ఓటీటీలోకి కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్-రాత్రి కలుసుకోవాలనుకునే లవర్స్-దిమ్మతిరిగే ట్విస్ట్-జగపతిబాబు కీ రోలో-9.2 రేటింగ్
ఓటీటీలోకి కన్నడ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ థ్రిల్లర్ వచ్చేసింది. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ మూవీకి ఐఎండీబీలో 9.2 రేటింగ్ ఉంది. ఇందులో జగపతిబాబు కీ రోల్ పోషించాడు.
ఇవాళ ఓటీటీలోకి కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఏలుమలై’ వచ్చేసింది. థియేటర్లో అదిరే రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ డెబ్యూ చేసింది. ఈ మూవీతో రవితేజ ఇడియట్ సినిమా హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు 9.2 ఐఎండీబీ రేటింగ్ ఉండటం విశేషం.

ఏలుమలై ఓటీటీ
ఈ ఏడాది కన్నడ బాక్సాఫీస్ దగ్గర టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సినిమాల్లో ఏలుమలై ఒకటి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ థియేటర్లలో అదరగొట్టింది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్, సస్పెన్స్, ట్విస్ట్ లతో సాగే ఈ సినిమా ఇవాళ (అక్టోబర్ 17) ఓటీటీలోకి వచ్చింది. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్ రెస్పాన్స్
ఏలుమలై సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ దూసుకెళ్లింది. సెప్టెంబర్ 5, 2025న ఏలుమలై సినిమా థియేటర్లలో రిలీజైంది. దీనికి పునీత్ రంగస్వామి డైరెక్టర్. కథ కూడా ఆయనదే. ఇందులో రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు, కిశోర్, టీఎస్ నాగభరణ తదితరులు నటించారు. తరుణ్ సుధీర్, అట్లాంటా నాగేంద్ర నిర్మించారు.
ఏలుమలై కథ
కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఏలుమలై. హరీష్ (రాన్నా), రేవతి (ప్రియాంక ఆచార్) ప్రేమించుకుంటారు. హరీష్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తాడు. రేవతి ఓ రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఒక రోజు రాత్రి కలుసుకుని వీళ్లు ఎక్కడికైనా వెళ్లిపోదామనుకుంటారు. కానీ మధ్యలో ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుంది.
హిట్ అండ్ రన్
రేవతిని కలవడానికి బయల్దేరిన హరీష్ మధ్యలో హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కుంటాడు. మరోవైపు స్మగ్లర్ల కోసం అర్ధరాత్రి అడవిలో పోలీసులు గాలిస్తుంటారు. ఇంకో వైపు ఇంటి నుంచి వెళ్లిపోయిన రేవతి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుంటారు. హరీష్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడు. చివర్లో ఎల్టీటీఐ ఏజెంట్ హరీష్ అంటూ వచ్చే ట్విస్ట్ దిమ్మతిరిగేలా ఉంటుంది.
మరి రేవతిని హరీష్ కలిశాడా? అతను నిజంగానే ఎల్టీటీఐ ఏజెంట్ హా? అసలు అర్ధరాత్రి అడవిలో ఏం జరిగిందో తెలియాలంటే ఏలుమలై మూవీ చూడాల్సిందే. థ్రిల్లర్లను ఇష్టపడే ఓటీటీ ఆడియన్స్ కు ఈ మూవీ మంచి థ్రిల్ అందిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


