...
...
Next Story

Telugu Cinema: మీ ప్రేమకథ గుర్తుకొస్తుంది.. రిలీజ్ కు రెడీ అయిన తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ.. అదే కష్టమన్న యంగ్ హీరో

Telugu Cinema: తెలుగులో మరో యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ థియేటర్లకు రాబోతుంది. చాలా నేచురల్ గా మనసులోని భావాలను తెరపై పలికించేలా తెరకెక్కించిన చిత్రమే ‘కాగితం పడవలు’. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేశారు. మరి సినిమా కథ ఏంటీ? రిలీజ్ డేట్ ఎప్పుడో చూసేయండి.

Published on: Sep 2, 2026, 06:06:50 IST
Advertisement

Telugu Cinema: తెలుగులో ఎన్నో రొమాంటిక్ లవ్ స్టోరీలు వచ్చాయి. కొన్ని క్లాసిక్ గా నిలిచిపోయాయి. ఇప్పుడు మరో యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ థియేటర్లకు రాబోతుంది. అదే.. ‘కాగితం పడవలు’. టైటిల్ తోనే ఇంప్రెస్ చేసిన ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు.

రిలీజ్ డేట్

మీ ప్రేమకథ గుర్తుకొస్తుంది.. రిలీజ్ కు రెడీ అయిన తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ.. అదే కష్టమన్న యంగ్ హీరో
మీ ప్రేమకథ గుర్తుకొస్తుంది.. రిలీజ్ కు రెడీ అయిన తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ.. అదే కష్టమన్న యంగ్ హీరో

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన కాగితం పడవలు గ్లింప్స్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సాంగ్ లాంఛ్ చేశారు.

హీరో కామెంట్లు

సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో వర్ధన్ మాట్లాడుతూ.. ‘‘కాగితం పడవలు.. ఒక కాలువులో ప్రయాణం చేయాలని అనుకున్నాం. తెలియకుండానే ఒక సముద్రంలోకి వచ్చేశాం. ఎన్నోసార్లు ఒడ్డుకు వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని తెలిపాడు.

అదే కష్టం

‘‘ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం. డైరెక్టర్ తుకారాం చాలా అద్భుతంగా ఈ మూవీని తీశారు. ఈ సినిమా కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 18న థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పేర్కొన్నాడు.

మీ ప్రేమకథ గుర్తొచ్చేలా

‘‘తెలుగులో ‘కాగితం పడవలు’ నా రెండో సినిమా. మా నిర్మాతలందరికీ థాంక్యూ. మా డైరెక్టర్ చాలా ప్యాషన్‌తో సినిమా తీశారు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్‌లో నటించాను. మా హీరోకు థాంక్యూ. సెప్టెంబర్ 18న సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని హీరోయిన్ కృష్ణప్రియ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks