Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో నీ మనసులో ఏముందని సుమిత్ర అడిగితే.. అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని ఉందని దీప చెబుతుంది. రా దీప నన్నే నీ కన్నతల్లి అనుకో. నా ఒడిలో నిద్రపో అని పిలుస్తుంది సుమిత్ర. శౌర్య లేస్తుంది. కన్నతల్లి సుమిత్ర ఒడిలో దీప పడుకుంటుంది. ఎమోషన్‌తో కన్నీళ్లు పెట్టుకుంటుంది.
జ్యో చేసిన ఛాలెంజ్

అప్పుడే వచ్చిన జ్యోత్స్న అది చూసి షాక్ అయిపోతుంది. ఆఫీస్‌లో తల్లిని దూరం చేస్తానని చెప్పిన ఛాలెంజ్ గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న. మమ్మీ అని జ్యో పిలిస్తే దీప లేస్తుంటే సుమిత్ర వద్దని ఉండమంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని జ్యో అడిగితే.. వేసుకున్నా, నువ్వెళ్లి పడుకో అని సుమిత్ర చెబుతుంది. దీప మాములుగా పడుకోలేదా అని జ్యోత్స్న అడిగితే.. ఇప్పుడు అమ్మమ్మే అమ్మకు అమ్మ అని శౌర్య చెబుతుంది.
అమ్మమ్మ ఒడిలో అమ్మ పడుకుంది, అమ్మ ఒడిలో నేను పడుకుంటానని శౌర్య పడుకుంటుంది. అమ్మమ్మ, తల్లి, కూతురు ముగ్గురు కలిసి ఉండటం చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. అనుకుంది సాధించావ్ కదే అని కోపంతో వెళ్లిపోతుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. సుమిత్ర, దీప, శౌర్యలను చూసి సంతోషంతో మురిసిపోతాడు కార్తీక్. దశరథ్ కూడా చూసి తెగ ఆనందిస్తాడు. వాటే సీన్ అనేలా అనిపిస్తుంది. ఇది చూసి మనకు ఎంత ఆనందంగా ఉందో, జ్యోత్స్నకు అంత కోపంగా ఉంటుంది అని దశరథ్ అంటాడు.
వాళ్లు ముగ్గురు కలిసి ఉండటాన్ని ఫొటో తీస్తాడు దశరథ్. నీ కోరిక తీరింది దీప, ఇక జ్యోత్స్నకు ఈరోజు నిద్ర పట్టదు అని కార్తీక్ అనుకుంటాడు. అలాగే, జ్యో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కాంచన పడుకోమ్మంటే నిద్ర పట్టట్లేదని జ్యో అంటుంది. దీన్నే పెళ్లేరియా అంటారే. పెళ్లి కానీ అమ్మాయిలకు వచ్చే జబ్బు కాంచన చెబుతుంది. అర్ధరాత్రి దాకా పడుకోవాలనిపించదు, ఉదయం లేవాలనిపించదు, తినే టైమ్‌కు టిఫిన్ చేస్తారు, ఒంటరిగా ఉంటారు అని కాంచన అంటుంది.
సుమిత్రకు కాంచన వెన్నుపోటు
ఈ లక్షణాలు నాలో కనపడుతున్నాయంటావ్ అని జ్యో అంటే.. పుష్కలంగా కనిపిస్తున్నాయని కాంచన అంటుంది. నా పెళ్లి బాధ్యత నీ కొడుకే తీసుకున్నాడుగా. త్వరగా చేయమంటుంది జ్యోత్స్న. నీ తండ్రి, తాతను వదిలేసి నా కొడుకు మీద పడ్డావ్ పెళ్లి అని కాంచన అంటుంది. నువ్వు సరిగ్గా చేసి ఉంటే నేను కొడుకుని పెళ్లి చేసుకుని నీకు కోడలిని అయ్యేదాన్ని అని జ్యో అంటుంది. అమ్మో నీలాంటిదాన్ని కోడలిగా భరించలేమే, నా కొడుకుని వేపుకుతినేదానివని కాంచన అంటుంది.
{{/usCountry}}ఈ లక్షణాలు నాలో కనపడుతున్నాయంటావ్ అని జ్యో అంటే.. పుష్కలంగా కనిపిస్తున్నాయని కాంచన అంటుంది. నా పెళ్లి బాధ్యత నీ కొడుకే తీసుకున్నాడుగా. త్వరగా చేయమంటుంది జ్యోత్స్న. నీ తండ్రి, తాతను వదిలేసి నా కొడుకు మీద పడ్డావ్ పెళ్లి అని కాంచన అంటుంది. నువ్వు సరిగ్గా చేసి ఉంటే నేను కొడుకుని పెళ్లి చేసుకుని నీకు కోడలిని అయ్యేదాన్ని అని జ్యో అంటుంది. అమ్మో నీలాంటిదాన్ని కోడలిగా భరించలేమే, నా కొడుకుని వేపుకుతినేదానివని కాంచన అంటుంది.
{{/usCountry}}ఆ దీప ఏమైనా మంచి చేసిందా అని జ్యో అడుగుతుంది. నీకంటే దీప వెయ్యి రెట్లు నయం. నా కొడుకు సంతోషంగా ఉన్నాడు అది చాలని. మా వదినకు సగం నీ మీద పెట్టుకున్నా బెంగే. పెళ్లి చేస్తాం. అత్తవారింటికి వెళ్లి కాపురం చేసుకో అని కాంచన అంటుంది. మీ వదిన(సుమిత్ర)కు వెన్నుపోటు పొడిచింది నువ్వే అని జ్యో అంటే.. నేను ఏం వెన్నుపోటు పొడిచానే, మా తాత, నువ్వు కలిసి ఏం చేశారో మర్చిపోయావా అని కాంచన అంటుంది.
ఈ ఇంటి ఆడపడుచులు రాకాసులని మరోసారి నిరూపించావ్ అని జ్యోత్స్న అంటుంది. ఉండవే నీ సంగతి చెబుతా అని ఫోన్ తీస్తుంది. మీ తాత, తండ్రిని రమ్మంటా అని కాంచన అనడంతో నీకు దండం పెడతా. పడుకుంటాను, నువ్వు పడుకో అని జ్యోత్స్న అంటుంది. మరుసటి రోజు ఉదయం పూజ గంట గట్టిగా వినిపిస్తుంది. దాంతో నిద్ర లేచిన జ్యోత్స్న చిరాకుగా ఫీల్ అవుతుంది. కిందకు వస్తుంది.
ఇంటిని దేవాలయంలా మార్చేసింది
శౌర్య గంట కొట్టడం కనిపిస్తుంది. దీప పూజ చేసి సాంబ్రాణి పొగతో వస్తుంది. ఇవాళ హాలీడే కదా ప్రశాంతంగా పడుకుందామనుకుంటే డిస్టర్బ్ చేస్తావేంటీ అని దీపపై అరుస్తుంది జ్యోత్స్న. ఇది డిస్టర్బ్ కాదు పూజ అని దీప అంటుంది. ఇంట్లో నెగెటివిటీ ఎనర్జీ పోడానికి దీప దూపం వేస్తుందని శివ నారాయణ మెచ్చుకుంటాడు. పుట్టింట్లో అడుగు పెట్టిన మొదటి రోజే ఇంటిని దేవాలయంలా మార్చేసింది నా కూతురు అని దశరథ్ మాట జారుతాడు.
దాంతో అంతా షాక్ అయి చూస్తారు. పట్టీలు పెట్టుకున్న తన శబ్ధం గుడిలో గంటలు మోగుతున్నట్లే ఉండదంటాడు దశరథ్. తర్వాత అందరా అయోమయంగా ఉండటం చూసిన దశరథ్ నేను ఇలా మాట్లాడాను ఏంటీ అని అనుకుంటాడు. ఇన్నాళ్లు డాడీకి నిజం తెలిసే మౌనంగా ఉన్నాడని జ్యో అనుకుంటుంది. జ్యోత్స్నకు అనుమానం వచ్చి ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి చెప్పాల్సిన మాటలు దీపకు చెబుతావేంటని కాంచన అంటుంది.
కాదు దీపకు చెప్పాల్సిన మాటలే చెప్పాడు అని పారిజాతం అంటుంది. అవును జోగిరాణి. మా అమ్మ దశరథ్ తాత కూతురే అని శౌర్య అంటుంది. సుమిత్ర అమ్మమ్మ మా అమ్మకు అమ్మ అని శౌర్య అంటుంది. ఏంటీ డాడీ ఇది అని జ్యో అడుగుతుంది. నేను చెబుతున్నా కదా. మా అమ్మ నీకు అక్క అవుతుంది. మా అమ్మకు అమ్మనాన్న ఉన్నారు. కదా అమ్మమ్మ అంతేగా అని శౌర్య అంటుంది.
సుమిత్రకు నిజం తెలిసిపోయిందా
మమ్మీకి నిజం తెలిసిపోయినట్లుంది. అందుకే రాత్రి ఒళ్లో పడుకోబెట్టుకుందని జ్యో అనుకుంటుంది. ఏంటీ దశరథ మాట్లాడవ్ అని శివ నారాయణ అంటే.. దీప కడుపుతో ఉందిగా. తల్లిదండ్రులు లేని లోటు తను ఫీల్ అవుతుందని సుమిత్ర చెప్పింది. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు తనను సొంత కూతురులా చూసుకుందాం, అలాగే పిలుద్దామని చెప్పింది. అంతేనాన్న అని దశరథ్ అంటాడు. దీప సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా బాగుంటుందిగా అని సుమిత్ర అంటుంది.
చూసేందుకు అలా అనిపించట్లేదని జ్యో అంటే.. మరి ఎలా అనిపిస్తుంది. దీప నిజంగా సొంత కూతురు అయినట్లు, నువ్వు పరాయిదానివి అయినట్లు అనిపిస్తుందా అని కార్తీక్ అడుగుతాడు. దాంతో జ్యో, పారు కంగారుపడతారు. అంతా వెళ్లిపోతారు. దశరథ్‌ను అనుమానంగా చూసిన జ్యో ఎక్కడో తేడా కొడుతుందే అనుకుంటుంది. జ్యోత్స్నకు అనుమానం వచ్చినట్లుంది. జాగ్రత్తగా ఉండాలని దశరథ్ అనుకుంటాడు.
ప్రతిసారి దీపను కూతురు అంటాడేంటీ, దీప బాగానే ఉంటుంది గానీ జ్యోత్స్న తట్టుకోలేదని అర్థం చేసుకోవట్లేదు అని శివ నారాయణ అనుకుంటాడు. మరోవైపు దాసు, కాశీ మాట్లాడుకుంటారు. పిల్లల గురించి దాసు అడుగుతాడు. నీ కోడలే ఒక చిన్నపిల్లా తనకు ఇంకో చిన్న పిల్ల కావాలా అని కాశీ అంటాడు. ఆడది ఎప్పుడు మగాడు అర్థం చేసుకున్నదానికంటే గొప్పగా ఉంటుంది. ఓసారి కోడలితో మాట్లాడు అని దాసు చెబుతాడు. ఆ మాటలు స్వప్న వింటుంది. స్వప్నను చూసిన దాసు బయట పని ఉందని చెప్పి వెళ్లిపోతాడు.
గుడికి కార్తీక్, దీప
పాపం వాళ్లు ఆడుకోడానికి బుజ్జి పాపాయిని అడుగుతున్నారు. ఇచ్చేద్దామా అని స్వప్న అనడంతో కాశీ సంతోషిస్తాడు. ఇద్దరు సిగ్గు పడతారు. కాశీని ప్రేమగా హగ్ చేసుకుంటుంది స్వప్న. మరోవైపు గుడికి వెళ్తానని దీప అంటుంది.. ఒక్కదానివే ఎలా వెళ్తావ్, కార్తీక్ ఉన్నాడుగా అని కాంచన అంటుంది. జ్యోత్స్న కండిషన్స్ గుర్తు చేస్తుందని, దాంతో అంతా వాదించుకుంటారని, ఈ గొడవలు అవసరమా కార్తీక్ అంటాడు.
అదంతా విన్న జ్యోత్స్న నువ్వు దీప గుడికి వెళ్లొచ్చు అని ఊహించని విధంగా పర్మిషన్ ఇస్తుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. కానీ, ఒక్క కండిషన్. గంటలో రావాలని జ్యోత్స్న అంటుంది. దాంతో సంతోషంగా కార్తీక్, దీప గుడికి వెళ్తారు. ఈ గంట రావడానికి, వెళ్లడానికి సరిపోతుంది. ఇంకా దీపకు బావ ఏం చెబుతాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.