...
...
Next Story

Kareena Kapoor: 10 ఎకరాల విస్తీర్ణం, 150 గదుల పటౌడీ ప్యాలెస్‌లో కరీనా- పిల్లలతో రాయల్ వెకేషన్- ఆ కోర్టు తీర్పుపై పోస్ట్!

Kareena Kapoor Family Vacation At Pataudi Palace: అద్భుత కట్టడంలో ఒకటైన పటౌడీ ప్యాలెస్‌లో బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఫ్యామిలీ సందడి చేసింది. కుమారులు తైమూర్, జెహ్‌లతో కలసి తమ పూర్వీకుల నివాసంలో దిగిన ఫొటోలను తాజాగా షేర్ చేసింది కరీనా. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టంట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Published on: May 1, 2026, 20:28:39 IST
Advertisement

Kareena Kapoor Family Vacation At Pataudi Palace: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బెబో కరీనా కపూర్ తన కుమారులు తైమూర్, జెహ్‌లతో కలిసి హర్యానాలోని తమ పూర్వీకుల నివాసం 'పటౌడీ ప్యాలెస్‌'లో విహరిస్తున్నారు. మే 1వ తేదీన అక్కడి ప్రశాంతమైన వాతావరణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు గుడ్ మార్నింగ్ చెప్పారు.

10 ఎకరాల విస్తీర్ణం, 150 గదులు

10 ఎకరాల విస్తీర్ణం, 150 గదుల పటౌడీ ప్యాలెస్‌లో కరీనా- పిల్లలతో రాయల్ వెకేషన్- ఆ కోర్టు తీర్పుపై పోస్ట్! (PTI, Instagram)
10 ఎకరాల విస్తీర్ణం, 150 గదుల పటౌడీ ప్యాలెస్‌లో కరీనా- పిల్లలతో రాయల్ వెకేషన్- ఆ కోర్టు తీర్పుపై పోస్ట్! (PTI, Instagram)

హర్యానాలో 10 ఎకరాల విస్తీర్ణంలో, 150 గదులతో విరాజిల్లుతున్న పటౌడీ ప్యాలెస్ ఒక అద్భుత కట్టడం. 1935లో నవాబ్ ఇబ్రహీం అలీ ఖాన్ నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రస్తుతం దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ ఆధీనంలో ఉంది. షూటింగ్‌లు, బిజీ షెడ్యూల్స్ నుంచి విరామం దొరికినప్పుడల్లా సైఫ్-కరీనా జంట ఇక్కడికే వచ్చి సేదతీరుతుంటారు.

తైమూర్, జెహ్‌ల ఆటపాటలు

తాజాగా కరీనా షేర్ చేసిన ఫోటోల్లో పటౌడీ ప్యాలెస్‌లోని పాతకాలపు వరండాలు, తెల్లని స్తంభాలు, క్లాసిక్ ఫర్నీచర్ రాజఠీవిని తలపిస్తున్నాయి. కరీనా పంచుకున్న ఒక ఫోటోలో తైమూర్, జెహ్‌లు విశాలమైన ప్రాంగణంలో ఆడుకుంటున్నారు. ఇండోర్ నుంచి తీసిన ఈ ఫోటోలో పెద్ద పెద్ద ఆర్చ్‌లు, పచ్చని ప్రకృతి మధ్య పిల్లలు ఆడుకుంటున్న దృశ్యం ఎంతో అందంగా ఉంది.

మరొక ఫోటోలో సూర్యరశ్మి పడుతున్న టెర్రస్ పైన ఒక చిన్న మంచం, దానిపై దిండ్లు వేసి ఉన్నాయి. "లేజీ ఓల్డ్ స్కూల్ మార్నింగ్స్" అంటూ కరీనా కపూర్ ఉదయాన్నే ఎంత ప్రశాంతంగా గడుపుతున్నారో వివరించారు. తన టేబుల్ వద్ద కూర్చుని కాఫీ తాగుతూ పిల్లల అల్లరిని ఆమె ఫోటోల్లో బంధించారు.

కుటుంబ వేడుకలు.. సబా అలీ ఖాన్‌కు శుభాకాంక్షలు

ప్యాలెస్ దృశ్యాలతో పాటు, తన ఆడపడుచు సబా అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కరీనా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సబాతో కలిసి దిగిన ఒక పోలరాయిడ్ ఫోటోను షేర్ చేస్తూ, "హ్యాపీ బర్త్‌డే డియరెస్ట్ సబా.. నీకు సుఖసంతోషాలు, మరెన్నో కేక్ ముక్కలు దక్కాలి" అంటూ ప్రేమపూర్వక సందేశాన్ని పంపారు.

కోర్టు తీర్పుపై స్పందన: 'న్యాయమే గెలుస్తుంది'

కేవలం కుటుంబ విశేషాలే కాకుండా, కరీనా ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను కూడా షేర్ చేశారు. ఆమె సోదరి కరిష్మా కపూర్ పిల్లలకు సంబంధించిన ఆస్తి వివాదంలో ఢిల్లీ హైకోర్టు అనుకూలమైన తీర్పునిచ్చిన నేపథ్యంలో కరీనా స్పందించారు.

ప్రియా సచ్‌దేవ్ కపూర్‌తో సాగుతున్న ఈ వివాదంలో మధ్యంతర ఊరట లభించడంపై కరీనా కపూర్ హర్షం వ్యక్తం చేస్తూ.. "వెలుగు కనిపిస్తోంది. న్యాయం, నిజం ఎప్పుడూ గెలుస్తాయి. చర్ది కలా (ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండటం)" అంటూ నోట్ రాశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

పటౌడీ ప్యాలెస్‌లోని కారిడార్
ఓపెన్ టెర్రస్‌లో జెహ్, తైమూర్ ఆట

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. పటౌడీ ప్యాలెస్ ఎక్కడ ఉంది? దీనిని ఎవరు నిర్మించారు?

పటౌడీ ప్యాలెస్ హర్యానాలో ఉంది. దీనిని 1935లో నవాబ్ ఇబ్రహీం అలీ ఖాన్ నిర్మించారు. ప్రస్తుతం ఇది నటుడు సైఫ్ అలీ ఖాన్ సొంతం.

2. కరీనా కపూర్ తన పోస్ట్‌లో 'చర్ది కలా' అని ఎందుకు రాశారు?

తన సోదరి కరిష్మా కపూర్ పిల్లలకు సంబంధించిన ఆస్తి వివాదంలో కోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన సందర్భంలో, ధైర్యాన్ని మరియు న్యాయంపై నమ్మకాన్ని వ్యక్తపరచడానికి ఆమె ఈ పదాన్ని వాడారు.

3. సబా అలీ ఖాన్ ఎవరు?

సబా అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ సోదరి, కరీనా కపూర్‌కు ఆడపడుచు. ఆమె పుట్టినరోజు వేడుకల కోసమే ఈ కుటుంబం పటౌడీ ప్యాలెస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks