Kalyanam Kamaneeyam Jeevitham Movie First Look Released: వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా కళ్యాణం కమనీయం జీవితం. ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కళ్యాణం కమనీయం జీవితం ఫస్ట్ లుక్ రిలీజ్

తాజాగా కళ్యాణం కమనీయం జీవితం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కళ్యాణం కమనీయం జీవితం చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు.
చెప్పగానే ఇంప్రెస్ అయ్యాను
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "టైటిల్ చాలా బాగుంది. రాజవంశీ ఈ టైటిల్ గురించి చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ప్రొడ్యూసర్స్ మంచి ప్రయత్నం చేశారు. డైరెక్టర్ విజన్ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. హీరో హీరోయిన్ లకు, ఈ సినిమా టీమ్‌కు అల్ ది బెస్ట్" అని చెప్పారు.
కథ చెప్పగానే చేయాలనిపించింది
నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. "విజయేంద్ర ప్రసాద్ గారు అడగగానే మా పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు. డైరెక్టర్ కథ చెప్పగానే తప్పకుండా ఈ సినిమా చేయాలి అనిపించింది. దర్శకుడు చెప్పిన విధంగా సినిమా తీశాడు సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాన్ వరల్డ్ స్టార్ రైటర్ ఆవిష్కరించడం
మరో నిర్మాత కిషోర్ గుండాల మాట్లాడుతూ.. "పాన్ వరల్డ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు పోస్టర్‌ను ఆవిష్కరించి టీమ్‌కు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథ, కథనాలతో ఈ సినిమాని తెరకెక్కించాము. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము" అని పేర్కొన్నారు.
సినిమా సక్సెస్ అయినంత ఆనందం
{{/usCountry}}మరో నిర్మాత కిషోర్ గుండాల మాట్లాడుతూ.. "పాన్ వరల్డ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు పోస్టర్‌ను ఆవిష్కరించి టీమ్‌కు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథ, కథనాలతో ఈ సినిమాని తెరకెక్కించాము. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము" అని పేర్కొన్నారు.
సినిమా సక్సెస్ అయినంత ఆనందం
{{/usCountry}}దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ: "విజయేంద్ర ప్రసాద్ గారు మా పోస్టర్‌ని ఆవిష్కరించడంతో నే మా సినిమా సక్సెస్ అయినంత ఆనందంగా ఉంది. నిర్మాతలు నా కథను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు" అని చెప్పారు సినిమా దర్శకుడు రవి లోకిరెడ్డి.
లవ్, సస్పెన్స్‌తో ఉత్కంఠంగా
"ప్రేమ సస్పెన్స్ కలయికతో ఒక ఉత్కంఠ భరితంగా సినిమా ఉంటుంది. అలాగే మా టీమ్ అంతా కలిసి ఒక మంచి ప్రయత్నం చేసాము. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను" అని కళ్యాణం కమనీయం జీవితం డైరెక్టర్ రవి లోకిరెడ్డి తెలిపారు.
కళ్యాణం కమనీయం జీవితం నటీనటులు
ఇదిలా ఉంటే, కళ్యాణం కమనీయం జీవితం సినిమాలో ఖాన్ దురాని, సాహితీ అవంచ, ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందించగా.. వెంకటరాజు డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.