Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దక్షిణామూర్తి, మాలిని వెళ్లిపోయిన తర్వాత మీటింగ్ నుంచి సూరజ్ బయటకొస్తాడు. కార్తీక్ కూడా వచ్చి సూరజ్‌తో మాట్లాడుతాడు. జ్యోత్స్న ఏంటీ నీ గురించి అలా మాట్లాడేసింది, నిన్ను అంతలా వెనుకేసుకోచ్చిందేంటని కార్తీక్ అంటాడు.
వాళ్ల మీద పడి కొట్టేసేదేమో

మేమంతా నోరెళ్లబెట్టుకుని చూశాం. నీకు కూడా అలాగే ఉండి ఉంటుంది. అందరిని అల్లాడించేసింది. ఇంకేమైనా అంటే వాళ్లని మీదపడి కొట్టేసేదేమో, అంత దూకుడు చూపించింది అని కార్తీక్ అంటాడు. అదంతా వాళ్ల అత్త మీదున్న కోపమని సూరజ్ అంటే.. ఇంకా నేను నీ మీద ప్రేమ అనుకున్నానే అని కార్తీక్ అంటాడు.
పెళ్లి చేసుకోనని పంతం పట్టిన మనిషి నా మీద ప్రేమ ఎందుకు చూపిస్తుందని సూరజ్ అంటాడు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని కార్తీక్ అడుగుతాడు. అది నీ ఇష్టం అని సూరజ్ అంటాడు. జ్యోత్స్నలో నాకు మార్పు కనిపిస్తుంది. అది నీకు కనపడతుందో లేదో నువ్వే చెప్పాలి. జ్యోత్స్న నిన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. జ్యోత్స్న పెళ్లి చేసుకోనంది. కానీ, మనసు ఊరుకోదు కదా. ఆ మనసులో నువ్వు ఉన్నావ్. అది మారడానికి చూస్తుంది. అది నీకు అర్థం కావడంలేదని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న ఇలా మాట్లాడటం తొలిసారి చూస్తున్నా అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్‌గానే చెప్పింది. తను ఎమోషనల్‌గా నిజాయితీగా కనిపించింది. ఈ టైమ్‌లో తన తప్పు ఒప్పుకోవడం మాములు విషయం కాదు. దానికి ఎంతో గట్స్ ఉండాలి. కానీ, నన్ను ఇంప్రెస్ చేయడానికి చెప్పలేదని సూరజ్ అంటాడు.
పాజిటివ్‌గానే తీసుకున్నాడు
జ్యోత్స్న అందరికి నచ్చేలా మారితే మంచి విషయమే కదా అని సూరజ్ అంటే బ్రదర్ పాజిటివ్‌గానే తీసుకున్నాడని కార్తీక్ మనసులో అనుకుంటాడు. అయినా ఈ విషయం మాలినికి ఎలా తెలిసిందో అని సూరజ్ అంటే.. ఉందిగా మా ఇంట్లో మందర. నాకు తెలిసి ఈరోజు మా ఇంట్లో మందరకి సకుటుంబ సపరివార సన్మానమే అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}జ్యోత్స్న అందరికి నచ్చేలా మారితే మంచి విషయమే కదా అని సూరజ్ అంటే బ్రదర్ పాజిటివ్‌గానే తీసుకున్నాడని కార్తీక్ మనసులో అనుకుంటాడు. అయినా ఈ విషయం మాలినికి ఎలా తెలిసిందో అని సూరజ్ అంటే.. ఉందిగా మా ఇంట్లో మందర. నాకు తెలిసి ఈరోజు మా ఇంట్లో మందరకి సకుటుంబ సపరివార సన్మానమే అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}కట్ చేస్తే ఇంట్లో పారిజాతంను గట్టిగా పిలిచి ఇంట్లో విషయాలు మాలినికి ఎందుకు చెప్పావని నిలదీస్తుంది జ్యోత్స్న. ఫోన్ చేసింది చెప్పాను. మనం చెప్పకున్నా చెప్పేలా చేస్తుంది అని పారిజాతం అంటుంది. నువ్వు చెప్పాక వచ్చి ఆఫీస్‌లో గొడవ చేసిందని జ్యోత్స్న అంటుంది. దాంతో సుమిత్ర కోప్పడుతుంది. నీలాగే జ్యోత్స్న రియాక్ట్ అయిందని శివ నారాయణ చెబుతాడు.
వాళ్లు వెళ్లిపోయారు కానీ వచ్చేలా చేసింది ఎవరు. ఇంటి నాలుగు గోడల మధ్య చాలా మాట్లాడుకుంటాం. కొన్ని గటప దాటకూడదు. కొన్ని గేటు దాటకూడదు. కానీ, నువ్వు మాలినికి తెలిసేలా చేశావ్. మనల్ని మాట అనే ఛాన్స్ ఎందుకు ఇచ్చావ్ అని జ్యోత్స్న అంటుంది. ఏం మాట్లాడిందని సుమిత్ర అంటుంది. సూరజ్ అనాథ అని నోటికొచ్చినట్లు మాట్లాడిందని శివ నారాయణ అంటాడు.
తాత గౌరవాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడు
మాలిని ఇంటికి పదండి. నా కూతురు గురించి, సూరజ్ గురించి మాట్లాడే అర్హత తనకేముందని సుమిత్ర కోప్పడుతుంది. ఆవేశపడకు. జ్యోత్స్న మాట్లాడింది తెలిస్తే నువ్వు అనవు అని దశరథ అంటుంది. గ్రానీ, ఈ ఇంటి గురించి మాట్లాడేటప్పుడు తాత గౌరవాన్ని, డాడీ మర్యాదను, మా ఆత్మాభిమానాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడమని, నా కారణంగా మావాళ్లు ఎవరు ఎవరిముందు తలవంచుకునేలా చేయకు. అలా చేస్తే ఎవరైనా సహించను. ఈ మాట గుర్తుపెట్టుకో గ్రానీ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
నేను చూస్తుంది జ్యోత్స్ననేనా అని సుమిత్ర మనసులో అనుకుంటుంది. ఇదేంటీ ఇలా వాయించేసిందని పారిజాతం అనుకుంటుంది. ఇంకోసారి తప్పు జరిగితే క్షమించను అని శివ నారాయణ, నా పుట్టింటి వాళ్ల గురించి మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండని సుమిత్ర వెళ్లిపోతుంది. సూరజ్, జ్యోత్స్న గురించి ఏం అర్థంకావడం లేదని దీప అంటుంది.
దానికి మనం కొన్ని పనులు చేయాలి. దాంతో అటు జ్యో, ఇటు సూరజ్ ఇద్దరు ఓపెన్ అవుతారని కార్తీక్ అంటాడు. తర్వాత జ్యోత్స్న దగ్గరికి సూరజ్‌ని తీసుకెళ్లి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం అని కార్తీక్ అంటాడు. దాంతో జ్యోత్స్న కంగారుపడుతుంది. అది కార్తీక్, దీప గమనిస్తారు. నీకు పెళ్లి కావట్లేదని మీ అన్నయ్య కంగారుపడుతున్నారు మరిది అని దీప అంటుంది.
అమ్మాయిల ఫొటోలు పంపారు
రాత్రి పెళ్లిళ్ల పేరయ్యకు ఫోన్ చేసి పెళ్లి గురించి చెప్పాను. కొందరి అమ్మాయిల ఫొటోలు పంపారు. అవి నీ ఫోన్‌కు సెండ్ చేశాను. నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెబితే తల్లిదండ్రుల్లా నేను మీ వదిన నిలబడి పెళ్లి చేస్తామని కార్తీక్ అంటాడు. సూరజ్ వద్దంటే బలవంతంగా చూడమంటాడు కార్తీక్. జ్యోత్స్న ఆవేశంతో రగిలిపోతుంది.
ఈ బ్లాక్ డ్రెస్ అమ్మాయి నీకు బాగా సెట్ అవుతుంది. జ్యోత్స్న కంటే బాగుందని కార్తీక్ అంటాడు. ఇవన్నీ వద్దని సూరజ్ అంటాడు. నీ మనసులో ఎవరైనా ఉంటే వాళ్లతోనే మాట్లాడతామని సూరజ్ అంటాడు. జ్యోత్స్నే ఉండుంటుంది అని దీప అంటుంది. నాకు ఎవరు వద్దు వదినా అని సూరజ్ వెళ్లిపోతూ జ్యోత్స్నను చూసి ఆగుతాడు.
వీళ్లు నచ్చకుంటే ఇంకా వేరే వాళ్లను చూడమని మ్యారేజ్ బ్రోకర్‌కు చెబుతానని కార్తీక్ అంటే.. చెప్పండి బ్రదర్. నేను పెళ్లి చేసుకోడానికి వేరే సంబంధాలు చూడండి అని కార్తీక్, దీపకు షాక్ ఇచ్చి వెళ్లిపోతాడు సూరజ్. అలా కార్తీక్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మనం కరెక్ట్‌గానే వెళ్తున్నామని దీప అంటుంది. ఇప్పుడు దీప తన మనసులో మాట బయటపెడుతుందని కార్తీక్ అంటాడు.
అన్నింటికి ముగింపు పలికే రోజు
తర్వాత రాత్రి జ్యోత్స్న, సూరజ్ ఇద్దరికి ప్రేమ ఉన్న ఇగోల వల్ల ఒప్పుకోవట్లేదని కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. ఇది ఎడతెగని సరికొత్త ప్రేమకథ. ఇద్దరి మొండి ఘటాలను ఎలా కలపాలి అని కార్తీక్ అంటాడు. కడుపుతో ఉన్నావ్, నిన్ను నవ్వు జాగ్రత్తగా చూసుకోవాలిగా అని తర్వాత అంటాడు కార్తీక్. అన్నింటికి ముగింపు వచ్చే సమయం వచ్చింది, అదే జ్యోత్స్న, సూరజ్ పెళ్లి అని దీప అంటుంది.
జ్యోత్స్న పెళ్లి కాగానే నిన్న నీ తల్లిదండ్రుల దగ్గర నిలబెట్టడమే నా ముందున్న లక్ష్యం అని కార్తీక్ అంటాడు. మనం జ్యోత్స్న కథకు ముగింపు తీసుకొద్దామని దీప అంటుంది. మరుసటి రోజు ఉదయం ఎవరో డోర్ కొట్టడంతో శౌర్య వెళ్లి తీస్తుంది. అక్కడ జ్యోత్స్నను చూసి ఆశ్చర్యపోతుంది. నేనింకా బస్ డ్రైవర్ అనుకున్నా అని శౌర్య అంటుంది.
బస్ డ్రైవర్‌లా జ్యోత్స్న
ఎవరితో మాట్లాడుతున్నావని కార్తీక్ అంటే.. బస్ డ్రైవర్ నాన్న.. ఛీ ఛీ జ్యోత్స్న నాన్న అని శౌర్య అంటుంది. నీకు కూడా లోకువ అయ్యానా, బుడంకాయ్ అని జ్యో లోపలికి వెళ్తుంది. దీపను పిలుస్తుంది. మాట్లాడాలని చెబుతుంది. ప్రైవసీ కావాలని జ్యోత్స్న బయటకు వెళ్తుంది. దీప, కార్తీక్ కూడా వెళ్తారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.