...
...
Next Story

Kalyan Ram Birthday: నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్‌డే స్పెషల్.. అనిల్ రావిపూడి మూవీ నుంచి పోస్టర్ చూశారా? హిట్ ఖాయమేనా?

Kalyan Ram Birthday: నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సర్ ప్రైజ్ అదిరిపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ను సరికొత్త అవతారంలో చూపించబోతున్నట్లు చెప్పి హైప్ పెంచేశాడు అనిల్.

Published on: Jul 5, 2026, 13:40:24 IST
Advertisement

Kalyan Ram Birthday: నందమూరి ఇంటి పేరును నిలబెడుతూ డిఫరెంట్ మూవీస్ తో సాగిపోతున్నాడు హీరో కళ్యాణ్ రామ్. ఇవాళ (జూలై 5) అతని బర్త్ డే. ఈ సందర్భంగా వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ నుంచి ఈ హీరో స్పెషల్ పోస్టర్ ను అనిల్ రావిపూడి షేర్ చేశాడు. ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

నా మొదటి హీరో

నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్‌డే స్పెషల్.. అనిల్ రావిపూడి మూవీ నుంచి పోస్టర్ చూశారా? (x/AnilRavipudi)
నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్‌డే స్పెషల్.. అనిల్ రావిపూడి మూవీ నుంచి పోస్టర్ చూశారా? (x/AnilRavipudi)

కళ్యాణ్ రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్టర్‌తో పాటు ఒక ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశాడు.

"నా మొదటి హీరో, నా బెస్ట్ బడ్డీస్ లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒక డెబ్యూ డైరెక్టర్‌గా నాపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతుడనై ఉంటాను’’ అని అనిల్ రావిపూడి రాసుకొచ్చాడు.

సరికొత్త అవతారంలో

‘‘ఈ #VenkyAnil5 (#NKRAR2) చిత్రంలో మిమ్మల్ని ఒక సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేయడానికి నేను ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాను సర్. సంక్రాంతి 2027ను మనం థియేటర్లలో మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం!" అని అనిల్ రావిపూడి తన పోస్టులో పేర్కొన్నాడు. మెడలో దండతో పంచెకట్టులో ఉన్న కళ్యాణ్ రామ్ ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు అనిల్.

పటాస్ సెంటిమెంట్ రిపీట్

అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో పాటు, కళ్యాణ్ రామ్ సరికొత్త మేకోవర్ ఈ కొత్త సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'పటాస్' ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే.

హిట్ ఖాయమేనా?

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనేలా టాక్ మారిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కు కూడా ఓ హిట్ కావాలి. 2022లో వచ్చిన బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కు వరుసగా ‘అమిగోస్’, ‘డెవిల్’, ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీస్ ఫ్లాప్ లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మరోసారి అనిల్ రావిపూడి మూవీపై కళ్యాణ్ రామ్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు.

సంక్రాంతి 2027 బరిలో భారీ మల్టీస్టారర్

సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం, 2026లో మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలతో అనిల్ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ ను 2027 సంక్రాంతికి తీసుకురాబోతున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks