చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- పాత జ్యోత్స్నల మాలినికి వార్నింగ్- తెల్లారేలోపు జ్యోని చంపేయమన్న మాలిని
Karthika Deepam 2 Serial November 21st Episode: కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 21వ ఎపిసోడ్లో తనకు రావాల్సిన డబ్బు గురించి పారు అడిగితే పని ఇంకా పూర్తి కాలేదంటుంది మాలిని. ఆఫీస్‌లో పాత జ్యోత్స్నల బాలకృష్ణ డైలాగ్‌తో మాలినికి మాస్ వార్నింగ్ ఇచ్చి ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. మాలిని మాటలు దీప వింటుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో నువ్వు తీసుకున్న నిర్ణయం, పరిష్కారం ఏంటో చెప్పమని, అది తెలుసుకునే అర్హత నాకు ఉందని సూరజ్‌తో జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు చెప్పలేను. మనుషులు తీసుకునే నిర్ణయాలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది చెప్పాల్సిన సమయం దాటిపోయింది అని సూరజ్ అంటాడు.

ఆలోచన పాడైతే చెప్పడానికి పనికిరాదు
నువ్వు ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినలేదు. అయ్యో నేను తినలేదు ఎందుకు పాడు అవుతుందని అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ఆహారం పాడైతే తినడానికి పనికిరాదు. ఆలోచన పాడైతే చెప్పడానికి పనికిరాదని సూరజ్ అంటాడు. ఇది తెలుసుకోడానికే ఉదయం వచ్చానని అని జ్యో అంటుంది. అప్పుడు కూడా ఇదే చెబుతాను అని సూరజ్ అంటాడు.
చెప్పడానికి ఏమైనా ఉందా అని జ్యో అంటే.. దిండు కింద ఉన్న తాళి తీసుకుని చూసి.. ఇంకేం లేదని, గుడ్ బై అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సూరజ్. నువ్వు ఇవ్వాలనుకున్న ముగింపు ఏంటో నేను అర్థం చేసుకోగలను సూరజ్. ఇవ్వకుండా నువ్వు ఆగిపోయినా అందుకోలేక నేను బాధపడుతున్నాను. ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరో శిక్ష అనుభవిస్తున్నారని జ్యోత్స్న అనుకుంటుంది.
మరోవైపు రాత్రి మాలినికి పారిజాతం కాల్ చేస్తుంది. డబ్బులు.. జ్యోత్స్న అకౌంట్లో 2 కోట్లు వేసి నువ్వు చెప్పినట్లుగా చెబితే నాకు డబ్బులు ఇస్తాను అన్నావుగా. ఆ డబ్బులు అని పారిజాతం అడుగుతుంది. పని ఇంకా పూర్తి కాలేదుగా అని మాలిని అంటుంది. ఇంతగొడవ జరిగిన తర్వాత కూడా నీ కొడుకు వెంట జ్యోత్స్న పడుతుంది అనుకున్నావా. ఒకవేళ అదే జరిగితే నీ కొడుకే వెంటపడాలి. పీజే ఏదైనా పని చేస్తే దానికి తిరుగుండదని పారిజాతం అంటుంది.
నా డబ్బు నాకు కావాలి
ఏ పని పూర్తికాకుండా నేను డబ్బు ఇవ్వను. కావాల్సి వస్తే జ్యోత్స్న అకౌంట్లో ఉన్న డబ్బు వాడుకో అని మాలిని అంటుంది. ఆ డబ్బులా. వాటిని జ్యోత్స్న ముట్టుకోదు. వాడుకోలేను. అది ఇవ్వదు. అది ఇవ్వకపోతే నువ్వున్నానుగా. నాకు డబ్బులు కావాలి. వెంటనే కావాలి. ఎంపుడు పంపిస్తున్నావో, ఎలా పంపిస్తున్నావో, ఎంత పంపిస్తున్నావో నాకు ఇప్పుడే తెలియాలి అని పారిజాతం అంటుంది.
