సుమిత్రమ్మలో ఈ యాంగిల్ కూడా ఉందా? కాంచనతో కలిసి తీన్‌మార్ స్టెప్పులు.. కార్తీక దీపం 2 యాక్టర్ల డ్యాన్స్ వీడియో వైరల్!

తెలుగులో టాప్ సీరియల్ కార్తీక దీపం 2. ఇందులో సుమిత్ర, కాంచన పాత్రలు సెంటిమెంట్ తో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కానీ బయట మాత్రం ఈ క్యారెక్టర్లు చేస్తున్న సీత, స్వర్ణ తీన్ మార్ డ్యాన్స్ తో అదరగొట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది. సుమిత్రమ్మలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Feb 10, 2026, 13:45:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో టాప్ సీరియల్ గా కొనసాగుతున్న కార్తీక దీపం 2కు ఫ్యాన్స్ ఎక్కువే. ఈ సీరియల్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు ఇందులోని సుమిత్ర, కాంచన క్యారెక్టర్ల బాగా తెలుసు. సీరియల్ లో ఎమోషన్ తో కంటతడి పెట్టిస్తారు వీళ్లిద్దరు. కానీ బయట మాత్రం తీన్ మార్ డ్యాన్స్ తో అదరగొట్టారు.

సీత, స్వర్ణ (instagram-Actress seetha ayas)
సీత, స్వర్ణ (instagram-Actress seetha ayas)

కార్తీక దీపం 2

స్టార్ మాలో వస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ లో సుమిత్ర పాత్రను సీత, కాంచన క్యారెక్టర్ ను స్వర్ణ ప్లే చేస్తున్నారు. ఇందులో సుమిత్ర ఏమో కార్తీక్ కు మేనత్త, దీపకు తల్లి. కాంచన ఏమో కార్తీక్ కు తల్లి. ప్రస్తుతం సీరియల్ లో సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. దీని ట్రీట్మెంట్ చుట్టూ ఎమోషనల్ గా స్టోరీ సాగుతోంది. సుమిత్ర ట్రీట్మెంట్ కోసం తమ బిడ్డ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితుల్లో దీప, కార్తీక్ ఉంటారు.

తీన్‌మార్ డ్యాన్స్‌

కార్తీక దీపం 2 సీరియల్ లో ఎమోషనల్ యాక్టింగ్ తో ఏడ్పించే సీత, స్వర్ణ.. బయట మాత్రం ఎంతో జాలీగా ఉంటారు. షూటింగ్ స్పాట్ లో మధ్యలో బ్రేక్ లో రీల్స్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపేస్తుంటారు. తాజాగా సీత, స్వర్ణ కలిసి చేసిన ఓ తీన్‌మార్ డ్యాన్స్‌ వీడియో తెగ వైరల్ గా మారింది. తీన్‌మార్ ట్యూన్ కు వీళ్లిద్దరు కలిసి అదిరిపోయేలా స్టెప్పులు వేశారు.

సీత, స్వర్ణ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీళ్ల రీల్స్, డ్యాన్స్ వీడియోలు చూసి సీరియల్స్ లో ఏడిపించే వీళ్లలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

టాప్ సీరియల్

కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. స్టార్ మాలో రాత్రి 8 గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో నిరుపమ్ పరిటాల హీరో కార్తీక్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ప్రేమి విశ్వనాథ్ ఏమో హీరోయిన్ దీపగా నటిస్తోంది. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ చైత్ర లక్ష్మి (దీప కూతురు శౌర్య), గాయత్రి సింహాద్రి (జ్యోత్స్న), స్వర్ణ (కాంచన), రత్న (శ్రీధర్), సీత (సుమిత్ర), నటకుమారి (పారిజాతం), సురేశ్ (దశరథ), శివ నారాయణ (శివ నారాయణ) తదితరులు నటిస్తున్నారు.

గాయత్రి సింహాద్రి, నటకుమారి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు ప్లే చేస్తున్నారు. శివ నారాయణ వారసురాలిగా జ్యోత్స్న నటిస్తుంది. అసలు వారసురాలు దీప అనే నిజం ఎప్పుడు తెలుస్తుందనే సస్పెన్స్ చుట్టూ ఈ సీరియల్ కథ సాగుతోంది. దీనికి కాపుగంటి రాజేంద్ర డైరెక్టర్.