...
...
Next Story

Karthika Deepam 2: కార్తీక దీపం 2.. అసలు ఈ జ్యోత్స్న ఎక్కడ? మాలిని చంపేసిందా? సీరియల్ స్టోరీలో అదిరే సస్పెన్స్!

Karthika Deepam 2: ఊహించని ట్విస్ట్ లతో సాగుతున్న కార్తీక దీపం 2 సీరియల్ తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సీరియల్ లో మరో సస్పెన్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. అసలు ఈ జ్యోత్స్న ఎక్కడ? అనే ప్రశ్న ఇప్పుడు స్టోరీపై ఇంట్రెస్ట్ ను మరింత పెంచింది.

Published on: Oct 10, 2026, 16:17:06 IST
Advertisement

Karthika Deepam 2: బుల్లితెరపై పాపులర్ సీరియల్ కార్తీక దీపం 2 జోరు మామూలుగా లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తోంది. తాజాగా కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న కనిపించడం లేదు. రెండు మూడు ఎపిసోడ్లుగా జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందన్నది ఉత్కంఠ రేపుతోంది.

కార్తీక దీపం 2 జ్యోత్స్న

కార్తీక దీపం 2.. అసలు ఈ జ్యోత్స్న ఎక్కడ? మాలిని చంపేసిందా? సీరియల్ స్టోరీలో అదిరే సస్పెన్స్! (jiohotstar)
కార్తీక దీపం 2.. అసలు ఈ జ్యోత్స్న ఎక్కడ? మాలిని చంపేసిందా? సీరియల్ స్టోరీలో అదిరే సస్పెన్స్! (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్నది ఇంపార్టెంట్ పాత్ర. మొదట్లో విలన్ గా కార్తీక్, దీపను బాధ పెట్టింది. కానీ సూరజ్ తో ప్రేమలో పడ్డాక జ్యోత్స్న పూర్తిగా మారిపోయింది. ఆమెలో విలనిజం ఎగిరిపోయి, ఓ పక్కింటి అమ్మాయిలా జ్యోత్స్న మారిపోయింది. సూరజ్ మోసం చేసినా కూడా ఆవేశంతో ఊగిపోలేదు. ఓపికతో ఎదురు చూస్తూ తన ప్లాన్ ను అమలు చేస్తోంది.

జ్యోత్స్న ఎక్కడ?

మాలిని తమ నుంచి లాక్కున్న ఆఫీసులోనే సూరజ్ పీఏగా జ్యోత్స్న తిరిగి అడుగుపెట్టింది. దీంతో కార్తీక దీపం 2 సీరియల్ స్టోరీ మరో లెవల్ కు వెళ్లబోతుందని, రివేంజ్ డ్రామా మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుందని అనిపించింది. కానీ సూరజ్ పీఏగా అపాయింట్మెంట్ లెటర్ అందుకున్న జ్యోత్స్న ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడా కనిపించడం లేదు. దీంతో జ్యోత్స్న ఎక్కడా? అని సీరియల్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

మాలిని చంపేసిందా?

తన కొడుకు సూరజ్ పీఏగా జ్యోత్స్న రావడం మాలినికి ఏ మాత్రం ఇష్టం లేదు. అంతేకాకుండా జ్యోత్స్న నేరుగా మాలినికే ఛాలెంజ్ చేసింది. దిమ్మతిరిగే కౌంటర్లు వేసింది. దీంతో జ్యోత్స్నను కనిపించకుండా చేయమని తన బాడీగార్డ్ విజయ్ కు మాలిని ఆర్డర్ వేసింది. దీంతో జ్యోత్స్నను మాలిని చంపేసిందా? అనే ప్రశ్న రేకెత్తుతోంది.

కార్తీక్, దీపకు డౌట్

ఎందుకంటే ప్రస్తుతం సీరియల్ స్టోరీ అంతా మాలినిపై రివేంజ్ తీర్చుకోవడానికి జ్యోత్స్న, కార్తీక్, దీప వేస్తున్న ప్లాన్స్ చుట్టూనే తిరుగుతోంది. సూరజ్, జ్యోత్స్న పెళ్లి కావడంతోనే ఈ సీరియల్ కథకు ఓ పర్ఫెక్ట్ ఎండింగ్ వస్తుందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో జ్యోత్స్నను మాలిని చంపే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. మరి జ్యోత్స్న ఎక్కడికి వెళ్లింది? ఆమెను మాలిని కిడ్నాప్ చేసిందా? అనేది రాబోయే ఎపిసోడ్లలో తెలిసే అవకాశముంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks