Kangana Vs Taapsee: నీలాంటి నకిలి మనిషిని కన్నందుకు నీ తల్లిదండ్రులపై జాలేస్తోంది: తాప్సీపై కంగనా రనౌత్ కామెంట్స్
Kangana Ranaut Vs Taapsee Pannu: కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య మరోసారి వివాదం గట్టిగా రాజుకుంది. తాప్సీ పన్ను ఇంటీవల చేసిన పెంపకం వ్యాఖ్యలపై కంగనా రనౌత్ చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. తన పెంపకాన్ని, తల్లిదండ్రులను విమర్శించి హద్దులు దాటావంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడింది కంగనా.
Kangana Ranaut Vs Taapsee Pannu: బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య సీనియర్ వర్సెస్ జూనియర్ వివాదం మరోసారి భగ్గుమంది. గతంలో 'సస్తి కాపీ' (చీప్ కాపీ) వ్యాఖ్యలతో మొదలైన వీరి పరోక్ష యుద్ధం తాజాగా సరికొత్త మలుపు తిరిగింది.

తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నించావ్!
తాప్సీ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నించావంటూ తాప్సీపై విరుచుకుపడిన కంగనా, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆ పోస్టులను డిలీట్ చేయడం గమనార్హం.
అసలు తాప్సీ ఏం కామెంట్ చేశారు?
ప్రస్తుతం తాప్సీ పన్ను తన రాబోయే నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'గాంధారి' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనాతో ఉన్న విభేదాలపై తాప్సీ పన్ను స్పందించారు.
ఇద్దరి పెంపకం వేరు
"నేను ఆమెను ఇప్పటివరకు ఎప్పుడూ నేరుగా కలవలేదు. మా ఇద్దరి ఆలోచనా విధానాలు, పెంపకం వేరు. సంభాషించే శైలి, విషయాలను అర్థం చేసుకునే తీరులో ఉన్న తేడాలే మా ప్రవర్తనలో కనిపిస్తాయి. దీనిని బట్టే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో ప్రజలే నిర్ణయించుకుంటారు" అని తాప్సీ వ్యాఖ్యానించారు.
నా పెంపకాన్ని ప్రశ్నిస్తావా? కంగనా ఘాటు కౌంటర్!
తాప్సీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ అత్యంత తీవ్రంగా స్పందించారు. శనివారం (ఆగస్ట్ 22) సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తాప్సీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కంగనా రనౌత్. పరోక్షంగా 'సస్తి కాపీ' అంటూనే తాప్సీ సరిహద్దులు దాటారని మండిపడ్డారు.
హెడ్‌లైన్స్ కోసం మళ్లీ నాపేరే వాడుకుంటోంది
"ఒక సస్తి కాపీ (చీప్ కాపీ) తన బి-గ్రేడ్ సినిమా ప్రమోషన్ల కోసం మళ్లీ నా పేరునే వాడుకుంటోంది. ప్రతిసారీ హెడ్‌లైన్స్ కోసం నా పేరు వాడటం అలవాటే కానీ, ఈసారి ఏకంగా నా పెంపకాన్ని, నా తల్లిదండ్రులను అవమానిస్తూ హద్దులు దాటింది" అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు.
నాలాంటి ఒరిజినల్‌ను ఎందుకు కనలేదు?
"పిల్లల కోసం ఏ తల్లిదండ్రులైనా తమ శక్తిమేర కష్టపడతారు. నేను ఎప్పుడూ ఇతరుల తల్లిదండ్రుల జోలికి వెళ్లను. కానీ, ఈరోజు ఆమె తల్లిదండ్రులను ఒక్కటే అడుగుతున్నా.. నా తల్లిదండ్రుల్లా ఒక ఒరిజినల్ (నిజమైన) వ్యక్తికి ఎందుకు జన్మనివ్వలేకపోయారు? ఇలాంటి చీప్ కాపీ (చవకబారు కాపీ లేదా నకిలి మనిషి)ని ఎందుకు కన్నారు? అది తెలిసి వాళ్లపై నాకు జాలేస్తోంది" అని కంగనా ఘాటు కామెంట్స్ చేశారు.
రాజ్‌పుత్ జమీందారి కుటుంబం నుంచి
అనంతరం మరో స్టోరీలో వార్తా కథనాన్ని షేర్ చేస్తూ.. తాను ఒక పేరున్న రాజ్‌పుత్ జమీందారీ కుటుంబం నుంచి వచ్చానని పేర్కొన్నారు. చదువుకున్న ఉన్నతమైన కుటుంబంలో పెరిగిన తన పెంపకాన్ని, చిన్న ఇళ్లలో పెరిగినవారు ప్రశ్నించడం హాస్యాస్పదమని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.
2019 నుంచి కొనసాగుతున్న కోల్డ్ వార్
అయితే, కంగనా రనౌత్, తాప్సీల మధ్య వివాదం ఈనాటిది కాదు. 2019లో కంగనా సోదరి రంగోలి చందేల్, తాప్సీని పరోక్షంగా 'సస్తి కాపీ' అని వ్యాఖ్యానించడంతో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత 2020లో బాలీవుడ్‌లో నెపోటిజం (వారసత్వం)పై చర్చ జరుగుతున్న సమయంలో తాప్సీ, స్వరా భాస్కర్ లాంటి వారిని కంగనా 'బి-గ్రేడ్ నటీమణులు' అని పిలవడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.


స్క్రీన్ షాట్లు వైరల్
ప్రస్తుతం కంగనా పోస్టులను డిలీట్ చేసినప్పటికీ, ఆ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో నెపోటిజంపై పోరాడే కంగనా, తోటి నటీమణుల పట్ల ప్రవర్తించే తీరుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


