...
...
Next Story

OTT: ఓటీటీలో తెలుగులో కన్నడ ఫాంటసీ థ్రిల్లర్-45 రోజుల కర్మ ఫలం-ఉపేంద్ర, శివరాజ్ కుమార్ మల్టీస్టారర్-ఆలోచింపజేసే మూవీ

ఫ్రైడే రాగానే కొత్త సినిమాలు, సిరీస్ లతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కళకళలాడతాయి. ఈ శుక్రవారం కూడా మూవీస్ సందడి ఎక్కువగానే ఉంది. కన్నడ ఫాంటసీ థ్రిల్లర్ 45 సినిమా ఈ రోజు నుంచి తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Jan 30, 2026, 10:06:33 IST
Advertisement

ఓటీటీలో డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు అలాంటి భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన కన్నడ ఫాంటసీ థ్రిల్లర్ ‘45’ సినిమా ఓటీటీలో తెలుగులో వచ్చింది. ఇవాళ (జనవరి 30) నుంచి తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ కన్నడ సినిమా. ఇందులో శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి లాంటి స్టార్లు నటించారు.

45 ఓటీటీ

ఓటీటీలోకి తెలుగులో  కన్నడ ఫాంటసీ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి తెలుగులో కన్నడ ఫాంటసీ థ్రిల్లర్ (x)

45 రోజుల కర్మ ఫలం అనుభవించాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ ‘45’. ఇది ఓటీటీలో అదరగొడుతోంది. ఈ రోజు నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ ఫాంటసీ థ్రిల్లర్ 45 సినిమా.

థియేటర్ రెస్పాన్స్

భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా డిసెంబర్ 25, 2025న రిలీజైంది 45 మూవీ. ఈ సినిమా రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. చివరకు రూ.20 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ను అలరించేందుకు తెలుగులోనూ వచ్చేసింది. ఈ మూవీతోనే మ్యూజిక్ డైరెక్టర్ అయిన అర్జున్ జన్య సినిమా డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చాడు.

45 మూవీ స్టోరీ

45 అనే నంబర్ కు, మనిషి మెదడుకు, విశ్వానికి ఉన్న సంబంధాన్ని చూపించే ప్రయత్నమే ఈ ‘45’ సినిమా. ఇందులో వినయ్ (రాజ్ బి.శెట్టి) ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటించాడు. అతను వర్క్ ప్రెషర్ తో ఉంటాడు. ఓ రోజు ట్రాఫిక్ లో సిగ్నల్ జంప్ చేసి రోసీ అనే ఓ నల్లటి కుక్కను బైక్ తో ఢీకొట్టి చంపేస్తాడు.

కుక్కను తల్లిలా

గరుడ పురాణం ప్రకారం ఓ వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మ తన ప్రయాణాన్ని పూర్తి చేయడం కోసం 45 రోజులు పడుతుంది. అందుకే 45 రోజుల్లోపు వినయ్ తన తప్పును తెలుసుకోవాలని రాయప్ప చెప్తాడు. ఆ సమయంలో ఆధ్యాత్మిక గురువు శివప్ప (శివరాజ్ కుమార్) వినయ్ కు అండగా నిలుస్తాడు.

అయితే వినయ్ కు కొన్ని సంఘటనలు ముందే తెలుస్తాయి. అతను ప్రాణభయంతో వణికిపోతాడు. చివరకు రాయప్ప యమధర్మరాజులా కనిపిస్తాడు. మరి రాయప్ప, శివప్ప మధ్య ఏం జరిగింది? వినయ్ తన కర్మ ఫలాన్ని అనుభవించాడా? అన్నది 45 సినిమాలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks