...
...
Next Story

Kangana Ranaut: హీరోల కంటే ఆ దర్శకుడే గొప్ప- 'ధురంధర్ 2' సక్సెస్‌పై కంగనా రనౌత్ సంచలన పోస్ట్.. ఆదిత్య ధర్‌కు సలాం!

Kangana Ranaut: 'ధురంధర్ 2' దర్శకుడు ఆదిత్య ధర్‌పై కంగనా రనౌత్ ప్రశంసల జల్లు కురిపించారు. హీరోల కంటే దర్శకులే గొప్పవారని పేర్కొంటూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Published on: Mar 21, 2026, 15:28:31 IST
Advertisement

బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రానికి అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి దిగ్గజాలు ఈ సినిమాను కొనియాడగా, తాజాగా బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ఈ చిత్రంపై తనదైన శైలిలో స్పందించారు. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకుంటూ, దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ఆకాశానికెత్తారు.

సూపర్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్

ఆదిత్య ధర్ పై కంగనా రనౌత్ పోస్ట్
ఆదిత్య ధర్ పై కంగనా రనౌత్ పోస్ట్

కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చారు. "'ధురంధర్' విజయంలో గొప్ప విషయం ఏమిటంటే, ఒక సూపర్ స్టార్ డైరెక్టర్‌గా ఆదిత్య ధర్ స్థిరపడ్డారు.

హాలీవుడ్‌లో స్పీల్ బర్గ్, టరాన్టినో, నోలన్ వంటి దర్శకులు అక్కడి సూపర్ స్టార్ నటుల కంటే చాలా గొప్పవారు. కానీ మన దేశంలో ఫిల్మ్ మేకర్స్ కు తగినంత గౌరవం లేదా గుర్తింపు ఇవ్వడం లేదు. అందుకే ఎవరైనా సరే నటులు కావాలని కోరుకుంటున్నారే తప్పా ఫిల్మ్ మేకర్స్ కావాలని అనుకోవడం లేదు" అని కంగనా పోస్టు చేసింది.

వేధింపులు

‘‘మన పరిశ్రమలో దర్శకులు ఎంతో కష్టపడుతున్నా, తక్కువ వేతనంతో పనిచేస్తూ హీరోల చేతిలో వేధింపులకు గురవుతున్నారు. కానీ ఇప్పుడు ఆదిత్య ధర్ వంటి మేకర్స్ హీరోల కంటే ఎక్కువగా వెలిగిపోతున్నారు. యువత ఆయనను చూసి స్ఫూర్తి పొందాలి. సెల్యూట్ సార్’’ అని కంగనా రనౌత్ తన స్టోరీలో రాసుకొచ్చింది.

Kangana Ranaut praises Aditya Dhar for Dhurandhar 2,

బాక్సాఫీస్ రికార్డుల వేట!

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 ఓ స్పై థ్రిల్లర్. ఇది మార్చి 19, 2026న రిలీజైంది. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు ఇది సీక్వెల్. పాకిస్థాన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించే గూఢచారిగా రణ్‌వీర్ సింగ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ సైతం ధురంధర్ 2 సినిమాను "సినిమా నిర్మాణంలో ఒక కొత్త శకం" అని అభివర్ణించారు. ఆదిత్య ధర్ విజన్ భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe