...
...
Next Story

Kangana Ranaut: అన్ని హద్దులూ దాటేశారు.. వాళ్లకు అసలు సిగ్గు అనేదే లేదు: మంగ్లీ పాడిన పాటపై కంగనా ఫైర్

Kangana Ranaut: మంగ్లీ పాడిన హిందీ పాటపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించింది. బాలీవుడ్ అన్ని హద్దులూ దాటేసిందని, వాళ్లకు అసలు సిగ్గు అనేదే లేదని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ పాటపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

Published on: Mar 17, 2026, 16:41:38 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

డైరెక్టర్ ప్రేమ్ రూపొందిస్తున్న పాన్-ఇండియా కన్నడ సినిమా 'కేడీ: ద డెవిల్' నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన 'సర్కే చునర్ తేరి సర్కే' (Sarke Chunar Teri Sarke) పాట ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించిన ఈ సాంగ్‌లోని లిరిక్స్, కొరియోగ్రఫీ చాలా అసభ్యంగా ఉన్నాయని నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా మండిపడుతున్నారు. ఈ పాటను తెలుగు సింగర్ మంగ్లీ పాడటం గమనార్హం. తాజాగా నటి, ఎంపీ కంగనా రనౌత్ ఈ పాటపై తనదైన శైలిలో విరుచుకుపడింది.

కంగనా రనౌత్ ఏమన్నారంటే?

Kangana Ranaut: అన్ని హద్దులూ దాటేశారు.. వాళ్లకు అసలు సిగ్గు అనేదే లేదు: మంగ్లీ పాడిన పాటపై కంగనా ఫైర్
Kangana Ranaut: అన్ని హద్దులూ దాటేశారు.. వాళ్లకు అసలు సిగ్గు అనేదే లేదు: మంగ్లీ పాడిన పాటపై కంగనా ఫైర్

న్యూస్ ఏజెన్సీ ANIతో మాట్లాడిన కంగనా రనౌత్.. బాలీవుడ్ అశ్లీలతకు అన్ని హద్దులు దాటేసిందని విమర్శించింది. "అటెన్షన్ కోసం బాలీవుడ్ వల్గారిటీలో అన్ని లిమిట్స్ క్రాస్ చేసింది. దేశమంతా వీళ్లను చీదరించుకుంటున్నా, వీళ్లకి ఏమాత్రం సిగ్గు ఉన్నట్లు అనిపించడం లేదు. ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ని ప్రదర్శించే విషయంలో ఇంకాస్త కఠినంగా వ్యవహరించాలి.. బాలీవుడ్‌కు గట్టి కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది" అని ఆమె ఘాటుగా స్పందించింది.

సోమవారం సింగర్ అర్మాన్ మాలిక్ కూడా ఈ పాట లిరిక్స్ విని షాక్ అయ్యాడు. "నేను విన్నది కరెక్టేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ క్లిప్‌ని మళ్ళీ ప్లే చేయాల్సి వచ్చింది. కమర్షియల్ సాంగ్ రైటింగ్ ఇంత దిగజారిపోవడం చూస్తుంటే బాధగా ఉంది" అని తన ఎక్స్ అకౌంట్‌లో రాశాడు.

వివాదం ఎక్కడిదాకా వెళ్లింది?

ఈ పాట లిరిక్స్, విజువల్స్ మైనర్లకు చాలా హానికరంగా ఉన్నాయని, వెంటనే దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక అడ్వకేట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ని ఆశ్రయించారు. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ పాటలో అత్యంత అసభ్యకరమైన, లైంగిక వేధింపులను ప్రేరేపించే పదాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఆనంద్ ఆడియో రిలీజ్ చేసింది. సౌత్ లో మంచి పేరున్న సింగర్ మంగ్లీ ఈ పాట పాడటం ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks