వారణాసిలో 30 నిమిషాల సీన్ ఉంటుంది, మహేశ్ బాబు విశ్వరూపం చూసి నాకు మాటలు రాలేదు.. రచయిత విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎస్ఎస్ఎంబీ29 సినిమాకు వారణాసి అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. గ్లోబ్ ట్రాటర్ అంటూ అతి పెద్ద గ్రాండ్ టైటిల్ లాంచ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో వారణాసి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Nov 17, 2025, 05:52:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా ద‌ర్శ‌క‌ ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘వారణాసి’. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తోన్న‌ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

వారణాసిలో 30 నిమిషాల సీన్ ఉంటుంది, మహేశ్ బాబు విశ్వరూపం చూసి నాకు మాటలు రాలేదు.. రచయిత విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
వారణాసిలో 30 నిమిషాల సీన్ ఉంటుంది, మహేశ్ బాబు విశ్వరూపం చూసి నాకు మాటలు రాలేదు.. రచయిత విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్

వారణాసి సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ మేరకు గ్లోబ్ ట్రాటర్ అంటూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్ ఈ కార్యక్రమంలోనే టైటిల్‌ను, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, సినిమా స్థాయిని చాటేలా ఓ టీజర్‌ (వారణాసి టు ది వరల్డ్)ను కూడా రిలీజ్ చేశారు.

విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటుగా చిత్రయూనిట్ పాల్గొంది. ఇక ఈ ఈవెంట్‌లో స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

నా మైండ్‌లోనే తిరుగుతూనే ఉంది

రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. "‘వారణాసి’ చిత్రంలో మహేశ్ బాబు నటన చూసి మాటలు రాలేదు. ఓ ముప్పై నిమిషాల సీన్ ఉంటుంది.. అది ఇంకా నా మైండ్‌లో తిరుగుతూనే ఉంది" అని అన్నారు.

మంత్రముగ్ధుడిని చేసింది.

"సీజీ చేయలేదు.. డబ్బింగ్ లేదు.. ఆర్ఆర్ లేదు.. ఎలాంటి వర్క్ చేయలేదు.. కానీ, అందులో మహేష్ బాబు తాలుకా విశ్వరూపం చూసి నాకు మాటలు రాలేదు. ఆ సీన్ నన్ను మంత్రముగ్దుడ్ని చేసింది. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్‌ కూడా అదే ఫీలవుతారు" అని రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

క్లాస్ నాదే.. బీట్స్ నాదే..

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంఎం కీరవాణి మాట్లాడుతూ .. "మహేష్ బాబు, మణిశర్మ కాంబోలో వచ్చిన ‘పోకిరి’ అంటే నాకు చాలా ఇష్టం. నేను క్లాస్ ట్యూన్స్ మాత్రమే ఇస్తానని, మాస్ బీట్స్ ఇవ్వలేని కొంత మంది అంటుంటారు. కానీ, ఈ సారి ‘వారణాసి’లో బీట్స్ చూస్తారు. క్లాస్ నాదే.. బీట్స్ నాదే.. ఆ బీట్స్‌తో మహేశ్ బాబు అభిమానుల గుండెల్లో చిరస్థానం దక్కుతుంది" అని అన్నారు.

ఇంకో పదేళ్లు పడుతుందనుకున్నా

నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ మాట్లాడుతూ .. "నేను చిన్న చిన్న చిత్రాలు చేసుకుంటూ నిర్మాతగా ఎదుగుతున్నాను. నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కి నిర్మాతగా వ్యవహరిస్తానని అనుకోలేదు. ఈ స్థాయికి రావడానికి నాకు ఇంకో పదేళ్లు పడుతుందని అనుకున్నాను. కానీ నాకు ఈ ‘వారణాసి’తో చాలా త్వరగా అవకాశం వచ్చింది" అని అన్నారు.

గ్లోబల్ ప్లాట్‌ఫామ్ మీద

"నేను ఇలా మొదటిసారిగా గ్లోబల్ ప్లాట్‌ఫామ్ మీద నిల్చుని నిర్మాతగా మాట్లాడుతున్నాను. ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్‌గా తీసుకెళ్లేందుకు మళ్లీ మేము మరొక ప్రయత్నం చేస్తున్నాం" అని ప్రొడ్యూసర్ ఎస్ కార్తికేయ తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More