కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దాసును కిడ్నాప్ చేసింది జ్యోత్స్ననే అని పారిజాతంకు తెలిసిపోతుంది. నీ పని చెప్తానే సుమిత్ర కూతురా అని పారు అనుకుంటుంది. మరోవైపు దీప ఆలోచిస్తుంటే రెండో బిడ్డను పెంచేందుకు పెద్దగా ఆలోచించకు, కార్తీక్ బాబు ఇద్దరు బిడ్డలను బాగా చూసుకుంటాడని దీప మేనత్త అంటుంది.
ఏ డ్రెస్ వేయాలి

మరోవైపు శౌర్య డ్రాయింగ్ వేసి చెల్లి పుడుతుందా, తమ్ముడు పుడతాడా అని అడుగుతుంది. ఏ డ్రెస్ వేయాలని అంటుంది. దీప కడుపు దగ్గరికి వెళ్లి దీప మాట్లాడటంతో అంతా కార్తీక్, దీప ఎమోషనల్ అవుతారు. గుడికి వెళ్లడం గురించి కాంచన చెబితే.. దీప వద్దంటుంది. తాను రానంటుంది. కాంచన కారణం అడిగితే చెప్పకుండా వెళ్లిపోతుంది దీప.
మీ ఇద్దరితో మాట్లాడాలిరా అని కాంచన అంటుంది. మరోవైపు దాసు ఎక్కడికి వెళ్లాడు అని జ్యోత్స్న కంగారుపడుతుంది. నా కొడుకునే కిడ్నాప్ చేస్తావా. నీకు ఝలక్ ఇస్తానే సుమిత్ర కూతురా అని పారిజాతం అనుకుని కంగారుకంగారుగా వస్తుంది. నా కొడుకును కిడ్నాప్ చేశారు అని పారు చెప్పి జ్యోత్స్న మొహంలో కంగారు చూస్తుంది.
దాసును కార్తీక్, దీప కిడ్నాప్ చేశారని, నేను చూశానని, ఓ ఇంట్లో దాచిపెట్టారని, ఇద్దరు రౌడీలు కాపలాగా ఉన్నారని, కార్తీక్ గాడిపై డౌట్ వచ్చి వాడిని ఫాలో అయ్యాను, అక్కడ దాసు ఉన్నాడని పారిజాతం అంటుంది. దాసును బావ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు అని జ్యోత్స్న అడుగుతుంది. మరి ఇంకెవరు చేశారు అని జ్యోత్స్నను లాగిపెట్టి కొడుతుంది పారిజాతం.
నీకు మతి పోయింది
కొడుకు కనిపించట్లేదని నీకు మతి పోయిందని జ్యోత్స్న అంటుంది. దాంతో పారిజాతం ఏడుస్తూ దాసు గురించి తాను అడిగింది, జ్యోత్స్న అబద్ధాలు చెప్పింది అంతా చెబుతుంది. జ్యోత్స్న కిడ్నాప్ చేసింది తాను చూశానని చెబుతూ మరొకటి కొడుతుంది పారిజాతం. మరోవైపు ఇంట్లోంచి వెళ్లిపోతానని కాంచన అంటుంది.
{{/usCountry}}కొడుకు కనిపించట్లేదని నీకు మతి పోయిందని జ్యోత్స్న అంటుంది. దాంతో పారిజాతం ఏడుస్తూ దాసు గురించి తాను అడిగింది, జ్యోత్స్న అబద్ధాలు చెప్పింది అంతా చెబుతుంది. జ్యోత్స్న కిడ్నాప్ చేసింది తాను చూశానని చెబుతూ మరొకటి కొడుతుంది పారిజాతం. మరోవైపు ఇంట్లోంచి వెళ్లిపోతానని కాంచన అంటుంది.
