Jr NTR Chuttamalle Song:ఆ నీచులకు చెప్తున్నా-ఎవరినీ వదిలిపెట్టా-మీ తల్లికి జరగొచ్చు-చుట్టమల్లే ఏఐ వీడియోపై ఎన్టీఆర్ ఫైర్
Jr NTR Chuttamalle Song: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సాంగ్ లోని జాన్వీ కపూర్ ను అసభ్యంగా, అత్యంత నీచంగా మార్ఫింగ్ చేశారు. ఆమె నగ్నంగా ఉన్నట్లు ఏఐతో మార్చి వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోపై తారక్ ఫైర్ అయ్యారు.
Jr NTR Chuttamalle Song: దేవర' చిత్రంలోని బ్లాక్‌బస్టర్ 'చుట్టమల్లే' పాటను ఏఐతో నీచంగా మార్ఫింగ్ చేశారు. నిజానికి ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ సెన్సేషన్ గా మారింది. అయితే ఇప్పుడు ఏఐని యూజ్ చేసి అత్యంత నీచంగా, అసభ్యకరంగా ఆ వీడియోను మార్ఫ్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్
చుట్టమల్లే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏఐని వాడి జాన్వీ కపూర్ న్యూడ్ గా ఉన్నట్లు ఆ వీడియో సాంగ్ లో చూపించారు. అదెంతో అసహ్యకరంగా ఉంది. ఈ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్టయ్యారు. సీరియస్ గా దీన్ని క్రియేట్ చేసిన, షేర్ చేస్తున్న వాళ్లకు తారక్ వార్నింగ్ ఇచ్చారు.
అసహ్యకరం
‘‘అసహ్యకరం, వికృతం, సిగ్గుచేటు. స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే ఈ దేశంలో, "మాతృదేవో భవ" అనేది కేవలం ఒక పదం మాత్రమే కాకుండా మన సంస్కృతిలో ఒక భాగమైన ఈ గడ్డపై, కొంతమంది ఏఐ (AI) ని ఉపయోగించి ఒక మహిళను అత్యంత దారుణంగా అవమానించేంతలా దిగజారిపోయారు. ఇలాంటి నీచమైన కంటెంట్‌ను సృష్టించడానికి ఏఐని వాడటం వర్ణించలేనంత సిగ్గుచేటు.
ఈ మార్ఫింగ్ చేసిన 'చుట్టమల్లే' వీడియో వెనుక ఉన్న ఆ నీచులకు చెప్తున్నా.. మీలో ఎవరినీ వదిలిపెట్టను. దీన్ని సృష్టించిన వారిపై, దీన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్న వారిపై సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.
దయచేసి ఇలాంటి వీడియోలను చూడకండి, షేర్ చేయకండి, ప్రోత్సహించకండి. ఈ రోజు అది ఇంకెవరికో జరిగింది, రేపు అది మీ తల్లి, సోదరి, భార్య లేదా కూతురికి కూడా జరగవచ్చు.
ఇది చాలా తీవ్రమైన సమస్య. ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, పటిష్టమైన నిబంధనలను తీసుకురావాలని నేను కోరుతున్నా’’ అని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇంత నీచమా?
చుట్టమల్లే సాంగ్ ను ఎవరో నీచులు మార్ఫ్ చేశారు. అయితే ఆ వీడియో కోసం కొంతమంది నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ‘లింక్ కావాలి ప్లీజ్’ అంటూ ఎక్స్ లో అడుక్కుంటున్నారు. ఇదే ఛాన్స్ అని లింక్ ఇస్తామంటూ కొంతమంది సిగ్గులేనివాళ్లు తమ రీచ్ పెంచుకోవడం కోసం ఫాలో చేయమని చెప్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మొత్తానికి ఏఐతో ఇలాంటి అసభ్యకరమైన పనులు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. టెక్నాలజీని మంచి కోసం వాడకుండా హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను న్యూడ్ గా మార్ఫింగ్ చేయడం కోసం వాడటం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ కోరినట్లుగా దీనిపై ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


