OTT Thriller: వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరించే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ థ్రిల్లర్ ‘కర’ ఓటీటీలోకి వచ్చేసింది. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఇవాళ (మే 28) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.
కర ఓటీటీ

తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘కర’ ఓటీటీలోకి వచ్చేసింది. క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురువారం నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కర డిజిటల్ డెబ్యూ చేసింది.
నెల రోజుల్లోనే
కర మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 30, 2026న థియేటర్లలో రిలీజైన ఈ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపించింది. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్, మమితా బైజు జంటగా నటించారు. ఈ మూవీకి ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది.
‘కర’ కథేంటి?
1990ల కాలం నాటి నేపథ్యంలో సాగే పీరియాడిక్ హీస్ట్ థ్రిల్లర్‌గా ‘కర’ సినిమాను రూపొందించారు. ఇందులో కర స్వామి అనే ఓ దొంగ పాత్రలో ధనుష్ నటించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమితా బైజు) కోసం దొంగతనాలు వదిలేసి కష్టపడి బతకాలని కర స్వామి అనుకుంటాడు. భార్యతో కలిసి ఓ హోటల్ పెట్టి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం పొలం పేపర్లు తాకట్టు పెట్టాలని చూస్తాడు.
భూమి పట్టా పాస్ బుక్ ల కోసం కర ఊరికి వెళ్తాడు. కానీ అతని తండ్రి అనుకోకుండా చనిపోతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా కర మళ్లీ దొంగగా మారతాడు. వరుసగా బ్యాంకుల్లో దొంగతనాలు చేస్తాడు. అసలు కర మళ్లీ ఎందుకు దొంగగా మారాడు? బ్యాంకులనే ఎందుకు టార్గెట్ చేశాడు? అన్నది కర మూవీలో చూడాల్సిందే.
బాక్సాఫీస్ వసూళ్లు ఎంతంటే?
{{/usCountry}}భూమి పట్టా పాస్ బుక్ ల కోసం కర ఊరికి వెళ్తాడు. కానీ అతని తండ్రి అనుకోకుండా చనిపోతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా కర మళ్లీ దొంగగా మారతాడు. వరుసగా బ్యాంకుల్లో దొంగతనాలు చేస్తాడు. అసలు కర మళ్లీ ఎందుకు దొంగగా మారాడు? బ్యాంకులనే ఎందుకు టార్గెట్ చేశాడు? అన్నది కర మూవీలో చూడాల్సిందే.
బాక్సాఫీస్ వసూళ్లు ఎంతంటే?
{{/usCountry}}థియేటర్లలో విడుదలైన సమయంలో కర సినిమా మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోయింది. ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ ‘సక్నిల్క్’ నివేదిక ప్రకారం.. ‘కర’ చిత్రం భారతదేశంలో రూ.37.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.53.65 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. ధనుష్ నటించిన ‘కర’ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది?
‘కర’ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.
2. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది?
ఈ చిత్రం మే 28, 2026 (గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
3. ‘కర’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది?
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.53.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. భారత్‌లో రూ.37.50 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.