...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: తనే సుమిత్ర నిజమైన కూతురని నమ్మిన జ్యోత్స్న- భయపడిన పారు, దాసు నిజం- కార్తీక్ వార్నింగ్

Karthika Deepam 2 Serial March 21st Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 21వ ఎపిసోడ్‌లో సుమిత్ర సేఫ్ అని డాక్టర్ హారిక చెబుతుంది. జ్యోత్స్నను పారిజాతం పలకరిస్తుంది. దీప రూమ్ దగ్గరే ఉన్నానని, ఎక్కడికి వెళ్లలేదని పారు అబద్ధం చెబుతుంది. శౌర్య విషయంలో కార్తీక్ ఇద్దరికి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు.

Published on: Mar 21, 2026, 07:21:47 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను ఎలా ఉందని పలకరిస్తాడు కార్తీక్. బాగానే ఉంది. ఇక ఆ బొమ్మ అవసరం లేదని దీప చెబుతుంది. కొందరితో రుణం పుట్టుకతోనే తీరిపోతుంది. మన బిడ్డకు పుట్టకముందే తీరిపోయింది. వదిలేయ్ దీప అని కార్తీక్ ఓదారుస్తాడు.

పారిజాతం అబద్ధం

కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 21వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 21వ తేది ఎపిసోడ్

మరోవైపు జ్యోత్స్నను ఎలా ఉందని పారిజాతం పలకరిస్తుంది. అంతా అయోమయంగా ఉందని జ్యోత్స్న అంటుంది. దీప ఎక్కడ ఉంది, నా దగ్గర నువ్వెక్కడ ఉన్నావ్, మనం హాస్పిటల్‌కు వచ్చినప్పటి నుంచి దీప దగ్గరే ఉన్నావా అని జ్యో అడుగుతుంది. దాసును కలిశానని చెబితే ఇది ఉతికి ఆరేస్తుంది అని మనసులో అనుకున్న పారిజాతం దీప రూమ్ ముందే ఉన్నాను అని అబద్ధం చెబుతుంది.

దీప ఇటువైపు ఏమైనా వచ్చిందా అని అడిగితే.. ఇటెందుకు వస్తుంది. రాలేదు అని పారిజాతం అంటుంది. అంటే నేనే సుమిత్ర నిజమైన కూతురుని అని జ్యోత్స్న అనుకుంటుంది. బావ వచ్చాడా అని జ్యో అడిగితే.. కార్తీక్ గాడు వచ్చాడు. నన్ను ఏం అనలేదు. కానీ, శౌర్య దొరికిందని హింట్ ఇచ్చాడు అని పారిజాతం అంటుంది. ఏదో జరిగింది అని జ్యో అనుకుంటుంది.

ఇంతలో కార్తీక్ వచ్చి జ్యో చేసిన త్యాగం గురించి మీడియా ముందు పెట్టాలని ఉంది. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఈరోజు నువ్వు చేసింది మీడియా ముందు పెట్టి సన్మానించాలని ఉంది. తల్లికోసం కూతురు చేసిన త్యాగం అని నాలుగైదు ఆర్టికల్స్ రాయాలని ఉంది, ప్రసంగం కూడా ఇవ్వాలని ఉంది. ఎవరికి ఎప్పుడు సన్మానం చేయాలో నాకు బాగా తెలుసు అని కార్తీక్ అంటాడు.

కార్తీక్ స్వీట్ వార్నింగ్

దశరథ్ గారి కూతురు ఇదంతా చేసింది. ఆమె గురించి ఎంత చెప్పిన తక్కువే అని హారిక అంటుంది. దీప ఎక్కడ ఉందని దశరథ్ అడిగితే.. సుమిత్రను కాపాడింది జ్యోత్స్న, నువ్వు చూడాల్సింది సుమిత్ర, జ్యోత్స్నను అని పారిజాతం అంటుంది. దీపకు కూడా చిన్న ఆపరేషన్ జరిగిందని కార్తీక్ అంటాడు. బిడ్డను దించాలనుకున్న ఆడదాని గురించి ఎందుకు. అలాంటి దాని మొహం చూడాలన్న పాపమే అని పారు అంటుంది.

దాంతో దశరథ్, దాసు ఇద్దరు కోప్పడుతారు. శివ నారాయణ వారిస్తాడు. తప్పొప్పుల గురించి ఇప్పుడే తేల్చుకుందామా అని కార్తీక్ అంటే.. అమ్మో శౌర్య టాపిక్ తీస్తే ముసలోడు ఉతికి ఆరేస్తాడని పారు భయపడుతుంది. దాంతో దీపను చూడు దశరథ అంటుంది పారు. అన్ని రోజులు మనవి కావు పారు గుర్తు పెట్టుకో అని చెప్పేసి వెళ్లిపోతాడు కార్తీక్.

కూతురుని చూసేందుకు వెళ్లాడు

వాడెందుకు అలా అన్నాడు అని శివ నారాయణ అడిగితే.. సరాదాగా అన్నాడని పారు అంటుంది. సుమిత్ర వదిన బాగుండాలని హోమం జరిపించాడు. ఇంకెందుకు డౌట్ ఉంటుంది. అందుకే వదినను, జ్యోత్స్నను కాకుండా కూతురుని చూసేందుకు వెళ్లాడు. అదే కూతురులాంటి దీపను ఓదార్చేందుకు వెళ్లాడు. దీపను ఎవరో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు క్షేమంగా ఉంది. కార్తీక్ చెప్పొద్దన్నాడు అని దాసు నిజం చెబుతాడు.

దశరథకు తెలుసా అని శివ నారాయణ అడిగితే.. కార్తీక్ చెప్పి ఉంటాడని దాసు అంటాడు. దశరథ్ ప్రవర్తన గత కొన్నిరోజులుగా విచిత్రంగా ఉంది. కార్తీక్‌తో ఎక్కువగా ఉంటున్నాడని శివ నారాయణ అనుకుంటాడు. మరోవైపు దీప పోగొట్టుకున్నదాని గురించి దశరథ్ బాధపడుతాడు. సుమిత్ర బతికి ఉందంటే దీప బిడ్డను పోగొట్టుకోవడం వల్లే కదా అని ఫీల్ అవుతాడు.

ఏది ఎంత ఇవ్వాలో దేవుడికి తెలుసు మావయ్య. అంతటితోనే సరిపెట్టుకోవాలని కార్తీక్ అంటాడు. దశరథ బొట్టు ఇస్తే దీపకు కార్తీక్ పెడతాడు. ఎవరెన్ని చెప్పిన నేను ఆశలు పోగొట్టుకోను. ఏదో వెర్రి నమ్మకం. తప్పు చేసిన మనిషిలా కుమిలి పోవాలని దశరథ్ అంటాడు. ఇంతలో శివ నారాయణ వచ్చి ఏం తప్పు చేశావని నిలదీస్తాడు. వాళ్ల గురించి ఎందుకు ఎమోషనల్ అవుతావ్ అని అంటాడు.

గుండెలు బాదుకునేవాన్ని

అక్కడ ప్రాణం నిలబడింది, ఇక్కడో ప్రాణం పోయింది. ప్రమాదవశాత్తు జరిగితే గుండెలు బాదుకునేవాన్ని అని శివ నారాయణ అంటాడు. కొన్ని త్యాగాలు గుర్తింపుకు నోచుకోవు నాన్న అని దశరథ్ అంటాడు. పారిజాతం వచ్చి ఏం త్యాగమని అంటే.. దశరథ్ కోప్పడుతాడు. ఇంతలో నర్స్ వచ్చి సుమిత్ర స్పృహలోకి వచ్చిందని చెబుతుంది. దాంతో శివ నారాయణ, పారిజాతం వెళ్లిపోతారు.

మావయ్య ఎమోషనల్‌లో నిజం చెబుతావేమో అని భయంగా ఉందని కార్తీక్ అంటే.. జరగాల్సింది జరిగిందిగా. దీప నా కూతురు అన్న నిజం చెప్పాల్సిందే అని దశరథ వెళ్లిపోతాడు. కార్తీక్ కూడా వెంటే వెళ్తాడు. నేను బతికేశామనండి, కూతురు కాపాడిందండి అని సుమిత్ర అంటుంది. నీ కూతురే నిన్ను కాపాడుతుందన్న నా మాట నిలబెట్టుకున్నానని కార్తీక్ చెబుతాడు.

దీప పరిస్థితి ఎలా ఉంది

అవును అని శివ నారాయణ అంటాడు. దీప పరిస్థితి ఎలా ఉందని సుమిత్ర అడుగుతుంది. నా భార్య క్షేమంగా ఉందని చెప్పి బిడ్డ గురించి చెప్పడం దాటేస్తాడు కార్తీక్. డాక్టర్ వచ్చి జ్యోత్స్నకు ఇంకా రెస్ట్ అవసరం, ఎటు కదలనివ్వకండి అని అంటుంది. అందరు జ్యోత్స్నను చూసేందుకు వెళ్లిపోతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks