Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో తన షర్ట్ ఉతక్కపోతే జ్యోత్స్న రూ. లక్ష 15 వేల కాస్ట్‌లీ చీరను కాల్చేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తాడు సూరజ్. జ్యోత్స్న ఉతకనంటుంది. ఉతక్కుంటే పని మనిషి బుజ్జిని క్యారేజ్‌తో రూమ్‌కి ఎవరు తీసుకొచ్చారో, లాక్ ఎవరు వేశారో చెబుతానని సూరజ్ బెదిరిస్తాడు.
నిద్ర మత్తుతో హౌమ్ వర్క్

నీ చిల్లర బెదిరింపులకు ఈ జ్యోత్స్న భయపడదని జ్యో అంటుంది. మరోవైపు దీప ఆఫీస్ వర్క్ చూసుకుంటుంటే శౌర్య నిద్ర మత్తుతో హోమ్ వర్క్ చేస్తుంటుంది. కాంచ న వచ్చి నిద్రమత్తు అంటూ సెటైర్లు వేస్తుంది. నేను ఇక చదవుకోను. జాబ్ చేస్తానని శౌర్య అంటుంది. నాలుగో తరగతికే నీకు ఎవరే జాబ్ ఇచ్చేదని కాంచన అంటుంది.
మీ నాన్న ఇస్తాడు. ముద్దుల తాతే ఇస్తాడు. పదో తరగతి చదివిన మా అమ్మకు సీఈఓ పోస్ట్ ఇచ్చినప్పుడు నాలుగో తరగతి చదివిన నాకు మేనేజర్ పోస్ట్ అయిన ఇవ్వడా అని శౌర్య దీపను అవమానంగా అంటుంది. మీ అమ్మ మీదే సెటైర్లు వేస్తున్నావా అని కార్తీక్ అంటాడు. సెటైర్లు కాదు నేను ఆఫీస్‌లో చూశాను కదా. ఎంబీఏ వరకు చదివి జాబ్‌లో జాయిన్ అయ్యేకన్నా ఇప్పుడే జాబ్ చేస్తే అయిపోతుందిగా అని శౌర్య అంటుంది.
దీన్ని ట్యూషన్‌లో వేద్దామని దీప అంటుంది. మా మిస్‌కు మా అమ్మ సీఈఓ అని చెబితే.. ఎంతవరకు చదివిందని అడిగింది. ఫిఫ్త్ క్లాస్ అని చెబితే మా మిస్ నవ్వింది. ఐదో తరగతికి సీఈఓ అవుతారా. కరెక్టుగా తెలుసుకో అన్నదని శౌర్య అంటుంది. తర్వాత ఈ చదువులు నా వల్ల కాదని వెళ్లి పడుకుంటుంది. దీపను కూడా వర్క్ ఆపేసి వెళ్లి పడకోమంటుంది అత్త కాంచన.
సూరజ్ షర్ట్ ఉతికిన జ్యో
మరోవైపు సూరజ్ షర్ట్‌ను జ్యోత్స్న ఉతుకుతుంది. సూరజ్, పారిజాతం చూస్తూ చెగోడీలు తింటూ టైమ్ పాస్ చేస్తారు. మీకు తెలిసే పప్పు పోసిందని, జ్యోత్స్న కన్నుకొట్టాకే పప్పు పోసిందని సూరజ్ అంటాడు. పారు అవాక్కవుతుంది. ఒసేయ్ సారీ చెబితే అయిపోయేదానికి చాకిరేవు దాకా తెచ్చుకున్నావ్ కదే అని పారు అంటుంది.
{{/usCountry}}మరోవైపు సూరజ్ షర్ట్‌ను జ్యోత్స్న ఉతుకుతుంది. సూరజ్, పారిజాతం చూస్తూ చెగోడీలు తింటూ టైమ్ పాస్ చేస్తారు. మీకు తెలిసే పప్పు పోసిందని, జ్యోత్స్న కన్నుకొట్టాకే పప్పు పోసిందని సూరజ్ అంటాడు. పారు అవాక్కవుతుంది. ఒసేయ్ సారీ చెబితే అయిపోయేదానికి చాకిరేవు దాకా తెచ్చుకున్నావ్ కదే అని పారు అంటుంది.
{{/usCountry}}బండకేసి బాదు అను పారిజాతం అంటుంది. జ్యో అలాగే చేస్తుంది. జ్యో బట్టలు ఉతికే సౌండ్ మంచి మ్యూజిక్‌లా ఉందంటాడు సూరజ్. తర్వాత షర్ట్ నీళ్లలోకి తీసి ఇదిగే నీ షర్ట్ వెళ్లి దండం మీద ఆరేసుకో అని, సూరజ్ మెడలో ఉన్న తన చీరను లాక్కుంటుంది జ్యోత్స్న. సూరజ్ థ్యాంక్స్ చెబుతాడు. ఈ మూమెంట్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుందని జ్యో వెళ్లిపోతుంది.
నీకు కూడా అని సూరజ్ అంటాడు. ఈ సూరజ్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని షర్ట్ చూసుకుంటాడు. తీరా చూస్తే సూరజ్ షర్ట్ చిరిగిపోయి ఉంటుంది. షర్ట్ బొక్క లోనుంచి జ్యోని చూస్తాడు సూరజ్. నాతో ఉతికిస్తే ఇలాగే ఉంటుంది. బాగా గుర్తుంచుకో అని జ్యో వెళ్లిపోతుంది. నీ పొగరే నీ ఐడెంటీటే. నీ మెడలో మూడు ముళ్లు వేసేవరకు వదిలిపెట్టను అని సూరజ్ అనుకుంటాడు.
శ్రీధర్ వీడియో మేసెజ్
మరోవైపు రోజు ఎంత బిజీగా ఉన్నా కనీసం కొన్ని గంటలైన భార్యభర్తలు తమకోసం సమయం కేటాయించుకోవాలని దీప, కార్తీక్‌కు చెబుతుంది కాంచన. అదే మాట కాంచనకు చెబుతాడు కార్తీక్. మాదేనా జీవితం నీది కాదా. నీ ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని కార్తీక్ వెళ్లి చూసి నాన్న వీడియో మెసేజ్ పంపాడని చెబుతాడు. దాంతో కాంచన సంతోషిస్తుంది.
పైకి మాత్రం చూడమంటుంది. నీ పర్సనల్ నేనెందుకు చూడటం వెళ్తామని కార్తీక్ అంటాడు. వెళ్లేవాళ్లను ఆపి అందరం చూద్దామంటుంది కాంచన. వీడియో మేసేజ్ చూస్తుంది కాంచన. కాంచన ఎలా ఉన్నావ్. నా గురించే ఆలోచిస్తున్నావని తెలుసు. నీతో ఉంచడానికి నా ఆపరేషన్‌ను దేవుడు సక్సెస్ చేశాడు. ఆపరేషన్ అయిపోయింది. నేను ఇప్పుడు బాగున్నా. రేపే ఇండియా వస్తున్నా. రాగానే మొదట నిన్నే కలుస్తానని శ్రీధర్ అంటాడు.
నాన్నకు నువ్వంటే ప్రాణం అందుకే నీకు మెసేజ్ పెట్టాడు. నీకు కూడా చాలా సంతోషంగా ఉందని తెలుసు అని కార్తీక్ అంటాడు. కాంచన సిగ్గుపడుతుంది. రేపు మీరు ఉండడ్రా అని కాంచన అంటే.. జ్యోత్స్న దోషం కోసం గుడికి వెళ్లాలని కార్తీక్ చెబుతాడు. కార్తీక్, దీప వెళ్తారు. నేను మిమ్మల్ని వద్దనుకున్నా. ఈ ఐదోతనం ఉన్నంతవరకు మీరు నాతో ఉన్నట్టేనండి. ఎప్పుడు తెల్లారుతుందా అని మీకోసం ఎదురుచూస్తుంటాను అని కాంచన అనుకుంటుంది.
గుడిలో అన్నదానం, హోమం
మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్తుంది శివ నారాయణ. పంతులును పిలుస్తాడు శివ నారాయణ. అక్కడ జరుగుతున్న అన్నదానం గురించి అడుగుతాడు. ఉదయం టిఫిన్స్ నుంచి మధ్యాహ్నానం భోజనం వరకు ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారని పంతులు చెబుతాడు. ఎవరని శివ నారాయణ అడిగితే.. వారిది మీలాగే పెద్ద కుటుంబం అని చెప్పి పంతులు వెళ్లిపోతాడు.
ఇలాంటి మంచి పని ఎవరు చేసిన అభినందిద్దామని సుమిత్ర అంటుంది. తర్వాత పంతులును అడిగితే.. శాంతి హోమం చేస్తున్నావాళ్లే అని చూపిస్తాడు. అది చేస్తుంది దక్షిణామూర్తిని చూసి శివ నారాయణ వాళ్లు షాక్ అవుతారు. శివ నారాయణ వాళ్లను చూసి దక్షిణామూర్తి చూసి షాక్ అవుతాడు. పక్కనే మాలిని ఉంటుంది. మాలిని అని పారిజాతం అంటుంది.
చేసిన పాపాలు కడుక్కోడానికి ఈ అన్నదానం అనుకుంటా అని జ్యోత్స్న అంటుంది. పిల్లలు ఎంతమందని పంతులు అడుగుతాడు. కొడుకు, కూతురు అని దక్షిణామూర్తి అంటాడు. కొడుకు పేరు చెప్పమంటే.. మాలిని మొహం పక్కకు తిప్పుకుంటుంది. ఇది నా కూతురు క్షేమం కోసం చేయిస్తున్న హోమం అని దక్షిణామూర్తి అంటాడు.
ఎదురుపడిన మాలిని
అయితే వారి పేరు చెప్పండని పంతులు అడుగుతాడు. నా కూతురు పేరు సుమిత్ర, అల్లుడు పేరు దశరథ, మనవరాలు జ్యోత్స్న. వాళ్లంతా క్షేమంగా ఉండాలని దక్షిణామూర్తి అంటాడు. హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూర్ణాహుతిని హోమంలో వేయమంటాడు పంతులు. అలా శివ నారాయణ కుటుంబానికి మాలిని ఎదురుపడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.