...
...
Next Story

OTT Thriller: కొండపై తెగిపడిన తల ఎవరిది? ఇవాళ ఓటీటీలోకి వచ్చిన విజయ్ సేతుపతి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

OTT Thriller: వెర్సటైల్ యాక్టింగ్ లో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసే విజయ్ సేతుపతి ఇప్పుడు ఓటీటీ లవర్స్ ను అలరించేందుకు వచ్చేశాడు. అతను హీరోగా నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టింది.

Published on: Mar 27, 2026, 05:46:00 IST
Advertisement

ఛాలెంజింగ్ క్యారెక్టర్లను ఎంతో ఈజ్ తో చేసేస్తూ కోట్లాది మంది ఆడియన్స్ ను సంపాదించుకున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ఈ తమిళ స్టార్ హీరో లీడ్ రోల్ ప్లే చేసిన ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. అదే.. ‘కాట్టాన్’. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ఈ వెబ్ సిరీస్ థ్రిల్ అందిస్తోంది.

కాట్టాన్ ఓటీటీ

ఓటీటీలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ (x)
ఓటీటీలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ (x)

విజయ్ సేతుపతి హీరోగా నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘కాట్టాన్’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. శుక్రవారం (మార్చి 27) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ఈ సిరీస్ ను చూడొచ్చు. జియోహాట్‌స్టార్‌ స్పెషల్ గా ఈ సిరీస్ తెరకెక్కింది.

ఏడు భాషల్లో

కాట్టాన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఏకంగా ఏడు భాషల్లో ఓటీటీలో రిలీజైంది. దీని ఒరిజినల్ తమిళ్ అయినప్పటికీ మిగతా భాషల్లో డబ్ చేశారు. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, హిందీలో కాట్టాన్ ను చూడొచ్చు. ఇంకెందుకు లేటు తెలుగు ఆడియన్స్ కూడా మన భాషలో విజయ్ సేతుపతి సిరీస్ ను ఎంజాయ్ చేయొచ్చు.

10 ఎపిసోడ్లు

కాట్టాన్ వెబ్ సిరీస్ సీజన్ 1 ఒకేసారి ఓటీటీలోకి వచ్చేసింది. వారానికో ఎపిసోడ్ ట్రెండ్ కాకుండా ఒకేసారి మొత్తం 10 ఎపిసోడ్లను ఓటీటీ ప్లాట్ ఫామ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ 10 ఎపిసోడ్లు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.

నేషనల్ అవార్డు

కొండపై తెగిపడిన తల ఎవరిది, అతణ్ని ఎవరు హత్య చేశారు అనే పాయింట్ చుట్టూ కాట్టాన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సాగుతుంది. కేసులు లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్ ను మూసివేయాలని అనుకుంటారు. అప్పుడు కొండపై తెగిపడిన తల ఒకటి పోలీసులకు దొరుకుతుంది.

ఆ తల ఎవరిది? అతను ఎవరు చంపారు? అనేది తెలుసుకోవడానికి పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అది ముత్తు తలగా గుర్తిస్తారు. అతను వాచ్ మెకానిక్‌గా, ఏనుగు శిక్షకుడిగా, అక్రమ కార్యకలాపాలలో చిక్కుకున్న బాడీగార్డ్‌గా పనిచేశాడని తెలుస్తుంది. విచారణ చేస్తున్న కొద్దీ అతని జీవితంలోని షాకింగ్ నిజాలు బయటపడతాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks