కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పారిజాతం, జ్యోత్స్న పడుకుంటారు. జ్యోత్స్నను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కలగంటుంది పారిజాతం. వద్దు జ్యోత్స్నను అరెస్ట్ చేయొద్దు అంటూ అరుస్తుంది పారిజాతం. దాంతో జ్యోత్స్న లేపుతుంది. ఆఫీస్‌లో నువ్ చేసిన మోసం బయటపడి పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని భయంగా ఉందే అని పారిజాతం అంటుంది.
ఎక్కడో పురుడు పోసుకుంటుంది

నాకు ఊరికే కల కాదు. వచ్చిందంటే దానికి సంబంధించి ఎక్కడో పురుడు పోసుకుంటుంది. నీ గురించి ఎవరో లాగుతున్నారే. పొద్దున వచ్చే కల నిజం అవుతుందంటే అని పారిజాతం అంటుంది. నేను అరెస్ట్ అయితే నిన్ను కూడా తీసుకెళ్తానని షాక్ ఇస్తుంది జ్యోత్స్న. ఇది ఎన్ని ఘోరాలు చేసిందో. దీని తప్పులు శ్రీధర్ కనిపెట్టకుండా చూడాలని పారిజాతం అనుకుంటుంది.
మరోవైపు సుమిత్రను దశరథ్ ఎంత లేపిన లేవదు. ఒళ్లు చల్లగా ఉందేంటీ అని భయపడతాడు. వెళ్లి శివ నారాయణకు కంగారుగా చెబుతాడు. ఆ మాటలు విన్న జ్యోత్స్న పారిజాతం దగ్గరకు వెళ్లి మమ్మీ చచ్చిపోయింది అని కంగారుగా చెబుతుంది. సుమిత్ర చచ్చిపోవడం ఏంటే షాక్ అవుతుంది పారిజాతం. పారిజాతం వెళ్లి సుమిత్రను లేపుతుంది.
కానీ, లేవదు. నిజంగానే చనిపోయిందని అనుకుంటుంది పారిజాతం. కుదిపేసి లేపు అని శివ నారాయణ అంటాడు. దాంతో బాగా కుదిపేస్తూ సుమిత్ర అంటూ పారిజాతం అరుస్తుంది. అప్పుడు సుమిత్ర లేస్తుంది. హమ్మయ్య సుమిత్ర చనిపోలేదని పారిజాతం అనుకుంటుంది. ఏమైందని సుమిత్ర అడిగితే.. మత్తుగా పడుకున్నావ్. లేపితే లేవలేదు. అందుకే పిన్నిని పిలిచానని దశరథ్ చెబుతాడు.
నిద్ర మాత్రలు వేసుకున్న
నిద్ర పట్టడం లేదని స్లీపింగ్ పిల్స్ వేసుకున్నానని సుమిత్ర చెబుతుంది. నిద్ర పట్టనంత ఆలోచనలు ఏమున్నాయని పారు అంటే.. జ్యోత్స్న పెళ్లి. జ్యోత్స్నకు సంబంధాలు కలవట్లేదు. జాతకాలు కుదరట్లేదు అని శివ నారాయణ అంటాడు. ఇదే కారణం అయితే సుమిత్ర బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని పారిజాతం అంటుంది. ఎందుకు అని శివ నారాయణ అడుగుతాడు.
{{/usCountry}}నిద్ర పట్టడం లేదని స్లీపింగ్ పిల్స్ వేసుకున్నానని సుమిత్ర చెబుతుంది. నిద్ర పట్టనంత ఆలోచనలు ఏమున్నాయని పారు అంటే.. జ్యోత్స్న పెళ్లి. జ్యోత్స్నకు సంబంధాలు కలవట్లేదు. జాతకాలు కుదరట్లేదు అని శివ నారాయణ అంటాడు. ఇదే కారణం అయితే సుమిత్ర బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని పారిజాతం అంటుంది. ఎందుకు అని శివ నారాయణ అడుగుతాడు.
{{/usCountry}}ఎందుకంటే జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదు కాబట్టి అని నోరు జారుతుంది పారిజాతం. దాంతో అంతా షాక్ అవుతారు. ఏంటీ జ్యోత్స్న నా కూతురు కాదా అని దశరథ్, సుమిత్ర నిలదీస్తారు. ఇలా నోరు జారిందేంటీ. మమ్మీ కాదు నేను చచ్చాను అని జ్యో అనుకుంటుంది. అంటే రేపు పెళ్లి అయిపోతే జ్యోత్స్న నీ కూతురు కాదు కదా. ఎవరింటికో కోడలు అవుతుందిగా అని పారిజాతం కవర్ చేస్తుంది.
దాంతో పారిజాతంపై శివ నారాయణ ఫైర్ అవుతాడు. దాంతో తనకు స్వీట్ తినిపించిన ఫొటో చూపిస్తుంది. టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఇంకోసారి నిద్ర మాత్రలు వేసుకోకని శివ నారాయణ చెప్పి వెళ్లిపోతాడు. జ్యోత్స్నకు పారిజాతం భయపడుతుంది. దశరథ చేతులు పట్టుకుని మీరు భయపడ్డారా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సుమిత్ర. నన్ను వదిలి నిన్ను ఎక్కడికి పోనిస్తాను అని దశరథ్ అంటాడు.
శ్రీధర్ ఇంటికి కార్తీక్
మరోవైపు కార్తీక్ వాళ్ల కోసం శ్రీధర్ వాళ్లు ఎదురుచూచ్తారు. ఇంతలో కార్తీక్ వాళ్లు వస్తే కాంచన గురించి శ్రీధర్ అడుగుతాడు. రాలేదని చెబుతారు. స్వప్న పిల్లల గురించి దీప అడుగుతుంది. ముందు నువ్వు కొడుకును కంటే కూతురుని కని నీ ఇంటికి కోడలిగా పంపిస్తానని స్వప్న అంటుంది. అంతా సరదాగా మాట్లాడుకుంటారు. అంతా టిఫిన్ తింటుంటారు. కావేరి వడ్డిస్తుంది.
కాశీ ఏడని కార్తీక్ అడుగుతాడు. శ్రీధర్, స్వప్న వేరు వేరుగా సమాధానాలు చెబుతారు. వెళ్లి పిలవమని కార్తీక్ అడిగితే వర్క్ చేసుకుంటాడని స్వప్న చెబుతుంది. కార్తీక్‌కు కాల్ చేసిన కాంచన త్వరగా తినేసి బయలుదేరండని చెబుతుంది. ఆ ఫోన్ లాక్కుని శ్రీధర్ మాట్లాడుతాడు. అంతా ఉన్న నువ్వు లేవని వెలితి ఉందని శ్రీధర్ అంటాడు.
ఇంతలో కాంచనకు శ్రీధర్ గారు పంపించారని ఒకతను టిఫిన్ ఇస్తాడు. నువ్వు రావని తెలిసే టిఫిన్స్ అన్ని క్యారేజ్ కట్టి పంపించాను అని శ్రీధర్ చెబుతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.