Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్ ఇంట్లో శివ నారాయణ వాళ్లను పనివాళ్లు కూడా లెక్కచేయట్లేదే అని మాలిని అవమానిస్తుంది. పని మనిషి గౌరీ తీసుకొచ్చిన జ్యూస్‌ను కార్తీక్ తీసుకుని జ్యోత్స్నకు ఇస్తాడు. సూరజ్‌కి జ్యూస్ ఇచ్చి రమ్మని, నువ్వు పీఏవి తీసుకెళ్లొచ్చని కార్తీక్ అంటాడు.
నీ ప్రాణదాతకు జ్యూస్ ఇవ్వు

మాలిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. కార్తీక్ సెటైర్లు వేస్తాడు. నీ ప్రాణం కాపాడిన మనిషికి గ్లాస్ జ్యూస్ కూడా ఇవ్వలేవా.. చేస్తే ఎవరైనా అడ్డుకుంటారా ఏంటీ, ఏమైనా అంటారా ఏంటీ, నీ ప్రాణదాతకి జ్యూస్ ఇచ్చిరా అని కార్తీక్ అంటాడు. గౌరీకి చాలా పనులుంటాయి. కాఫీ పెట్టుకురా అని కార్తీక్ అంటే.. మాలినివైపు పని మనిషి చూస్తుంది.
అమ్మగారి పర్మిషన్ లేకుండా అడుగు కూడా పడదేమో అని కార్తీక్ అంటాడు. మా ఇంట్లో నీ పెత్తనం ఏంట్రా అని మాలిని అంటుంది. మా ఇంటికి వచ్చి నువ్వు చేస్తే మేము ఏమైనా అన్నామా అని కార్తీక్ పంచ్ ఇస్తాడు. జ్యోత్స్న పైకి వెళ్తుంది. చాలా ఎక్కువైంది అని మాలిని అంటే.. అప్పుడేనా.. చిన్నయ్యగారు జ్యూస్ తాగి కిందకు రాని చాలా ఉందని కార్తీక్ అంటాడు.
మీరొచ్చారు. నేను ఎంత అవమానించాలో అంత అవమానించి పంపిస్తానని మాలిని మనసులో అనుకుంటుంది. పైన సూరజ్ అటు ఇటు నడుస్తుంటాడు. జ్యోత్స్న జ్యూస్ తీసుకుని వస్తుంది. అప్పుడే సూరజ్ పడబోతుంటే.. జ్యోత్స్న పట్టుకుంటుంది. జ్యూస్ గ్లాస్ కిందపడుతుంది. సూరజ్, జ్యోత్స్న ప్రేమగా చూసుకుంటారు. కాసేపటికి సూరజ్ వదలమంటాడు.
అందుకునేంత అదృష్టం
పడిపోతావ్ అని జ్యో అంటే.. నువ్వు పట్టుకోవడం కంటే అదే బెటర్ అంటాడు సూరజ్. జ్యో వదులుతుంది. నువ్వు నాకు జ్యూస్ ఇవ్వాలనుకున్నావ్. కానీ, అది వృథా అయిపోయింది. కొన్ని అంతే మనం ఇవ్వాలనుకుంటాం. కానీ, అది ఇవ్వాలనుకునేలోపే చేజారిపోతుంది. ఇచ్చేంత ప్రేమ ఉన్నా అందుకునేంత అర్హత, అదృష్టం కూడా ఉండదు అని సూరజ్ అంటాడు.
{{/usCountry}}పడిపోతావ్ అని జ్యో అంటే.. నువ్వు పట్టుకోవడం కంటే అదే బెటర్ అంటాడు సూరజ్. జ్యో వదులుతుంది. నువ్వు నాకు జ్యూస్ ఇవ్వాలనుకున్నావ్. కానీ, అది వృథా అయిపోయింది. కొన్ని అంతే మనం ఇవ్వాలనుకుంటాం. కానీ, అది ఇవ్వాలనుకునేలోపే చేజారిపోతుంది. ఇచ్చేంత ప్రేమ ఉన్నా అందుకునేంత అర్హత, అదృష్టం కూడా ఉండదు అని సూరజ్ అంటాడు.
{{/usCountry}}అదృష్టం ఎవరికి లేదో అని జ్యోత్స్న అంటుంది. దీనిగురించే ఇద్దరు వాదించుకుంటారు. జ్యోత్స్న ప్రాణాలు కాపాడటం గురించి మాట్లాడుకుంటారు. నేనైతే ప్రేమతో చేసేదాన్ని అని జ్యో అంటే.. నేనైతే మనిషిగా చేశానని సూరజ్ అంటాడు. నేను నీ అంత మంచిదాన్ని కాదు అని జ్యో అంటే.. నాకు తెలుసు. కొందరి జీవితాలు తెరిచిన పుస్తకారు అని సూరజ్ అంటాడు.
నా పుస్తకంలో ఏం రాసి ఉందో ఎవరో చెబితే విని ఉంటావ్. అదే నిజం అనుకుంటావ్. వాస్తవం అర్థం కావాలంటే నేనే చెప్పాలని జ్యో అంటుంది. ఎవరు ఏం చెప్పిన అర్థం చేసుకునే విజ్ఞత నాకుందని సూరజ్ అంటాడు. ఏ కారణం లేకుండా నన్ను ఎందుకు కాపాడావ్ అని జ్యో అడుగుతుంది. నా దగ్గర సమాధానం లేదని సూరజ్ అంటాడు.
నీకు క్యారెక్టర్ లేదు జ్యోత్స్న
నీ దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి. కానీ చెప్పవు. నీకు ఇగో. సారీ చెప్పాలని వస్తావ్ కానీ చెప్పవు. ప్రేమ చెప్పాలని వస్తావ్ అని చూపించవ్. తాళి నీ చేతిలో పెట్టుకుంటావ్. మళ్లీ నా చేతిలో పెడతావ్ అని సూరజ్ చేసిన పనుల గురించి చెబుతుంది జ్యోత్స్న. నువ్వు ద్వేషించే మనిషి, నీ ప్రేమను అమ్ముకున్న మనిషి బ్రతికుంటే ఏంటీ చస్తే ఏంటని జ్యో అంటుంది.
జ్యోత్స్న అని ప్రేమగా అంటాడు సూరజ్. బాధగా ఉందా జ్యో అంటుంది. నన్ను షూట్ చేశాకా వాళ్లు నిన్ను ఏం చేశారో అనే భయం ఉంటుంది కదా అని సూరజ్ అంటాడు. జ్యోత్స్న ప్రేమను అమ్ముకోవడం మర్చిపోలేకపోతున్నా. నువ్వు చేసిన పని గుండెల్లోనే దిగింది. నాకు క్యారెక్టర్ ఉందని నువ్వు నాకు చాలాసార్లు చెప్పావ్. కానీ నీకే క్యారెక్టర్ లేదని సూరజ్ అంటాడు.
నువ్వు అన్న ఈ మాట ఈ పగిలిపోయిన గ్లాస్ కంటే ఎక్కువ ముక్కలయిందని జ్యో అంటుంది. నా మనసు ఎన్ని ముక్కలు అయిందో నువ్వు లెక్కపెట్టలేవు అని సూరజ్ అంటాడు. నీ చేతలు వేరు నీ మనసులు వేరు నీ మాటలు కూడా వేరు అని జ్యో అంటుంది. కింద తాత వాళ్లు చూసేందుకు వచ్చారని జ్యో చెబుతుంది. ముందు రానని వాదించిన సూరజ్ కాసేపటికి వస్తాడు.
జ్యోత్స్న 25 లక్షలు పెట్టి రక్తం కొంది
సూరజ్ క్షేమసమాచారాలు అడుగుతారు శివ నారాయణ వాళ్లు. జ్యోత్స్న పాతికలక్షలు పెట్టి సూరజ్ కోసం బ్లడ్ తీసుకున్న విషయం బయటపెడుతుంది మాలిని. దాంతో శివ నారాయణ వాళ్లు షాక్ అవుతారు. ఈ మాలినికి మతిపోయినట్లు ఉంది. కుదురుగా ఉండి చావచ్చుగా. ఈ డబ్బుల గురించి చెప్పిందంటే నా పేరు బయటకొస్తుంది. అప్పుడు ఈ ముసలోడు నన్ను చావగొడతాడు అని లోపల పారిజాతం వణికిపోతుంది.
జ్యోత్స్న మీకు చెప్పనట్టుంది. మరి ఇప్పుడైనా అడగండి. 25 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మాలిని ఇరికిస్తుంది. దాంతో సుమిత్ర అడుగుతుంది. నిజమే అని జ్యోత్స్న చెబుతుంది. అంత డబ్బు నీకు ఎక్కడిదే అని సుమిత్ర అడుగుతుంది. చెప్పమని శివ నారాయణ అంటాడు. వెనుకుండి నడిపించి ఏం తెలియనట్లు అడుగుతావేంట్రా. నీకు డబ్బే కావాలంటే నన్ను అడగరా నేనిస్తాను. ఆడపిల్లను అడ్డం పెట్టుకుని డబ్బు దండుకోవాలని చూస్తావా అని దక్షిణామూర్తి అంటాడు.
ఏం కూశావురా అని కోపంగా శివ నారాయణ పైకి వెళ్తాడు. దక్షిణామూర్తి కూడా రెచ్చిపోతాడు. ఇద్దరిని ఇంట్లోవాళ్లు ఆపుతారు. మాలిని మరింత రెచ్చగొడుతుంది. నీ మనవరాలు ప్రేమకు ఖరీదు కట్టింది కాబట్టి డబ్బు తీసుకుందని మాలిని అసలు విషయం చెప్పేస్తుంది. ప్రేమ ఖరీదు కట్టడం ఏంటని శివ నారాయణ అడుగుతాడు. కొడుకును పెంచడం చేతకాలేదు మనవరాలిని కూడా పెంచడం చాతకాలేదని దక్షిణామూర్తి అంటాడు.
నా మనవడిని వదిలేయడానికి 2 కోట్లు తీసుకుంది
రేయ్ వీడు నా పెంపకాన్ని తప్పుబడుతున్నాడురా. నీ మనవడిని చూసేందుకు వస్తే ఇదా నువ్వు ఇచ్చే మర్యాద అని శివ నారాయణ మరింత ఊగిపోతాడు. ఇద్దరు కొట్టుకునేందుకు రెడీ అవుతారు. ఇద్దరిని విడదీస్తారు. నీ మనవరాలు నా మనవడిని వదిలేయడానికి 2 కోట్లు అడిగి తీసుకుందని దక్షిణామూర్తి అంటాడు. సుమిత్ర ఏంటీ అనేది అని కోప్పడుతుంది.
నీ కూతురు నా కొడుకు మీద ప్రేమ వదిలేసుకునేందుకు 2 కోట్లు తీసుకుందని మాలిని అంటుంది. 2 కోట్లు డిమాండ్ చేసింది. డబ్బుకోసం మనసు అమ్ముకునే మనిషిని నా కొడుకుకు దూరం పెట్టాలని చూశాను మాలిని చెబుతుంది. జ్యోత్స్న ఇదంతా అబద్ధం అని చెప్పవే అని సుమిత్ర నిలదీస్తుంది. దాని బుద్ధి సరిగ్గా ఉంటే ఇదంతా ఎందుకు చేస్తుంది. దొంగల్లర్రా మీరు అని దక్షిణామూర్తి అంటుంది.
మళ్లీ శివ నారాయణ, దక్షిణామూర్తి గొడవపడుతూ రచ్చ రచ్చ చేస్తారు. రెండు తగిలించమని దశరథ అంటాడు. ఆగు మావయ్య అని కార్తీక్ అంటాడు. నీ మనవరాలు చేసిన నీతిమాలిన పని ఎక్కడ భయపడుతుందో అని భయపడి చస్తున్నాడని దక్షిణామూర్తి అంటాడు. శివ నారాయణ రెచ్చిపోతుంటే పక్కకు నెట్టి ఇద్దరు కాసేపు ఆపుతారా.. ఆగుతారా.. అని కోప్పడతాడు కార్తీక్.
కుండబద్ధలు కొట్టిన కార్తీక్
రేయ్ వాడు జ్యోత్స్న మీద నింద వేస్తున్నాడురా. జ్యోత్స్న డబ్బు తీసుకోవడం ఏంటీ అని శివ నారాయణ అంటాడు. జ్యోత్స్న డబ్బు తీసుకుంది.. ఇదే నిజం అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. శివ నారాయణ ముందు జ్యోత్స్న దోషిలా నిలబడుతుంది. ఈసారి నా పేరు చెబుతాడేమో వీడు అని పారిజాతం వణికిపోతుంది. ఒక రాయబారి చేత ఈ బేరాసారాలు జరిగాయ్ అని కార్తీక్ అంటాడు.
మాలిని పిన్ని జ్యోత్స్న అకౌంట్లో 2 కోట్లు వేసింది. ఆ డబ్బులో నుంచే సూరజ్ బ్లడ్ కొనేందుకు 25 లక్షలు వాడింది. మిగతా డబ్బంతా జ్యోత్స్న అకౌంట్లోనే ఉంది. ఇదే నిజం. ఇదంతా సూరజ్‌కు బుల్లెట తగలకముందే జరిగింది. ఈ విషయం నాకు తెలుసు, దీపకు తెలుసు. చెప్పే సందర్భం, చెప్పాల్సిన అవసరం రెండు రాలేదని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.