నీకెం తెలియాల్సిన అవసరం లేదు అని ఫోన్ లాక్కుంటుంది జ్యోత్స్న. మాలిని కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న. మాలిని అత్తతో ఏం మాట్లాడుతున్నావ్ అని జ్యో అడుగుతుంది. నేను నీకు మంచే చేశానే. నువ్వు పాత జ్యోత్స్నవి అయితే ఇంత విడమర్చి చెప్పే అవసరం ఉండకపోయేది. నాతో చేతులు కలిపే. మాలినికి కాల్ చేసి జ్యోత్స్న సూరజ్‌ను పూర్తిగా మర్చిపోవాలంటే 2 కోట్లు కాదు. 10 కోట్లు కావాలని డిమాండ్ చేస్తాను. ఆ మాలినికి ఇంకా భయం పోలేదు. దాన్ని క్యాష్ చేసుకుందాం అని పారు అంటుంది.
ఇలా ఆడపిల్లను అడ్డుపెట్టుకుని సంపాదించుకునేవాళ్లను ఏమంటారో తెలుసా అని జ్యో అంటే.. నేను మరీ అంత దిగజారిపోలేదే అని పారు అంటుంది. అంతకంటే ఎక్కువే దిగజారిపోయావ్. కనీసం నన్ను ఇలాగైన ఉండనివ్వు అని కోపంగా వెళ్తుంది జ్యోత్స్న. నువ్వు ఇలాగే ఉంటే నేను అనుకుంది ఎక్కడ జరిగినట్లు. నీ జీవితం మారేవరకు నా పోరాటం ఆగదు. ముందు దీన్ని ఆఫీస్‌కు వెళ్లకుండా ఆపాలి అని ఓ ఐడియా వేసుకుంటుంది పారిజాతం.
చాటుమాటు యుద్ధాలు లేవు
మరుసటి రోజు ఉదయం.. జ్యోత్స్న చైర్ దగ్గరికి వెళ్లి నాకు తెలిసే నువ్వు రావని అని మాలిని అనుకుంటుంది. కానీ అప్పటికే జ్యోత్స్న వచ్చి కాఫీ తాగుతుంటుంది. జరిగిన దాని గురించి చెప్పి గదిలో ఏడుస్తూ ఉంటావనుకున్నా అన్నట్లుగా మాట్లాడుతుంది మాలిని. అలా నీ కొడుకు చేస్తున్నాడో. నువ్వు అనుకుంది జరగడానికి బాగానే ప్లాన్ వేశావుగా. ఎక్కడో విజువల్ కనిపించినట్లుందని జ్యో అంటుంది.
నా అనుభవం అంత లేదే నీ వయసు. అలాంటిది నా మీద గట్టిగా ఎగిరావు. ఇప్పుడు వాడు ఎవరిని వదులుకున్నాడో అర్థమైందా. సూరజ్ మనసులో జ్యోత్స్న లేదు. లేకుంటే పారిజాతంతో నేను ఆడించిన నాటకాన్ని ఎందుకు నమ్ముతాడు అని మాలిని అంటుంది.
ఇలా ఎన్నాళ్లు గెలుస్తావ్. నీకు నచ్చింది చేసుకో. ఇన్ని రోజులు నిన్ను ఏడిపించడానికో ఆటపట్టించడానికో నీకు కొన్ని మాటలు చెప్పేదాన్ని. కానీ, ఏరోజు అయితే సూరజ్ దృష్టిలో నా ప్రేమను అమ్ముకునే మనిషిని చేశావో ఇక నీకు నాకు చాటుమాటు యుద్ధాలు లేవు. డైరెక్ట్ వారే అని జ్యోత్స్న అంటుంది. బెదిరిస్తున్నావా అని మాలిని అంటుంది.
బాలకృష్ణ డైలాగ్‌తో జ్యో వార్నింగ్
దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో. కానీ రెండు చెవులు మాత్రం దగ్గర పెట్టుకుని విను. నేను ఈ ఆఫీస్‌లో చేరింది నీ కొడుకు కోసమే. నన్ను ప్రేమించి నాకు ఐ లవ్యూ చెప్పి నన్ను పెళ్లి చేసుకోడానికే. తాళి కట్టుకుండా వెళ్లిన నీ కొడుకుని ఎలా వదిలేస్తా అనుకున్నావ్. అంటే నా జీవితాన్ని నీకు తాకట్టు పెట్టాను అనుకున్నావా. నీ కొడుకుని నాకు ఎలా దూరం చేశావో అలాగే నీకు దూరం చేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
ఎన్ని చావుదెబ్బలు తిన్న నీకు బుద్ధి రానట్టుందని మాలిని అంటుంది. చావు దెబ్బలు కొట్టి కొట్టి నీకు అలుపు వస్తదేమో నాకు ఊపు వస్తదని లెజెండ్‌లో బాలకృష్ణ డైలాగ్ చెబుతుంది జ్యోత్స్న. ఏం చేసుకుంటావో చేసుకో. మా గ్రానీతో ఎన్ని చెప్పిస్తావో చెప్పించుకో. నేను మాత్రం లెక్కచేయను అని జ్యో అంటుంది. నా దారికి అడ్డొస్తే తొక్కిపారేస్తా అని మాలిని అంటుంది.
తొక్కేయ్.. నేను మొక్కై లేస్తా.. అని జ్యో అంటుంది. నాలో నువ్వు వన్ పర్సంటే చూశావ్. పూర్తిగా చూస్తే నా ముందు నిలబడేందుకే భయపడతావ్ అని మాలిని అంటుంది. అసలు నువ్వు నాలో చెడును చూల్లేదు అత్తా.. ఆ విజువల్ చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుంది. అవి గానీ చూశావంటే నా ముందు నిలబడటానికే కాదు నన్ను తలుచుకోడానికే భయపడతావ్ అని జ్యో అంటుంది.
మంచికి మంచి చెడుకు చెడు
అంతచెడ్డదానివా అని మాలిని అంటుంది. మంచివాళ్లకు మంచిదాన్ని చెడ్డవాళ్లకి చెడ్డదాన్ని. నీ కొడుకు ప్రేమతో పూర్తిగా మారిపోయి తెలుగింటి ఆడపడుచులా అయ్యాను. కానీ నువ్వు మాత్రం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావ్. అందుకే ఈ మార్పుకు మరికొన్ని సవరణలు అవసరం అనిపించింది. ఇక మంచికి మంచి చెడుకు చెడు. ఎవరు ఏదిస్తే అది తిరిగి ఇచ్చేయడమే అని పాత జ్యోత్స్నల మారినట్లుగా మాట్లాడుతుంది.
ఈ మాటలన్నింటిని కార్తీక్, దీప వింటారు. వార్నింగా అని మాలిని అంటే.. వార్నింగ్ ఇవ్వమన్నా ఇస్తా. త్వరలో నీ కొడుకుతో నా మెడలో మూడు ముళ్లు వేయించుకుంటా. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నీకు దమ్ముంటే కోడలిగా నా అడుగు నీ ఇంట్లో పెట్టకుండా ఆపి చూడు. కనీసం ట్రై చేయు అని మాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
అదంతా చూసిన కార్తీక్, దీప షాక్ అవుతారు. మాలిని అవాక్కవుతుంది. మరోవైపు జ్యోత్స్నను సూరజ్ చూసి షాక్ అవుతాడు. నానిని పిలిచి కోప్పడతాడు. నేను రాడానికి ముందే నా క్యాబిన్ ఎందుకు ఓపెన్ చేశావ్. నా పర్మిషన్ లేకుండా ఏ మేడమ్ చెప్పిన నా క్యాబిన్ ఓపెన్ చేయకని తిడతాడు. షెడ్యూల్స్, మీటింగ్స్ అని జ్యో అంటే.. అన్నీ నేను చూసుకుంటాను అని సూరజ్ కోపంగా సమాధానం ఇస్తాడు.
2, 3 సంవత్సరాలు పట్టొచ్చు
నీతో నాకు ప్రస్తుతానికి పనిలేదు. అవసరమైతే నేనే పిలుస్తాను. పిలవకుండా రాకు. నాతో మాట్లాడాలని చూడకు. నీ వర్క్ ఏదో చూసుకో. వెళ్లిపోయే విషయం కూడా చెప్పకని సూరజ్ కోపంగా అంటాడు. మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు మాట్లాడుతాను అని జ్యో అంటే.. ఒక 2, 3 సంవత్సరాలు పట్టొచ్చు అని సూరజ్ అంటాడు. థ్యాంక్యూ అని వెళ్లిపోతుంది జ్యోత్స్న.
జ్యోత్స్నకు మతిపోయినట్లుందని దీప అంటే.. అత్తాకోడళ్ల డ్రామా మొదలైందని కార్తీక్ అంటాడు. చచ్చేంత భయంగా ఉంది. జ్యోత్స్న మాలినికి డెడ్‌లైన్ ఇచ్చింది. నా భయమంతా అమ్మనాన్నల గురించే. ఇదంతా ఇంట్లో చెబితే అని దీప అంటుంది. అనుకో ఏంటీ చెప్పే రకమే. దానికి మనం సిద్ధంగా ఉండాలి. పారు కూడా రివర్స్‌లో ఉంది. మనకు ఎలాంటి సపోర్ట్ లేదని, మనం సూరజ్ జ్యో పెళ్లి చేయాలనుకుంటే మనవాళ్లే మనకు శత్రువులు అవుతారు అని కార్తీక్ అంటాడు.
సూరజ్ జ్యోత్స్నల పెళ్లి జరగాలంటే మాలిని పిన్ని ఎలాంటిదో సూరజ్‌కి తెలియాలి. అంతకుమించి దారిలేదని కార్తీక్ అంటాడు. ఇప్పుడు జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుందంటే అత్త నిజస్వరూపం సూరజ్ ముందు బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లే కదా. అది తెలిసి మాలిని అత్త ఎందుకు ఊరుకుంటుంది. కొడుకు కోసం జ్యోని ఏదైనా చేస్తే అని దీప అంటుంది.
మాలిని మీద కన్నేసి ఉంచు
మాలిని పిన్ని మీద ఓ కన్నేసి ఉంచు అని కార్తీక్ అంటాడు. మాలిని అత్త అహంకారి. జ్యోత్స్న ఆవిడ అహం మీద కొట్టింది. ఏదోటి చేయకుండా వదిలిపెట్టదని దీప అంటుంది. మరోవైపు సూరజ్ దగ్గరికి మాలిని వెళ్తుంది. జ్యోత్స్న ఉంటుంది. కానీ నీకు వేరే పీఏని చూడనా అని మాలిని అంటుంది. ఇక్కడ ఏం లేనప్పుడు ఎవరుంటే ఏంటని సూరజ్ అంటాడు.
వైజాక్‌కు వెళ్తావా. నువ్వే వెళ్లాలి అని మాలిని అంటే.. తాత వెళ్తాను అన్నాడుగా. అదంతా మీరే చూసుకోండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్లలేను అని సూరజ్ అంటాడు. ఛైర్మన్‌వి నువ్వే కదా. వ్యాపారం కోసం నువ్వే కలవాలని మాలిని అంటే.. సారీ నేను వెళ్లలేనంటాడు సూరజ్. సరే నేను వెళ్తాను. రాడానికి 2 రోజులు పడుతుందని మాలిని అంటుంది.
తర్వాత బాడీగార్డ్‌తో జ్యోత్స్న ఛాలెంజ్ గురించి చెబుతుంది మాలిని. నా కొడుకుని చూస్తుంటే జ్యోత్స్నని మర్చిపోయినట్లుగా ఏమి కనిపించట్లేదు. జ్యోత్స్న అనుకుంది చేసిందంటే నేను బతికి ఉండటం అనవసరం. ఈసారి దాచడం కాదు లేకుండా చేయి. ఇంకోసారి ఎవ్వరికి కనపడకూడదు. కానీ ఈ పని నువ్వు చేయకూడదు. అసలు మొత్తం మనతో సంబంధం లేనివాడితో చేయించాలని మాలిని అంటుంది.
తెల్లవారేలోగా పనైపోవాలి
చివరిగా అన్న మాటలను దీప విని ఆగుతుంది. అలా చాలామంది ఉన్నారు. మీ పేరు బయటకు రాకుండా చేసేవాళ్లు ఉన్నారని బాడీగార్డ్ అంటాడు. మిస్ అవ్వకూడదు. వాళ్లను పురమాయించు. నీ ఫోన్‌తో మాట్లాడకు. డబ్బు కూడా నీ అకౌంట్ నుంచి పంపించకూడదు. అంత థర్డ్ పార్టీతోనే జరగాలి. రేపు తెల్లవారేలోగా పనైపోవాలని మాలిని అంటుంది.
అలాగే అని బాడీగార్డ్ అంటాడు. బాడీగార్డ్‌కి అత్త ఏం చెబుతుంది అని దీప అనుకుంటుంది. దీపతో కాస్తా జాగ్రత్త. మళ్లీ నేను చెప్పేవరకు ఇటువైపు రాకు అని మాలిని అంటుంది. మీరు వెళ్లండి మేడమ్. నేను చూసుకుంటాను అని బాడీగార్డ్ అంటాడు. ఏదో జరుగుతుంది. ఈ విషయం వెంటనే బావకు చెప్పాలని దీప అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper
