Jr NTR Surgery: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. భుజం గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్‌కు సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ (Arthroscopic Surgery) విజయవంతంగా పూర్తయింది.

డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సుర్గప్నేని నేతృత్వంలోని నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి చాలా స్థిరంగా ఉందని, త్వరలోనే ప్రత్యేక ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారని వైద్యులు వెల్లడించారు.
2 నుంచి 3 నెలల రెస్ట్.. ఆ తర్వాతే 'డ్రాగన్' సెట్స్‌లోకి..
భుజానికి సర్జరీ సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు ధీమా వ్యక్తం చేశారు. అయితే పూర్తిగా సాధారణ పరిస్థితికి రావడానికి ఆయనకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎన్టీఆర్ పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు.
ఈ హెల్త్ అప్‌డేట్‌తో గ్లోబల్ వైడ్‌గా ఉన్న నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో 'గెట్ వెల్ సూన్ తారక్' అంటూ వేలాదిగా పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
గ్లోబల్ కాన్వాస్‌పై ఎన్టీఆర్ హవా.. రీసెంట్ బాక్సాఫీస్ రికార్డులు
'ఆర్‌ఆర్ఆర్' (RRR) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్, తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. రీసెంట్‌గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర: పార్ట్ 1' (Devara Part 1) బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.
హిందీ బెల్ట్‌లో కూడా ఎన్టీఆర్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించిన 'వార్ 2' (War 2) సినిమాతో హిందీలోకీ అడుగు పెట్టారు. ఈ మూవీ ఆశించిన ఫలితం సాధించలేకపోయినా.. తారక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్'.. అంచనాలు నెక్స్ట్ లెవెల్
కోలుకున్న తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి భారీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. 'కేజీఎఫ్' (KGF), 'సలార్' (Salaar) వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తెరకెక్కించిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. డ్రాగన్ అనే టైటిల్ ను ఆ మధ్య ఖరారు చేశారు. ఈ మూవీ షూటింగ్ లోనే తారక్ గాయపడ్డారు.
{{/usCountry}}కోలుకున్న తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి భారీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. 'కేజీఎఫ్' (KGF), 'సలార్' (Salaar) వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తెరకెక్కించిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. డ్రాగన్ అనే టైటిల్ ను ఆ మధ్య ఖరారు చేశారు. ఈ మూవీ షూటింగ్ లోనే తారక్ గాయపడ్డారు.
{{/usCountry}}ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎపిక్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ శ్రమ పడుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.