...
...
Next Story

Kamal Haasan: కల్కిలో కమల్ హాసన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 10 రోజులకే అన్ని కోట్లా?

Kamal Haasan: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమాలో కమల్ హాసన్ విలన్ రోల్ ప్లే చేశాడు. సుప్రీం యాస్కిన్ గా నటించాడు. స్క్రీన్ పై కనిపించింది తక్కువ సేపే కానీ అతను అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవాల్సిందే.

Published on: Mar 8, 2026, 14:15:06 IST
Advertisement

ఇండియన్ సినీ లెజెండ్లలో కమల్ హాసన్ ఒకరు. విలక్షణమైన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అతను దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీలో కమల్ విలన్ గా నటించాడు. ఈ మూవీ కోసం అతను తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు.

సుప్రీం యాస్కిన్

కల్కి సినిమాలో సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్
కల్కి సినిమాలో సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 2024లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD'లో కమల్ హాసన్ విలన్ రోల్ ప్లే చేశాడు. సుప్రీం యాస్కిన్ గా నటించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ కనిపించింది కాసేపే. కానీ అందుకు అతను భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఇండియాగ్లిట్జ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిల్మ్ మేకర్, నటుడు యుగి సేతు వెల్లడించాడు.

అత్యధిక రెమ్యునరేషన్

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుడు కమల్ హాసన్ అని యుగి అన్నాడు. "కమల్ సార్ స్థాయి అలాంటిది. 'కల్కి 2898 AD' కోసం 20 రోజుల కాల్షీట్ కి గాను ఆయనకు రూ. 150 కోట్లు ఇస్తున్నారని తెలిసింది. ఆయన పుట్టినరోజున ఈ విషయాన్ని నేను వెల్లడించా. ఆయన భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడు. రోజుకి $1 మిలియన్ అందుకుంటున్నాడని అనుకున్నా. 20 రోజులకు రూ.150 కోట్లు ఇచ్చారని అనుకున్నా’’ అని యుగి ఫస్ట్ చెప్పాడు.

10 రోజులకే

'కల్కి 2898 AD' నిర్మాత అశ్వనీ దత్ కి కమల్ హాసన్ తనని పరిచయం చేశారని యుగి తెలిపాడు. "మన స్నేహితుడిని భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా చేసినందుకు మీకు ధన్యవాదాలు అని అశ్వనీదత్ కు చెప్పా. 20 రోజులకు రూ. 150 కోట్లు ఇస్తున్నారు కదా అని అన్నా. కానీ ఆయన బదులిస్తూ ‘లేదు సార్, ఆయన కేవలం 10 రోజులు కాల్షీట్లు మాత్రమే ఇచ్చారు’ అని చెప్పాడు. అప్పుడు కమల్ కు రోజుకు $2 మిలియన్లు (రూ.15 కోట్లు) ఇచ్చారని తెలిసింది" అని యుగి తెలిపాడు.

సీక్వెల్

ఇప్పుడు కల్కి 2898 ఏడీ సీక్వెల్ లో కమల్ హాసన్ నటిస్తున్నాడు. ఈ సీక్వెల్ లో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ కు ఇంకా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండబోతుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ కల్కి 2898 ఏడీ సీక్వెల్ నుంచి దీపికా పదుకొణేను తప్పించిన సంగతి తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks