ సార్, అర్జున్ రాంపాల్ సార్ ఇద్దరూ సినిమా అంతటా చాలా సాలిడ్ లేయర్డ్ పర్ఫార్మెన్సెస్ డెలివర్ చేసి సినిమాకు మెయిన్ పిల్లర్స్‌లా నిలబడ్డారని అన్నాడు.
{{/usCountry}}ధురంధర్ 2 మూవీని జూనియర్ ఎన్టీఆరే కాదు.. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా ఆకాశానికెత్తిన విషయం తెలిసిందే. మొత్తంగా ధురంధర్ కంటే ఈ సీక్వెల్ కు సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. తొలి రోజే రూ.100 కోట్ల మార్క్ దాటిన ఈ మూవీ.. ఇండియన్ సినిమాలో అన్ని రికార్డులు తుడిచి పెట్టేసేలా ఉంది.