{{/usCountry}}మొన్నటివరకు దీప బాధపడుతుందంటే అత్త కోసం అన్నావ్. ఇప్పుడు ఎందుకు బాధపడుతుంది. దీప ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు పూజకు రానంటుంది, దాచుకోలేని బాధ ఏముంది అని కార్తీక్‌ను నిలదీస్తుంది కాంచన. దీప ప్రవర్తన భయమేస్తుందని కాంచన అంటుంది. నాకు ఏ బాధ లేదని మళ్లీ ఏడుస్తుంది దీప.
నీ బిడ్డకు ఏం కాదని మాటిచ్చావ్. ఆ మాటకు కట్టుబడి ఉంటానని మాటివ్వు అని దీప చేయి పట్టుకుని అడుగుతుంది కాంచన. దానికి దీప ఏడుస్తుంటుంది. దాంతో అది డైవర్ట్ చేసేందుకు కాంచన చేయి పట్టుకుని నువ్వు అన్ని మర్చిపోయి నాన్నతో కలిసి ఉంటానని మాటివ్వు అమ్మ. నువ్వు మాటిస్తే దీప నీకు మాటిచ్చినట్లే అని అంటాడు కార్తీక్. దాంతో కాంచన తెగ షాక్ అయిపోతుంది.
జ్యోత్స్నను వాయించిన పారిజాతం
ఏం చెప్పలేక ఒకేసారి దీప, కార్తీక్ చేయి వదిలేస్తుంది. మరోవైపు దాసును ఏం చేశావో చెప్పు అని జ్యోత్స్నను ఎడాపెడా వాయిస్తుంది పారిజాతం. కాసేపు నువ్వు నా మనవరాలివి అనుకున్నా నా కొడుకును కిడ్నాప్ చేసినందుకు నేను వదలను అని తిడుతుంది పారిజాతం. నేను దాసును కిడ్నాప్ చేయడానికి కారణం ఉంది.
నాన్న అసలు వారసురాలు ఎవరో చెప్పడానికి వచ్చాడు. అది తెలిస్తే తాత నిన్ను షూట్ చేస్తాడు. దాసు నిజం చెప్పి ఉంటే నాకే కదా నీకు కూడా డేంజరే. అందుకే ఇద్దరి కోసం కిడ్నాప్ చేయించాను. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడో తెలియదు. వెళ్తే బావ దగ్గరికి వెళ్తాడు. దాంతో పోలీసులతో బావ వస్తాడు. అప్పుడు మనం జైలుకు వెళ్తామని జ్యోత్స్న అంటుంది.
దాసు నిజం చెప్పిన ఏమైనా నువ్వే సొంత కూతురువని తెలుస్తుంది. ఎటు చూసిన నష్టం జరిగేది నాకే. నువ్వు నిజమైన వారసురాలివి కాకుంటే రెండోసారి కూడా రిపోర్ట్స్ మ్యాచ్ కావు. అలా అయ్యాయంటే డాక్టర్‌తో నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుండాలి. అలా జరగలేదు అంటే ఆ రిపోర్ట్స్ నిజమే. నువ్వు ఏం చేయకుండా డాక్టర్ మార్చి ఎందుకు చెబుతుంది అని పారిజాతం అంటుంది.
బిడ్డపై ఆశలు వదులుకోమని చెప్పు
గ్రానీ చెప్పింది నిజమే. నేను ఎవరో తెలుసుకోవాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. కాంచనతో కార్తీక్ చేసిన దాని గురించి దీప అడుగుతుంది. కాంచన అడిగింది డైవర్ట్ చేయడానికే అలా చేశానని కార్తీక్ చెబుతాడు. అత్తయ్య అపార్థం చేసుకుంటే అని దీప అంటే.. చేసుకోను. అపార్థం నుంచి అర్థం పుడుతుందని కార్తీక్ అంటాడు.
మరి నేను మాట తప్పిన మనిషిగా జీవితాంతం ఉండాల్సిందేనా. నేను మోసం చేసినట్లేగా. అలా జరిగితే అత్త ఇంట్లోంచి వెళ్లిపోతుంది. అప్పుడు నా తరఫున కూడా అత్తతో మాట్లాడాలి. పుట్టబోయే బిడ్డపై ఆశలు చంపుకోమని చెప్పాలని దీప అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.