Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ గుండెపోటు నిజం దాచిన కార్తీక్‌- లాగిపెట్టి కొట్టిన కాంచ‌న‌- డాక్టర్ మాటలతో షాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే మే 4 ఎపిసోడ్ లో జ్యోత్స్నకు తాత, తల్లిదండ్రులు మరోసారి బుద్ధి చెప్తారు. శ్రీధర్ కు గుండెపోటు వచ్చిందని ఎందుకు చెప్పలేదని కార్తీక్ ను కాంచన చెంపదెబ్బ కొడుతుంది. శ్రీధర్ ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్పిన మాటలకు అందరూ షాక్ అవుతారు.

Published on: May 4, 2026, 06:55:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మొండిపట్టు వదలడం లేదు. కార్తీక్ నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. మరోవైపు సీరియల్ లో సూరజ్ అనే కొత్త హీరో వస్తాడు. శ్రీధర్ ను కాపాడినందుకు కార్తీక్ అతనికి థ్యాంక్స్ చెప్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 4 ఎపిసోడ్ లో చూసేద్దాం.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

రగిలిపోయిన జ్యోత్స్న

తనను దీప, సుమిత్ర చెంపపై కొట్టిన విషయాన్ని తలుచుకుంటూ జ్యోత్స్న రగిలిపోతుంది. అప్పుడే చేతిలో భోజనం ప్లేట్ తో శివ నారాయణ, ఆ వెనకాలే ఫ్యామిలీ మొత్తం జ్యోత్స్న గదిలోకి వస్తుంది. భోజనం తినడానికి కిందకు ఎందుకు రాలేదని శివ నారాయణ అడుగుతాడు. ఆకలి ఉంది కానీ ఇంత అవమానం జరిగాక ఎలా తింటానని జ్యో అంటుంది.

బుద్ధి చెప్పిన పేరెంట్స్

అవమానం జరిగింది మాకు. కార్తీక్, దీపకు పెళ్లయి సంవత్సరం అయింది. నువ్వు ఇష్టపడింది నీకు దక్కదని తెలుసుకోవడానికి ఈ 365 రోజులు సరిపోలేదా? నీ ఆలోచన, కోరిక తప్పు. అది బయటకు చెప్పడం ఇంకా పెద్ద తప్పు. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందని తల్లిదండ్రులు జ్యోత్స్నకు బుద్ధి చెప్తారు.

పెళ్లి చేసుకోమ్మని

బండి రాంగ్ రూట్ లో వెళ్తుందని తెలిసిన నెక్ట్స్ మినిట్ లోనే యూటర్న్ తీసుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే, అంత దూరం వెనక్కి రాదు. ఇప్పటికే 12 నెలల కాలం వేస్ట్ అయింది. మంచి సంబంధం చూస్తా, పెళ్లి చేసుకో అని జ్యోత్స్నకు శివ నారాయణ అన్నం తినిపిస్తాడు. మీ నాన్న వీలునామా రాసింది నీకోసమేనని తాత చెప్తాడు.

కాంచన కోపం

సీన్ కార్తీక్ ఇంటికి మారుతుంది. కార్తీక్ ఇంటికి లేటుగా వెళ్తాడు. కాంచన తన మాటలతో కార్తీక్ ను బాధ పెడుతుంది. ఇప్పుడు ఇళ్లు గుర్తొచ్చిందా? పెళ్లాం, పిల్లలను వదిలేసి ఇప్పటివరకూ దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్లాడు. ఇప్పటివరకూ ఎక్కడికి వెళ్లావ్? అని కాంచన అడుగుతుంది. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్తే అమ్మ ఎలా ఫీల్ అవుతుందోనని కార్తీక్ అనుకుంటాడు.

హాస్పిటల్ కు వెళ్లామని

హాస్పిటల్ కు వెళ్లామని కార్తీక్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మాస్టారికి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో చేరారు. నాన్నను ఇప్పుడే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నా. కాస్త నీరసంగా ఉంటే టెస్టులు చేసుకునేందుకు వెళ్లారు అంతే. నువ్వు భోజనం చేయ్ అని కార్తీక్ అంటాడు. ఇక తినలేనని కాంచన అంటుంది. ఇంత ప్రేమ పెట్టుకున్నావ్, నాన్నను క్షమించేయొచ్చు కదా అమ్మ అని కార్తీక్ అడుగుతాడు. కాంచన సైలెంట్ గా ఉండిపోతుంది.

కార్తీక్ కు చెంపదెబ్బ

పొద్దున కార్తీక్ ను కాంచన లాగిపెట్టి చెంప మీద కొడుతుంది. మీ నాన్నకు గుండెపోటు వచ్చిందని ఎందుకు చెప్పలేదురా? అని చొక్కా పట్టుకుని అడుగుతుంది. మామూలు గుండెపోటు కాదు. దేవుడిలా ఓ అబ్బాయి వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ప్రాణాలు పోయేవి. నాకెందుకు చెప్పలేదు? చచ్చిపోయాక చెప్పాలనుకున్నావా? కావేరి కాల్ చేసింది కాబట్టి నిజం తెలిసిందని కాంచన ఏడ్చేస్తుంది.

కాంచన కన్నీళ్లు

మా అమ్మ గుండెపోటుతో చచ్చిపోయింది. నిజం చెప్తే చిన్నపిల్లలుగా ఉన్న మేం తట్టుకోలేమని చెప్పలేదు. మా అమ్మ చివరి చూపు దక్కకుండా పోయింది. ఇప్పుడు మీ నాన్నను నేను వదిలేశా. కానీ ఆయనతో కలిసి బతికా. మనిషిని వదిలేశాను కానీ మంగళసూత్రాన్ని వదిలేయలేదు. నా చావుకు భయపడను. కానీ మీకేదైనా అయితే తట్టుకోలేనని కాంచన కన్నీళ్లు కారుస్తుంది.

శౌర్యను స్కూల్లో డ్రాప్ చేయమని దీపకు కార్తీక్ చెప్తాడు. అమ్మ, కార్తీక్ హాస్పిటల్ కు వెళ్లాలని అనుకుంటారు. కాశీకి కాల్ చేసి శ్రీధర్ ను హాస్పిటల్ కు తీసుకు రమ్మని కార్తీక్ చెప్తాడు. మరోవైపు కాంచనకు నా ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పావని కావేరిని అడుగుతాడు శ్రీధర్. అప్పుడే కాశీ, శ్రీధర్, స్వప్న కలిసి హాస్పిటల్ కు వెళ్తారు. అక్కడ కార్తీక్, కాంచన కూడా ఉంటారు.

హార్ట్ వీక్

శ్రీధర్ హార్ట్ చాలా వీక్ గా ఉంది. మరోసారి స్ట్రోక్ వస్తే బతకడం కష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి. 15 రోజుల పాటు ఆయన్ని అబ్జర్వేషన్ లో ఉంచాలి. మెడిసిన్స్ వాడి మెంటల్ స్ట్రెష్ ను తగ్గించుకోవాలి. ఆ తర్వాత మళ్లీ టెస్ట్ చేసి, అవసరమైతే ఆపరేషన్ చేస్తామని డాక్టర్ చెప్తాడు.

పారు పంచ్ లు

మరోవైపు పారిజాతం, జ్యోత్స్న మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలవుతుంది. నా టైమ్ స్టార్ట్ అయినప్పుడు నా చుట్టుపక్కలా ఉండేందుకే భయపడతావని జ్యో అంటుంది. నోరు మూయమే పిల్ల బాతు బచ్చా అని పారు ఫైర్ అవుతుంది. బావ ఆడుతున్న ఆటలో నువ్వు అరటిపండువి గ్రానీ అని జ్యో అంటే, అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కదా అని పారు కౌంటర్ వేస్తుంది.

అప్పుడే దీప ఎంట్రీ ఇస్తుంది. బావ ఎక్కడని జ్యో అడుగుతుంది. బయటకు వెళ్లారని దీప చెప్తుంది. ఇంక చాలు ఆపు. ఏదో ఒక సోది చెప్తావ్? టైమ్ కు డ్యూటీకి రావడం తెలియదు కానీ ఏదో ఒకటి చెప్తావని జ్యో అంటుంది. కొందరిని మనం పెద్దగా లెక్కచేయకూడదు దీప అని పారు చెప్తుంది. దీపను గుడ్డిగా నమ్మి మోసపోయా. నువ్వు కూడా అలాగే అవుతావని జ్యో అంటుంది. పారు పంచ్ లు వేయడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More