...
...
Next Story

Kajal Aggarwal: రాజసం ఉట్టిపడేలా కాజల్ అగర్వాల్ ఫొటోలు- రామాయణంలో తన పాత్ర చాలా తక్కువగా ఉండటంపై చందమామ కామెంట్స్

Kajal Aggarwal On Ramayana Role Mandodari: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో లంకేశుడి భార్య మండోదరి పాత్రలో మెరిసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, తన పాత్రకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published on: Nov 8, 2026, 06:57:51 IST
Advertisement

Kajal Aggarwal On Ramayana Role Mandodari: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. దంగల్ ఫేమ్ నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది.

రావణుడి ధర్మపత్ని మండోదరిగా కాజల్

రాజసం ఉట్టిపడేలా కాజల్ అగర్వాల్ ఫొటోలు- రామాయణంలో తన పాత్ర చాలా తక్కువగా ఉండటంపై చందమామ కామెంట్స్
రాజసం ఉట్టిపడేలా కాజల్ అగర్వాల్ ఫొటోలు- రామాయణంలో తన పాత్ర చాలా తక్కువగా ఉండటంపై చందమామ కామెంట్స్

ఈ భారీ చిత్రంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించగా, ఆయన ధర్మపత్ని మండోదరి పాత్రలో దక్షిణాది చందమామ కాజల్ అగర్వాల్ కనిపించి అలరించారు. తెరపై కాజల్ కనిపించిన సమయం తక్కువే అయినా, తనదైన రాజసంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సోషల్ మీడియాలో మండోదరి లుక్ వైరల్

రామాయణం సినిమా విజవంతంగా ప్రదర్శితమవుతున్న తరుణంలో.. కాజల్ అగర్వాల్ ‘మండోదరి’గా రాజసం ఉట్టిపడే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. భారతీయ సంస్కృతి, చరిత్రతో ముడిపడి ఉన్న ఇలాంటి మహాగ్రంథంలో భాగమవ్వడం తనకు లభించిన గొప్ప గౌరవమని ఆమె తెలిపారు.

జీవన విధానంలో భాగమైన రామాయణ కథలో

"ఈ సినిమాలో నా పాత్ర నిడివి చిన్నదే కావచ్చు. కానీ మన జీవన విధానంలో భాగమైన రామాయణ కథలో నటించడం, ఇంతటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం నా హృదయాన్ని ఆనందంతో నింపేసింది" అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.

దర్శకుడు, నిర్మాతలకు కాజల్ కృతజ్ఞతలు

భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తూ, ఈ చారిత్రాత్మక ప్రాజెక్టులో తనకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారికి కాజల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పాత్ర స్క్రీన్ టైమ్ కంటే

కాస్ట్యూమ్ డిజైనర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లతో సహా సాంకేతిక బృందం పడిన కష్టాన్ని కాజల్ కొనియాడారు. కాగా, మహర్షి వాల్మీకి రచించిన పవిత్ర రామాయణం ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్‌ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

2028లో రామాయణం పార్ట్ 2

రామాయణ పార్ట్ 1 చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి కనిపించగా, లక్ష్మణుడిగా రవి దూబే, ఆంజనేయస్వామిగా సన్నీ డియోల్ నటించారు. మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, రెండవ భాగాన్ని 2028 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks