కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దేవుడికి మొక్కుకుని తాళి కళ్లకు అద్దుకుంటుంది కాంచన. అప్పుడే శ్రీధర్ వస్తాడు. నువ్వు తాళి కళ్లకు అద్దుకుంటున్న మాత్రానా నన్ను ఇష్టపడుతున్నావని అనుకోను. ఆడదానికి ఐదో తనం అలంకరణ కాదు. జీవితంలో ఒక భాగం అని అంటాడు శ్రీధర్.
చమురు ఉన్నంతకాలమే

నవ్వే కాలం అయిపోయింది. ఇప్పుడు కన్నీటి కాలం నడుస్తోంది అని శ్రీధర్ అంటే.. చమురు ఉన్నంత కాలమే దీపం ఉంటుంది. రెండు కదలవు కానీ వెలిగి ఇస్తుంది అని కాంచన అంటుంటే దీపం ఆరిపోతుంది. శ్రీధర్ మళ్లీ దీపం వెలిగిస్తాడు. నేను వచ్చింది వెలుగు నింపడానికే. మీ నాన్న ఇంటికి వెళ్దాం పదా. మీ అన్నయ్య నన్ను తీసుకురమ్మన్నాడు. నువ్వు రాకుంటే బాధపడే వారు చాలా మంది ఉన్నారు అని శ్రీధర్ అంటాడు.
మరోవైపు కిచెన్‌లో దీపతో కార్తీక్‌కు తాటిబెళ్లం పరమాన్నం అంటే చాలా ఇష్టం అని సుమిత్ర చెబుతుంది. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను చనిపోయేటప్పుడు నా కూతురు ఉండాలి అని సుమిత్ర అన్నది గుర్తు చేసుకుని ఈ ఇంట్లో మీతోపాటే కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నా అని దీప అంటుంది. నన్ను చూసుకోడానికి నా కూతురు ఉందని సుమిత్ర అంటుంది.
ఆప్యాయంగా సుమిత్ర, కాంచన
ఇంతలో శౌర్య వచ్చి కాంచన, శ్రీధర్ వచ్చారని చెబుతుంది. దాంతో ఇద్దరు వెళ్తారు. సుమిత్ర సంతోషంగా పలకరిస్తుంది. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. అమ్మ వారి రక్ష తీసుకొచ్చానని కడుతుంది కాంచన. కానీ, అందరికంటే పెద్ద బాధ్యత నీదేనే అని జ్యోత్స్నతో అంటుంది కాంచన. అమ్మవారి రక్ష కట్టిన కాంచన నువ్వు దీర్ఘాయిశ్సుతో దీర్ఘ సుమంగళిగా ఉంటావని కాంచన అంటుంది.
జ్యోత్స్న రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటారు. కచ్చితంగా మ్యాచ్ అవుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రిపేర్ అవండని చెబుతారు అని శ్రీధర్ అంటాడు. ఇంతలో జ్యోత్స్నకు కాల్ రావడంతో పక్కకు వెళ్తుంది. రౌడీలు కాల్ చేసి మీ నాన్నగారు తప్పించుకున్నారని చెబుతారు. ఇంతలో గేట్ దగ్గరికి దాసు వస్తాడు. అది జ్యోత్స్న చూసి షాక్ అవుతుంది.
ఎలాగైనా తప్పించాలి
{{/usCountry}}జ్యోత్స్న రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటారు. కచ్చితంగా మ్యాచ్ అవుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రిపేర్ అవండని చెబుతారు అని శ్రీధర్ అంటాడు. ఇంతలో జ్యోత్స్నకు కాల్ రావడంతో పక్కకు వెళ్తుంది. రౌడీలు కాల్ చేసి మీ నాన్నగారు తప్పించుకున్నారని చెబుతారు. ఇంతలో గేట్ దగ్గరికి దాసు వస్తాడు. అది జ్యోత్స్న చూసి షాక్ అవుతుంది.
ఎలాగైనా తప్పించాలి
{{/usCountry}}మా ఇంటికే వచ్చాడని జ్యోత్స్న చెబితే.. మీ ఇంటికే వస్తున్నామని రౌడీలు అంటారు. నువ్వు నిజం చెప్పడానికి వచ్చావని తెలుసు. ఎలాగైనా తప్పించాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. దాసు వచ్చి కింద పడిపోతాడు. అది పారిజాతం చూసి దాసు అంటుంది. పక్కన టీలు పట్టుకున్న దీపకు తాకుతుంది. దాసు వచ్చాడురా అని బయటకు వచ్చేసరికి దాసు ఉండడు.
పారు వచ్చేసరికే దాసును జ్యోత్స్న రౌడీలతో తప్పిస్తుంది. దాసు వచ్చాడురా. నా మీద ఒట్టు. వచ్చి పడిపోయాడురా అని పారిజాతం అంటుంది. అంతా వెతుకుతారు. పైన ఉన్న జ్యోత్స్న వైపు కార్తీక్ చూడటంతో చూపు పక్కకు తిప్పుకుంటుంది. మావయ్య కనిపించాడని పైకి వెళ్తాడు కార్తీక్. దాసు లేడని దశరథ్ అంటాడు. మరి కార్తీక్ పైకి ఎందుకు వెళ్తున్నాడని శివ నారాయణ వస్తారు. జ్యోత్స్నను అడుగుతాడు.
సీసీ కెమెరాతో నిజం బయటకు
నాకు కనిపించలేదు నేను చూడలేదు అని జ్యో అంటుంది. దాసు వచ్చాడే అని పారు అంటే నేను నమ్మను అని జ్యోత్స్న అంటుంది. నేను నమ్ముతాను పారు. దాసు మావ రావడం నువ్వేకాదు ఇంకొకరు కూడా చూశారు. ఏం పెద్ద మేడమ్ మీరు చూడలేదుగా అని కార్తీక్ అంటే.. లేదని జ్యోత్స్న అంటుంది.
కానీ, నిజం తెలుస్తుంది. మనింట్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా. అవి చూపిస్తాయి దాసు మావయ్య వచ్చాడా లేదా అనేది అని కార్తీక్ అంటే.. మనవడా నీ బుర్ర సూపర్రా అని పారిజాతం అంటుంది. సీసీ కెమెరాలో దాసును రౌడీలు తీసుకెళ్లింది రికార్డ్ అయి ఉంటుంది. ఛ నిజం తెలిసిపోతుంది అని జ్యోత్స్న భయపడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.