...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న, పారిజాతం గుండెల్లో దడ పుట్టించిన దశరథ- కూతురుకు తల్లితో దిష్టి తీయించిన తండ్రి

కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 23వ ఎపిసోడ్‌లో కార్తీక్, దీపతో దశరథ ఇంటికి వస్తాడు. కారు డోర్ తీసి మరి దీపకు స్వాగతం పలుకుతాడు దశరథ్. దీపకు తల్లి సుమిత్రతో దిష్టి తీయిస్తాడు. దశరథ్ చేసే పనులు, అనే మాటలను చూసి పారిజాతం, జ్యోత్స్న గుండెల్లో దడ పుడుతుంది. దశరథ్ చాలా సంతోషంగా ఉన్నట్లు అందరికి చెబుతాడు.

Published on: Feb 23, 2026, 07:24:46 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న, పారు బయటకు వెళ్లాలని ట్రై చేస్తుంటే శివ నారాయణ ఫోన్ మాట్లాడుతూ దారిలో ఉంటాడు. దాంతో ఆగిపోతారు పారు, జ్యోత్స్న. తాత ఉండగా బయటకు వెళ్లలేమని జ్యో అంటే.. నీ అనుమానం కరెక్ట్ కాకపోవచ్చే సుమిత్ర కూతురా అని పారిజాతం అంటుంది.

జ్యో, పారు గుండెల్లో దడ

కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 23వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 23వ తేది ఎపిసోడ్

ఈ గేమ్ ఫినిషింగ్‌లో నీకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటది చూడు అని జ్యోత్స్న అంటుంది. అంతలోనే దశరథ్, దీప, కార్తీక్ కారులో వస్తారు. దీపకు కారు డోర్ తీసి మరి నాకు నిజం తెలిసాకా నా బిడ్డ నా ఇంట్లో పెట్టబోయే తొలి అడుగు అంటాడు దశరథ్. దీప అడుగు పెట్టడంతో జ్యోత్స్న, పారిజాతం గుండెల్లో దడ మొదలవుతుంది.

తాత వెళ్లిపోయాడని బయటకు జ్యోత్స్న బయటకు వెళ్తుంటే దశరథ్ ఎదురవుతాడు. కార్తీక్ చెప్పింది మొత్తం దశరథ్ గుర్తు చేసుకుంటాడు. నిజం తెలిసిన మనిషిలా నన్ను దోషిలా చూస్తున్నారేంటని జ్యో, దశరథ్ ఏంటీ నన్ను కొట్టేలా చూస్తున్నాడని పారిజాతం అనుకుంటుంది. పిన్ని ఎర్రనీళ్లు తీసుకురా.. నా కూతురుకి అని దశరథ్ అంటే అంతా షాక్ అవుతారు.

నేను చేసేది మాత్రమే చూడండి

పారిజాతం వెళ్లిపోతుంది. ఇంట్లో అందరిని పిలుస్తాడు దశరథ్. కార్తీక్ ఆపితే.. నేను చేసేది మాత్రమే చూడండి అని దశరథ్ అంటాడు. దాసు నిజం చెప్పి ఉంటాడని జ్యో అనుమానిస్తుంది. నా కూతురు, అల్లుడికి దిష్టి తీయండి అని పారుతూ దశరథ్ అంటాడు. ఏ చేతులతో పంపించావో అదే చేతులతో ఆహ్వానించేలా చేస్తాను అని దశరథ్ అనుకుంటాడు.

హో అదా అని రిలాక్స్ అవుతుంది పారిజాతం. కార్తీక్, దీపకు గుడిలో అర్చన చేయించానని, గుడిలో దాసు కనిపించాడని దశరథ్ చెబుతాడు. దాంతో పారు, జ్యో ఖంగుతింటారు. డాడీకి దీపే సొంత కూతురు అని దాసు చెప్పేసి ఉంటాడు. ఇకనుంచి వెళ్లిపోవాలని జ్యో అనుకుంటుంది. దాసు ఏం చెప్పి ఉంటాడో అని భయంగా ఉందని పారు అంటుంది.

పారిజాతంను స్వీట్స్ తీసుకురమ్మంటాడు దశరథ్. నా కూతురుకు స్వీట్ పెట్టమని దశరథ్ అంటే.. పారిజాతం కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఎవరికి పెట్టాలో పేరు చెప్పమంటుంది పారు. దాంతో నా కన్నకూతురుకే స్వీట్ పెట్టాలని దీపకు స్వీట్ పెట్టబోయి మళ్లీ జ్యోత్స్నకు పెడతాడు దశరథ్.

సుఖంగా ఉండాలంటూ

డాడీకి నిజం తెలిసిందా లేదా, రెండింట్లా ఉందని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న నువ్వు ఎప్పుడు కలకాలం సుఖంగా ఉండాలని దశరథ్ అంటాడు. దీపకు నరదిష్టి ఎక్కువగా తగులుతుందని పంతులు చెప్పాడని, అందుకే దిష్టి తీయించానని దశరథ్ అంటాడు. దాసు గురించి పారు అడిగితే.. ఇంకో పది నిమిషాల్లో వస్తాడని దశరథ్ చెబుతాడు.

కార్తీక్, దీపను వెళ్లమన్న దశరథ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అందరితో చెబుతాడు దశరథ్. వంటింట్లో కార్తీక్‌ను దీప హగ్ చేసుకుని తండ్రికి నిజం తెలిసిందని భర్త నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది దీప. గుడిలో దీపాల వెలుగుల్లో నాన్న తండ్రిలా కాదు దేవుడిలా కనిపించాడని దీప చెబుతుంది.

ఇంకో దారి ఉందా

నాన్న చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ, నాన్నకు మన నిజం తెలిస్తే.. ఒప్పుకుంటాడా అని దీప అంటుంది. కానీ, ఇంకో దారి ఉందా అని కార్తీక్ అడుగుతాడు. అక్కడితో కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe