కన్నడ టెలివిజన్ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 26 ఏళ్ల కన్నడ టెలివిజన్ నటి నందిని సీఎం సూసైడ్ చేసుకుంది. బెంగళూరులోని తన పేయింగ్ గెస్ట్ అకామడేషన్‌లో సోమవారం (డిసెంబర్ 29) ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వార్తా సంస్థ పీటీఐ.. పోలీసులను ఉటంకిస్తూ, ఈ సంఘటన కెంగేరి ప్రాంతంలో జరిగిందని చెప్పింది.
సీరియల్ నటి ఆత్మహత్య

కన్నడ సీరియల్ నటి నందిని సీఎం సూసైడ్ చేసుకుంది. సంఘటనా స్థలంలో డెత్ నోట్ లభించింది. స్వాధీనం చేసుకున్న ఈ డెత్ నోట్ ఆధారంగా సీనియర్ పోలీసు అధికారి ఒకరు నందిని డిప్రెషన్, వ్యక్తిగత సమస్యలతో పోరాడుతోందని పేర్కొన్నారు. ఈ నోట్‌లో ఆమె వివాహం చేసుకోవడానికి లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదని పేర్కొందని తెలిపారు.
ఫ్యామిలీ కోరిక
నందిని సీఎం యాక్టింగ్ కెరీర్ ను కొనసాగించాలని అనుకుంది. కానీ ఆమె ఫ్యామిలీ మాత్రం నందిని త్వరగా సెట్ కావాలని కోరుకుంది. ఈ ఒత్తిడి ఆమెపై పడినట్లు తెలుస్తోంది. తన నటన వృత్తిని కొనసాగించాలనుకుంటున్నట్లు, అయితే తన కుటుంబం ఆమెను "స్థిరపడాలని" కోరుకుంటున్నట్లుగా డెత్ నోట్ లో పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసుటు అసాధారణ మరణం కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.
స్టేట్ మెంట్ రికార్డు
ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద ప్రమేయం లేదని పోలీసులు తెలిపారు. ఎవరిపై ఇప్పుడే అనుమానం లేదన్నారు. "విచారణ పురోగమిస్తున్నప్పుడు మరిన్ని వివరాలు తెలియజేస్తాం" అని ఒక పోలీసు అధికారి లైవ్ మింట్ కు చెప్పారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత సహచరుల స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేస్తున్నామని తెలిపారు.
సీరియల్ లో విషం
నందిని సీఎం ప్రస్తుతం గౌరీ అనే తమిళ సీరియల్‌లో ప్రధాన నటిగా నటిస్తోంది. ఆమె ఇందులో కనక, దుర్గ అనే రెండు పాత్రల్లో నటిస్తోంది. మింట్ ప్రకారం ఇటీవల ఆ సీరియల్ లో ఆమె పాత్ర విషం తాగే సన్నివేశం ప్రసారమైంది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చర్చకు దారితీసింది. ఇప్పుడేమో ఆమె సూసైడ్ చేసుకుంది.
{{/usCountry}}నందిని సీఎం ప్రస్తుతం గౌరీ అనే తమిళ సీరియల్‌లో ప్రధాన నటిగా నటిస్తోంది. ఆమె ఇందులో కనక, దుర్గ అనే రెండు పాత్రల్లో నటిస్తోంది. మింట్ ప్రకారం ఇటీవల ఆ సీరియల్ లో ఆమె పాత్ర విషం తాగే సన్నివేశం ప్రసారమైంది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చర్చకు దారితీసింది. ఇప్పుడేమో ఆమె సూసైడ్ చేసుకుంది.
{{/usCountry}}నందిని కన్నడ టెలివిజన్‌లో సహాయక పాత్రలతో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె జీవ హోవాగిడే, సంఘర్ష, మధుమగలు, నీనడే నా వంటి అనేక ప్రసిద్ధ సీరియళ్లలో కనిపించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె చివరి పోస్ట్ తన షో గౌరీ నుండి వచ్చిన ప్రోమో. ఇటీవల ఆమె కొన్ని ఫొటోలను పంచుకుంది. ఆమె ఆ పోస్ట్‌కు "లవ్ లవ్" అని క్యాప్షన్ ఇచ్చింది.