...
...
Next Story

Karthika Deepam 2: కార్తీక దీపం 2లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్- జ్యోత్స్నలో సంచలన మార్పు- విలనిజం వదిలేయడం వెనుక సీక్రెట్?

Karthika Deepam 2: బుల్లితెరపై నెం.1 రేటింగ్‌తో దూసుకుపోతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటివరకు కార్తీక్, దీపలను విడదీయడమే ధ్యేయంగా క్రూరమైన విలనిజం పండించిన జ్యోత్స్న పాత్రలో ఒక్కసారిగా పెను మార్పు వచ్చింది. ఇది సీరియల్ ఆడియన్స్ కు షాక్ కలిగిస్తోంది.

Published on: Aug 12, 2026, 11:36:46 IST
Advertisement

Karthika Deepam 2: తెలుగు సీరియల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీగా నిలిచిన 'కార్తీక దీపం 2' ప్రస్తుతం సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తోంది. రోజువారీ ఎపిసోడ్‌ల కంటే కథలో వచ్చే క్యారెక్టర్ డైనమిక్స్ కు ఆదరణ లభిస్తోంది. తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్న విలన్ పాత్ర నుంచి కంప్లీట్ పాజిటివ్ వైపు టర్న్ తీసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కార్తీక్ ను పెళ్లి చేసుకుంటానని

కార్తీక దీపం 2లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్- జ్యోత్స్నలో సంచలన మార్పు- విలనిజం వదిలేయడం వెనుక సీక్రెట్? (jiohotstar)
కార్తీక దీపం 2లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్- జ్యోత్స్నలో సంచలన మార్పు- విలనిజం వదిలేయడం వెనుక సీక్రెట్? (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ లో ఇప్పటివరకు కార్తీక్‌ను పెళ్లి చేసుకోవడమే తన ఏకైక లక్ష్యంగా బతికిన జ్యోత్స్న, ఇప్పుడు ఆ పంతాన్ని పూర్తిగా వీడటం కథను పూర్తిగా మార్చేసింది. తన బావ కోసం దీపను చంపాలని కూడా క్రూరమైన విలన్ గా ప్రవర్తించింది జ్యోత్స్న. కానీ ఇప్పుడు సడెన్ గా మారిపోయింది.

పద్ధతైన అమ్మాయిగా

కార్తీక దీపం 2 సీరియల్ తాజా ఎపిసోడ్ విశ్లేషణ ప్రకారం.. జ్యోత్స్న తన బావ కార్తీక్ జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేయాలని ఫిక్స్ అయింది. అందులో భాగంగానే గతంలో అతను ఇచ్చిన గిఫ్ట్ లు అన్నింటినీ నిర్మొహమాటంగా వెనక్కి ఇచ్చేసింది. అంతటితో ఆగకుండా తన ఆహార్యం, ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంది.

నేలపై కూర్చుని

ఒకప్పుడు గర్వంతో ఊగిపోయిన జ్యోత్స్న, ఇప్పుడు ఏకంగా కింద నేలపై కూర్చుని భోజనం చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. కాంచన ఇంట్లో అందరితో కలిసి జ్యోత్స్న కింద కూర్చుని భోంచేసింది. అంతే కాకుండా తిన్న ప్లేటును కూడా నీట్ గా కడిగేసి డబుల్ షాక్ ఇచ్చింది.

సూరజ్ పై ప్రేమ వల్లేనా?

ఈ నేపథ్యంలో సూరజ్‌పై పెంచుకున్న అమితమైన ప్రేమ వల్లే జ్యోత్స్న ఇలా మారిందనే టాక్ వినిపిస్తోంది. జ్యోత్స్న నేరుగా తన మనసులోని మాటను చెప్పడం లేదు. కానీ ఇండైరెక్ట్ గా సూరజ్ ను పెళ్లాడాలనే బలమైన కోరికతోనే జ్యోత్స్న ఈ విధంగా ప్రవర్తిస్తోందని కథనం స్పష్టం చేస్తోంది.

విలనిజం వదిలి

సాధారణంగా టీవీ సీరియల్స్ అంటే ఒకే తరహా సాగతీత ఉంటుందనే అపవాదు ఉంది. కానీ 'కార్తీక దీపం 2' మేకర్స్ ఆ మొనాటనీని బ్రేక్ చేశారు. ఒక పక్కా విలన్ క్యారెక్టర్‌ను సడన్‌గా హోమ్లీ క్యారెక్టర్‌గా మార్చడం అనేది తెలుగు బుల్లితెరపై ఒక భారీ ప్రయోగం.

ఈ ట్విస్ట్ వల్ల రాబోయే రోజుల్లో కార్తీక్-దీపల బంధం ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోత్స్న నిజంగానే మారిందా లేక సూరజ్ కోసం ఆడుతున్న కొత్త నాటకమా? అనే ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe