...
...
Next Story

NTR Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. వెంకీ మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ లీక్

NTR Trivikram: జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ టైటిల్ ఇంకా రివీల్ కాకపోయినా.. స్క్రిప్ట్ అయితే పూర్తయినట్లే డైరెక్టర్ కన్ఫమ్ చేశారు. దీంతో తారక్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది.

Published on: Sep 29, 2026, 18:00:16 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

NTR Trivikram: 'అరవింద సమేత వీర రాఘవ' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ సెట్ అయింది. లార్డ్ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) కథాంశంతో మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు దర్శకుడు త్రివిక్రమ్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

NTR Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. వెంకీ మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ లీక్
NTR Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. వెంకీ మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ లీక్

సినీ ప్రియులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ ఇచ్చిన క్లారిటీతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది.

సుమ ఇంటర్వ్యూలో ఓపెన్ టాక్.. టైటిల్ సస్పెన్స్

వెంకటేష్, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఈ క్రేజీ అప్‌డేట్ పంచుకున్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధమైందని, బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసినట్లు చెప్పారు. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఇంకా ఫైనల్ చేయలేదని స్పష్టం చేశారు.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటోను సుమ చూపిస్తూ.. ఈ మూవీ అవుతోందా అని ప్రశ్నించినప్పుడు త్రివిక్రమ్ ఇలా స్పందించారు. చాలా కాలంగా సోషల్ మీడియాలో 'గాడ్ ఆఫ్ వార్' (God of War) అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ, దానిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని త్రివిక్రమ్ వెల్లడించారు.

లార్డ్ మురుగన్ బ్యాక్‌డ్రాప్.. నెవర్ బిఫోర్ కాన్సెప్ట్

ఇండియన్ సినిమాలో లార్డ్ మురుగన్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మైథలాజికల్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.

గ్రాండ్ ప్రొడక్షన్ అండ్ అనిరుధ్ మ్యాజిక్

ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్ రామ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్‌ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. 'దేవర' తర్వాత ఎన్టీఆర్ - అనిరుధ్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండటంతో మ్యూజిక్ లవర్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

2027లో షూటింగ్ స్టార్ట్.. ఎన్టీఆర్ నయా లైనప్

ఈ భారీ చిత్రం 2027లో సెట్స్ పైకి వెళ్లనుంది. తారక్ చివరిగా తెలుగులో దేవర, హిందీలో వార్ 2 సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు.

ఈ బిగ్ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన వెంటనే 2027లో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో లార్డ్ మురుగన్ అవతారంలో ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. మరోవైపు వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సుమారు 25 ఏళ్ల తర్వాత వస్తున్న ఆదర్శ కుటుంబం మూవీ అక్టోబర్ 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks