కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న అసలు సుమిత్ర కూతురే కాదు-ఆవేశంతో ఊగిపోయిన శివ నారాయణ-భయంతో వణికిపోయిన జ్యో
కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ లో కార్తీక్ చిన్నప్పటి ఫొటో గురించి చెప్తూ సుమిత్ర అందరినీ నవ్విస్తుంది. నిజం ఎక్కడ బయటపడుతుందోనని జ్యోత్స్న భయపడుతుంది. జ్యో అసలు తన మనవరాలు కాదని, సుమిత్ర కూతురు కాదని శివ నారాయణ ఫైర్ అవుతాడు.
కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ లో కార్తీక్ చిన్నప్పటి అమ్మాయి గెటప్ ఫొటో గురించి చెప్పమని దీప అడుగుతుంది. అప్పుడు సుమిత్ర నవ్వుతూ కాంచన వదినకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కార్తీక్ ను ఆడపిల్లగా రెడీ చేసేది. వీడికి జుట్టు పెంచి జడలు వేసేది. పూలు పెట్టేది. ఒక పండగ రోజు వీడిని ఆడపిల్లలా రెడీ చేశారు. అయితే ఆట మధ్యలో ఒక అబ్బాయి వీడిని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడని సుమిత్ర చెప్తే అందరూ నవ్వేశారు.

కార్తీక్ కు థ్యాంక్స్
ఆ తర్వాత బావ గుండు చేయించుకున్నాడని జ్యోత్స్న చెప్తుంది. గుండుతో ఉన్న ఫొటో ఉందా అని దీప అడిగితే, రా ఉంది చూపిస్తానని సుమిత్ర చెప్తుంది. సుమిత్ర నవ్వుతూ దీపతో మాట్లాడుతుంది. ఎంత బాధను లోపల పెట్టుకుని పైకి నవ్వుతున్నావో నాకు తెలుసురా. నీ వల్లే సుమిత్ర నవ్వడం చూస్తున్నానని కార్తీక్ కు థ్యాంక్స్ చెప్తాడు దశరథ.
జ్యో భయం
నాకు భయమే తెలుస్తుంది. రిపోర్ట్స్ అంటే కాగితాలు కాదు నిజాలు అని జ్యోత్స్న భయపడుతుంది. నేను చేసిన పాపాలన్నీ కట్టకట్టుకుని ఒకేసారి ఇంటికి వచ్చేలా ఉన్నాయి. ముందు దాసుగాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. ముందు వారసురాలిని తీసుకురమ్మనాలి. నీ మీదే నాకు అనుమానంగా ఉంది. నా దగ్గర నటిస్తున్నావని అనిపిస్తోంది. నా కొడుకు గురించి నీకు తెలియదా అని పారిజాతం అడుగుతుంది. నీకు అనుమానం వచ్చేలా బావ తాయిత్తు గురించి చెప్పాడని జ్యో కవర్ చేస్తుంది.
బుల్లెట్ లాంటిది
నిన్ను, నీ కొడుకును, నన్ను ఎవరినీ వదిలిపెట్టరు. తాత కోపం గన్ లో బుల్లెట్ లాంటిది. అది తగిలితే ఇంట్లో నుంచైనా పోతాం ఈ భూమ్మీద నుంచైనా పోతామని జ్యో చెప్తుంది. ఇది నేను కష్టపడి కట్టుకున్న కలల కోట. దీన్ని అంత తేలిగ్గా కూలిపోనివ్వను. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదని పారు భయపడుతుంది. రిపోర్ట్స్ ను అడ్డుపెట్టుకుని బావ ఏం చేస్తాడోనని భయంగా ఉందని జ్యో అనుకుంటుంది.
