యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఇటీవలే దేవర, వార్ 2 చిత్రాలతో అలరించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ అరసన్. ఈ సినిమాను తెలుగులో సామ్రాజ్యం అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం

సామ్రాజ్యం సినిమాలో తమిళ స్టార్ శింబు హీరోగా చేస్తున్నాడు. వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘రాక్ స్టార్’ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా సామ్రాజ్యం టీజర్‌ను రిలీజ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్
సోషల్ మీడియాలో తారక్ సామ్రాజ్యం తెలుగు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెస్ట్ ఇంకా రావాలి
“శింబు బెస్ట్ ఇంకా తెరపైకి రావాల్సి ఉంది. వెట్రిమారన్ కంటే వెండితెరపై అతడిని ఇంకెవరు బాగా చూపిస్తారు” అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. సాధారణంగా ప్రోమో కానీ, టీజర్ కానీ రెండు, మూడు నిమిషాల నిడివితో ఉంటాయి. కానీ, అందుకు భిన్నంగా ఐదున్నర నిమిషాల ప్రచార వీడియో విడుదల చేసింది 'సామ్రాజ్యం' చిత్ర బృందం.
సామ్రాజ్యం టీజర్
'సామ్రాజ్యం' టీజర్ ప్రారంభంలో విజువల్స్ ప్రారంభం కావడానికి ముందు వచ్చే అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కోర్టు బయట తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు ఓ వ్యక్తి కథ చెబుతున్న దృశ్యంతో ప్రోమో ప్రారంభమైంది.
మొత్తం రియాలిటీనే
{{/usCountry}}'సామ్రాజ్యం' టీజర్ ప్రారంభంలో విజువల్స్ ప్రారంభం కావడానికి ముందు వచ్చే అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కోర్టు బయట తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు ఓ వ్యక్తి కథ చెబుతున్న దృశ్యంతో ప్రోమో ప్రారంభమైంది.
మొత్తం రియాలిటీనే
{{/usCountry}}'సార్.. నేను చెప్పబోయే మ్యాటర్ మొత్తం రియాలిటీ. నరికినోళ్లు, చచ్చినోళ్లు, స్థలం, పేరు, టైం, ఊరు.. మొత్తం రియాలిటీనే. కానీ, మీరు అలా చూపించకండి. ఈ సినిమాలో వచ్చేదంతా ఉట్టి భూటకం అని కార్డు వేస్తారు కదా! అలా వేయండి' అని శింబు చెబుతుంటారు.
ఎన్టీఆర్ అయితే అదరగొడతాడు
ఆ పాత్రలో ఎన్టీఆర్ అయితే అదరగొడతారని చెబుతారు. ఆ తర్వాత కోర్టులో వాయిదాకు సమయం కావడంతో వెళతారు. ముగ్గురు మనుషుల్ని అత్యంత కిరాతకంగా నరికి చంపిన కేసులో ఆయన ముద్దాయి. అయితే తాను ఎవరినీ చంపలేదని, తనపై అన్యాయంగా కేసు బనాయించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేస్తారు శింబు.
రెండు భిన్నమైన గెటప్పుల్లో
ప్రోమోలో రెండు భిన్నమైన గెటప్పుల్లో శింబు కనిపించారు. కోర్టు సన్నివేశాల్లో కాస్త నెరిసిన గడ్డంతో, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో యువకుడిగా ఉన్నారు. ఆ కేసు ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. ఇలా చాలా ఇంట్రెస్టింగ్‌గా సామ్రాజ్యం టీజర్ ఆకట్టుకుంది.