...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ మూవీ- బిర్యాని కోసం ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్ కష్టాలు- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ నేరుగా లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ బిర్యాని పాయింట్ స్ట్రీమింగ్ వచ్చేసింది. ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్ బిర్యాని కోసం పడే కష్టాలతో ఈ సినిమా సాగుతుంది. ఆద్యంతం నవ్వించేలా సాగే కరిముల్లా బిర్యాని పాయింట్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 30, 2025, 16:30:36 IST
Advertisement

ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఎన్నో రకాల జోనర్స్, డిఫరెంట్ కథలతో ఓటీటీ సినిమాలు అలరిస్తుంటాయి. వాటిలో చాలా వరకు తెలుగు స్ట్రయిట్ సినిమాలతోపాటు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటున్నాయి.

అచ్చమైన తెలుగు మూవీ

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ మూవీ- బిర్యాని కోసం ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్ కష్టాలు- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ మూవీ- బిర్యాని కోసం ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్ కష్టాలు- ఇక్కడ చూసేయండి!

అయితే, అచ్చ తెలుగు కథలతో మాత్రం అరకొర సినిమాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రతి ఆదివారం ఓ అచ్చమైన తెలుగు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ (నవంబర్ 30) కూడా ఓటీటీ తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ అయింది.

బిర్యాని కోసం

ఆ సినిమానే కరిముల్లా బిర్యాని పాయింట్. నూతక్కి అనేది మూవీ క్యాప్షన్. ఓల్డ్ ఏజ్‌లో ముగ్గురు ఫ్రెండ్స్ బిర్యాని కొనేందుకు పడే కష్టాల కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. కరిముల్లా బిర్యాని పాయింట్ సినిమాకు ప్రభు చంద్ కథ, దర్శకత్వం వహించారు.

ముగ్గురు పాత్రల చుట్టూ

ఈ సినిమాలో చైతన్య సగిరాజు, కంచెరపాలెం రాజు, శివ నారాయణ నరిపెద్ది (అమృతం ఫేమ్ అప్పాజి) ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు కేదార్, సుజన జొన్నాల హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ ఇద్దరితో లవ్ రొమాంటిక్ ట్రాక్ నడిస్తే.. ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్‌తో కామెడీ చూపించారు.

కూతురు కోసం

ఉదయ్ సద్దాల నిర్మించిన కరిముల్లా బిర్యాని పాయింట్ సినిమాకు పి కల్యాణ్ కుమార్ సినిమాటోగ్రఫీ, ప్రతీక్ నూతి ఎడిటింగ్ వర్క్స్ చేశారు. ఆదిత్య బీఎన్ సంగీతం అందించారు. ముగ్గురు ఫ్రెండ్స్‌లో ఒకరి కూతురికి బిర్యాని అంటే చాలా ఇష్టం. అది కూడా కరిముల్లా బిర్యాని పాయింట్‌లోని బిర్యానినే అతి ఇష్టంగా తింటుంది.

డబ్బు కోసం పడే పాట్లు

చాలా సింపుల్ లైన్ అయినప్పటికీ తండ్రి ఎమోషన్‌ను కామెడీ, భావోద్వేగాలతో చూపించిన కరిముల్లా బిర్యాని పాయింట్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ఈటీవీ విన్‌లో నేటి నుంచి కరిముల్లా బిర్యాని పాయింట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి ఆదివారం ఈటీవీ విన్ కథా సుధా వీక్లీ సిరీస్ వస్తుందన్న విషయం తెలిసిందే.

ఈటీవీ విన్ ఓటీటీలో

అందులో భాగంగానే నేడు కరిముల్లా బిర్యాని పాయింట్ ఓటీటీ రిలీజ్ అయింది. అంతేకాకుండా కేవలం 37.19 నిమిషాల రన్‌టైమ్‌తో కరిముల్లా బిర్యాని పాయింట్ సినిమా తెరకెక్కింది. మరి ముగ్గురు ఓల్డేజ్ ఫ్రెండ్స్ ఫన్ చూడాలనుకుంటే ఈటీవీ విన్ ఓటీటీలో కరిముల్లా బిర్యాని పాయింట్ మూవీని వీక్షించొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe