...
...
Next Story

Karthika Deepam 2: మనోడని చూడరు, నష్టం వస్తే క్లోజ్- చిన్నచూపు చూస్తారనిపించేది: సీరియళ్లపై కార్తీక దీపం 2 హీరో నిరుపమ్

Karthika Deepam 2 Actor Nirupam Paritala On TV Serials: కార్తీక దీపం 2 సీరియల్‌తో దూసుకుపోతున్న బుల్లితెర హీరో నిరుపమ్ పరిటాల. యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో మెప్పించే నిరుపమ్ సీరియల్‌కు నిర్మాతగా కూడా ఉన్నాడు. అలాంటి నిరుపమ్ పరిటాల ఇటీవల సీరియళ్ల వల్ల వచ్చే ఇబ్బందులపై కామెంట్స్ చేశారు.

Published on: May 31, 2026, 07:15:07 IST
Advertisement

Karthika Deepam 2 Hero Nirupam Paritala On TV Serials: కార్తీక దీపం, కార్తీక దీపం 2 సీరియళ్లతో తెలుగు బుల్లితెరపై స్టార్ సీరియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నిరుపమ్ పరిటాల. సాధారణంగా నిరుపమ్ పరిటాల అంటే పెద్దగా తెలుగు ఆడియెన్స్ గుర్తు పట్టకపోవచ్చు. కానీ, డాక్టర్ బాబు, కార్తీక్, మాయలోడు అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తాడు.

స్టార్ సీరియల్ హీరోగా

మనోడని చూడరు, నష్టం వస్తే క్లోజ్- చిన్నచూపు చూస్తారనిపించేది: సీరియళ్లపై కార్తీక దీపం 2 హీరో నిరుపమ్
మనోడని చూడరు, నష్టం వస్తే క్లోజ్- చిన్నచూపు చూస్తారనిపించేది: సీరియళ్లపై కార్తీక దీపం 2 హీరో నిరుపమ్

తన నటన, డైలాగ్ డెలివరీతో అంతటి క్రేజ్ తెచ్చుకుని బుల్లితెరపై స్టార్ సీరియల్ హీరోగా దూసుకుపోతున్నాడు నిరుపమ్ పరిటాల. హీరోగానే కాకుండా పలు సీరియళ్లకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు ఈ డాక్టర్ బాబు. అలాంటి కార్తీక్ బాలు అలియాస్ నిరుపమ్ పరిటాల ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సీరియళ్లపై, అవి తెరకెక్కించే క్రమంలో ఉండే ఒడిదుడుకులపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"నేను టీవీకే పరిమితం కావడానికి కారణం ఏంటంటే.. అది నా నేచర్ ఏమో. మనుషులతో నేను వెంటనే పరిచయాలు పెంచుకుని కలుపుగోలుగా ఉండకపోవడం అనేది ఇండస్ట్రీలో డిస్ అడ్వాంటేజే. అది తప్పితే మరో కారణం లేదు. కానీ, సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ అంటే అంత సులభం కాదు. కచ్చితంగా పరిచయాలు ఉండాలి, అందరిని కలవాలి, వాళ్ల కళ్ల ముందు తిరగాలి. అలా చేస్తే హో వీడు ఒకడున్నాడని వారు అనుకుంటారు. తొందరగా నోటీస్ అవుతాం" అని నిరుపమ్ పరిటాల తెలిపాడు.

డెలికేట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశా

"నేను చంద్రముఖి సీరియల్ చేస్తున్నప్పుడు సినిమాల్లో ఆడిషన్స్ ఇచ్చేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, నాతో పాటు కొత్త వాళ్లు కూడా ఆడిషన్స్‌కు వస్తుంటారు. అప్పుడు వాళ్లు నన్ను మీరు ఆల్రెడీ ఆర్టిస్ట్ కదా. మీరు కూడా వచ్చారేంటీ అని చిన్న చూపు చూస్తారనిపించేది. అలాంటి డెలికేట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. మనకి బాగా తెలిసి ఉండి.. చనువు ఉంటే తప్పా నేను వెళ్లను" అని డాక్టర్ బాబు చెప్పుకొచ్చాడు.

"పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్ తీశాను. అది మధ్యలోనే ఆపేశాం. సుమారు 200 ఎపిసోడ్స్ దగ్గర దాన్ని ఆపేశం. టీఆర్పీ రావడం లేదని, సీరియల్ ఆపేయమని ఛానెల్ వాళ్లు మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఇది కచ్చితంగా బిజినెస్ అంతే. ఈ వ్యాపారంలో మొహమాటాలు చూడరు. వీడు మనోడే, మనతోనే ఉన్నాడు.. అలాంటివేం చూడరు. నష్టం వస్తుందంటే క్లోజ్ అంటారంతే. మొత్తంగా ఇది ఒక బిజినెస్. లేకుంటే మూసేసుకోవాల్సిందే" అని కార్తీక దీపం 2 హీరో వెల్లడించాడు.

"నేను నిర్మాతగా చేసే సీరియల్స్ అన్నింట్లో నేనూ హీరోగా చేసేయొచ్చు. కానీ, ప్రైమ్ టైమ్‌లో వచ్చే సీరియల్స్‌లో ఒకే హీరో ఉంటే బాగుండదు. కార్తీక దీపం సీరియల్‌లో హీరోగా చేస్తున్నా.. పొదరిల్లుకు నిర్మాతని. సాధారణంగా ఒక సీరియల్‌కి నెలలో 12 రోజులు పని చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో 30 ఎపిసోడ్స్ చేస్తేనే సేఫ్‌లో ఉంటాం. లేకపోతే మైనస్‌లోకి వెళ్లిపోతాం" అని నిరుపమ్ సీరియల్స్ నిర్మాణ కష్టాలు చెప్పాడు.

అలా చేస్తే ఖర్చులు ఎక్కువైపోతాయి

"వాళ్లు ఇచ్చే బడ్జెట్‌కి లోబడి చేయాలి. కాదని ఎక్కువ రోజులు షూట్ చేస్తే ఖర్చులు ఎక్కువైపోతాయి. ఎపిసోడ్‌కు వచ్చి వాళ్లు ఇచ్చే బడ్జెట్‌ను బట్టి ఖర్చులు ఉంటాయి. సీరియల్స్‌లో ఒక రోజుకు 40 నుంచి 50 వరకు మంది పనిచేస్తుంటారు. వాళ్లకి భోజనాలు, టిఫిన్లు, మేకప్ రూమ్స్ ఇలా చాలా ఉంటాయి. ప్రొడక్షన్ కాస్ట్ అంటే సినిమాకు సీరియల్‌కు పెద్ద తేడా ఏం ఉండదు" అని పేర్కొన్నాడు బుల్లితెర హీరో నిరుపమ్ పరిటాల.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks