Karthika Deepam 2: తెలుగు బుల్లితెరపై కార్తీక దీపం అండ్ వంటలక్క క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'కార్తీక దీపం 2' కూడా అదే రేంజ్ ట్విస్టులతో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ హైప్ మరింత పెరిగింది. అందుకు కారణం మాలిని క్యారెక్టర్. ఆ పాత్రపై మేకర్స్ పెంచుతున్న అంచనాలే.
మాలిని పాత్ర చుట్టూ ‘మిస్టరీ’

కార్తీక దీపం 2 సీరియల్ కథలోకి దక్షిణామూర్తి కోడలిగా ఎంట్రీ ఇచ్చిన మాలిని (కన్నడ నటి తేజస్విని ప్రకాష్) నెగిటివ్ షేడ్స్‌తో కూడిన పవర్‌ఫుల్ లేడీ విలన్‌గా కనిపిస్తోంది. అయితే, ఈమె వెనుక ఉన్న అసలు సత్యం ఏంటి? ఆమె గతం ఏంటి? శివ నారాయణ హోటల్ సామ్రాజ్యాన్ని కూల్చడమే ఆమె ఏకైక లక్ష్యమా? అనే విషయాలను మేకర్స్ చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు.
హైప్
సాధారణంగా ఏ సీరియల్‌లో అయినా విలన్ మోటివ్ ఏంటో ఆడియన్స్‌కు ముందే హింట్ ఇస్తారు. కానీ కార్తీక దీపం 2 సీరియల్ లో మాలిని విషయంలో మాత్రం ఆడియన్స్‌ను కంప్లీట్ డార్క్‌లో ఉంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
పీక్స్‌కు చేరిన ఎలివేషన్స్!
కార్తీక దీపం 2 సీరియల్ కథలో మాలిని క్యారెక్టర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యుల పాత్రలను మేకర్స్ వాడుకుంటున్నారు. ముఖ్యంగా సుమిత్ర, శివనారాయణ, కాంచనలు మాలిని గురించి మాట్లాడే ప్రతి మాట ఆ క్యారెక్టర్‌కు ఒక పెద్ద ఎలివేషన్‌లా మారుతోంది.
దీప, కార్తీక్‌లను మాలిని విషయంలో చాలా అలర్ట్‌గా ఉండమని వారు చేస్తున్న హెచ్చరికలు ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. "ఆమె మామూలు మనిషి కాదు" అనే నరేటివ్‌ను బలంగా ఇంజెక్ట్ చేయడం వల్ల, ప్రతి ఎపిసోడ్లో ఆమె ఏం చేయబోతుందా అనే ఉత్కంఠ రేగుతోంది.
ఆడ పులి
{{/usCountry}}దీప, కార్తీక్‌లను మాలిని విషయంలో చాలా అలర్ట్‌గా ఉండమని వారు చేస్తున్న హెచ్చరికలు ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. "ఆమె మామూలు మనిషి కాదు" అనే నరేటివ్‌ను బలంగా ఇంజెక్ట్ చేయడం వల్ల, ప్రతి ఎపిసోడ్లో ఆమె ఏం చేయబోతుందా అనే ఉత్కంఠ రేగుతోంది.
ఆడ పులి
{{/usCountry}}మాలిని క్యారెక్టర్ కు మేకర్స్ మామూలు హైప్ ఇవ్వడం లేదు. మాలిని ఆడ పులి అని, వేటకు సిద్ధమైందని కాంచన చెప్పిన మాటలు హైలైట్ గా నిలిచాయి. అయితే మాలిని గతం గురించి మాత్రం ఇప్పుడే ఎవరూ మాట్లాడటం లేదు. దీంతో కార్తీక దీపం 2 సీరియల్ లో సస్పెన్స్ రోజురోజుకూ పెరుగుతోంది.
ఎండింగ్ ఏం చేస్తారో?
బుల్లితెర విశ్లేషకుల ప్రకారం.. మేకర్స్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ఒక కత్తి మీద సాము లాంటిదే. మాలిని క్యారెక్టర్‌పై ప్రస్తుతం బిల్డ్ చేసిన ఎక్స్‌పెక్టేషన్స్ స్కై-హైలో ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆమె గతాన్ని రివీల్ చేసే సీన్స్ కానీ, లేదా ఈ డ్రామాకు ఇచ్చే ముగింపు కానీ ఆడియన్స్ ఊహించిన స్థాయిలో లేకపోతే.. ఇప్పటివరకు క్రియేట్ చేసిన హైప్ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
గతంలో మొదటి సీజన్‌లో మోనిత క్యారెక్టర్‌ను సాగదీసి బోర్ కొట్టించినట్లు కాకుండా, దీనికి పక్కా జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.