నిజం చెప్పేద్దామని
రెంట్ డబ్బులు ఎవరు ఇచ్చారు? అప్పు చేశావా? అని కార్తీక్ ను దీప అడుగుతుంది. ఈ రోజు అంటే నవ్వించడానికి ఫొటో పంపించావు. మరి నిజం తెలిసినప్పుడు బాధ పడకుండా ఏం చేస్తావు? సొంత కూతురు ఎక్కడుందని అడిగితే ఏం చెప్తావని దీప ప్రశ్నిస్తుంది. నువ్వు అని చెప్తానని కార్తీక్ అంటాడు. మరి ఇప్పుడే ముందు తాతకు, తర్వాత నాన్నకు, అమ్మకు చెప్పాలని దీప చెప్తుంది. అత్తకు జ్యోత్స్న శాంపిల్ మ్యాచ్ అవదని డాక్టర్ చెప్తాడని కార్తీక్ అంటుండగా కాంచన వచ్చి ఏంటీ అని అడుగుతుంది.
నా మనవరాలు కాదు
సుమిత్ర టాబ్లెట్ వేసుకోలేదు. భోజనం కూడా చేయలేదు. ఇప్పుడు తినాలనిపించడం లేదని చెప్తుందని తండ్రికి చెప్తాడు దశరథ. అప్పుడు జ్యోత్స్నను పిలుస్తాడు శివ నారాయణ. జ్యోత్స్న నా మనవరాలు కాదు. ఆ మాటకొస్తే సుమిత్ర కూతురు కూడా కానే కాదు. నువ్వు తాత అని పిలవాల్సిన అవసరం లేదని శివ నారాయణ ఫైర్ అవుతాడు. నీకు జ్వరం వస్తే మీ అమ్మ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది, మరి నువ్వు చూసుకోవాలి కదా అని తాత అరుస్తాడు.
నీ సాయం కావాలని
పెద్దదానివి నీకు బుద్ధి లేదని పారును అంటాడు శివ నారాయణ. జ్యోత్స్నను పిలిచింది తల్లి బాధ్యత తీసుకోమ్మని. అమ్మకు దగ్గరుండి భోజనం పెట్టు, టాబ్లెట్స్ ఇవ్వమని చెప్తాడు. జ్యోత్స్నను ఇబ్బంది పెట్టొద్దని చెప్పిన సుమిత్ర వెళ్లి పడుకుంటానంటుంది. చూశావా మీ అమ్మను నువ్వు ఇబ్బంది పడతావని బాధ పడుతుంది. అంత ఇష్టం నువ్వంటే. అర్థం చేసుకో అమ్మా. ఈ గండం గట్టెక్కేవరకు నీ తోడు, సాయం అవసరమని దశరథ చెప్తాడు.
దశరథ సుమిత్రను నువ్వే చూసుకో. లేదా దీపను ఉండమందామని శివ నారాయణ అంటాడు. దీప వద్దు కానీ చెల్లిని రమ్మను నాన్న అని దశరథ చెప్తాడు. మరోవైపు జ్యోత్స్న శాంపిల్ మ్యాచ్ కాదని నువ్వెలా చెప్తావ్? కన్న కూతురు కాకపోతేనే మ్యాచ్ కాదని డాక్టర్ చెప్పింది కదా. నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదా? మరి అసలు వారసురాలు ఎవరంటారు అని కార్తీక్ ను కాంచన అడుగుతుంది.
కాంచనకు ఫోన్
హాస్పిటల్ కు వచ్చినప్పుడు జ్యోత్స్న, పారు భయపడ్డారు. శాంపిల్ మ్యాచ్ అవక భయపడుతున్నారేమోనని చెప్తున్నా నువ్వే వచ్చావని కార్తీక్ కవర్ చేస్తాడు. శివ నారాయణ అప్పుడే కాల్ చేసి కాంచనతో మాట్లాడతాడు. నాన్న ఆపరేషన్ జరిగితే వదినకు ఏం కాదులే అని కాంచన అంటుంది.
నువ్వు ఇక్కడ రెండు రోజులు ఉండేలా రా అమ్మా. సుమిత్రకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు వస్తే సుమిత్ర అన్నీ మర్చిపోతుందని శివ నారాయణ అంటాడు. కార్తీక్ ఫోన్ తీసుకుని అమ్మ వస్తుందంటే, మీరందరూ రావాలని దశరథ అడుగుతాడు. నేను చెప్పానా వస్తానని, వదినను చూస్తుంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు. నేను రానని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












